జూలై 18వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ నేడు టీఆర్‌ఎస్ ఎంపీలతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈసమావేశం ప్రగతిభవన్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో అనుసరించాల్సిన విధి, విధానాలు, కేంద్రాన్ని నిలదీసే అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. అయితే.. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలపై పోరాటాలని పిలుపునివ్వనున్నారు. ఈనేపథ్యంలో.. అన్ని రంగాల్లోనూ తెలంగాణకు నష్టం చేసేలా కేంద్రం అనుసరిస్తున్న విధానాలపై పార్లమెంటు వేదికగా తీవ్ర నిరసన వ్యక్తం చేయాల్సిన తీరుపై ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు కేసీఆర్. రాష్ట్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులు, మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్న తీరును ఎండగట్టేలా వ్యూహరచన చేస్తున్నారు.
read also: Godavari Floods: వరద ప్రభావిత జిల్లాలలో ఏపీఎస్డీఆర్‌ఎఫ్ బృందాల మోహరింపు
ఈనేపథ్యంలో.. కేసీఆర్ ఇప్పటికే ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ , అర్వింద్ కేజ్రీవాల్ తో పాటు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ , తేజస్వీ యాదవ్ , అఖిలేశ్ యాదవ్ , శరద్ పవార్ తో మాట్లాడిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితిపై మంత్రులు, అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తూనే.. మరోవైపు బీజేపీపై పార్లమెంటు లోపలా, బయటా సాగించాల్సిన పోరుపై వివిధ రాష్ట్రాలకు చెందిన ఆయా పార్టీల నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు టీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కాగా.. రాష్ట్ర సీఎం కేసీఆర్ చేసిన ప్రతిపాదనలకు వివిధ రాష్ట్రాల సీఎంలు.. పలువురు నేతలు సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అంతేకాకుండా.. అర్థిక క్రమశిక్షణ పాటిస్తూ అభివృద్ధి బాటలో సాగుతున్న తెలంగాణను ప్రోత్సహించకుండా కేంద్రం పెడుతున్న ఆర్థిక ఇబ్బందులను ప్రస్తావిస్తూ బీజేపీని దోషిగా నిలబెట్టే విషయమై పలు సూచనలు చేస్తారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. రైతులు వద్ధనుంచి ధాన్యం కొనుగోలు చేయకుండా రైతులకు.. మిల్లర్లను ఇబ్బందులు పెడుతున్న తీరును ఎండగట్టేలా వ్యూహరచన చేస్తున్నారు.
Basara IIIT: విద్యార్థులకు అస్వస్థత.. ఐటీ డెక్టర్, కలెక్టర్ కు మంత్రి సబితా ఫోన్