తెలంగాణ ప్రభుత్వ ఏడాది పాలనపై బీజేపీ పోరుబాట. నేటి నుంచి డిసెంబర్ 5 వరకు ఆందోళనలు. నేడు ఛార్జ్‌షీట్ విడుదల చేయనున్న బీజేపీ. రేపు జిల్లా స్థాయిలో ఛార్జ్‌షీట్ విడుదల. డిసెంబర్ 2,3న అన్ని నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు. నేడు దేశ భద్రతా వ్యవహారాలపై భువనేశ్వర్‌లో డీజీపీ-ఐజీపీల సదస్సు.. ఉగ్రవాదం, వామపక్ష తీవ్రవాదం, తీర ప్రాంత, జాతీయ భద్రతపై ప్రసంగించనున్న ప్రధాని మోడీ నేడు విజయవాడలో బీజేపీ రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్. హాజరుకానున్న పురంధేశ్వరి, కె.లక్ష్మణ్, శివప్రకాష్.…
పార్లమెంట్ దగ్గర ప్రధాని నడుస్తుండగా ఆయన వెనక ఓ మహిళా భద్రతా సిబ్బంది కనపడ్డారు. ఈ పిక్ కంగన తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీంతో ఈ ఫొటో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఢిల్లీ: నేడు ఇండియా కూటమికి చెందిన భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల సమావేశం. ఉదయం 10 గంటలకు పార్లమెంట్ భవన్లో ఇండి కూటమి భాగస్వామ్యపక్షాల ఫ్లోర్ లీడర్ల భేటీ. అదానీపై అమెరికా చేసిన నేరారోపణలపై విచారణ జరిపేందుకు ‘సంయుక్త పార్లమెంటరీ కమిటీ’ని ఏర్పాటు చేయాలంటున్న భాగస్వామ్యపక్షాలు. డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు ఏపీ హైకోర్టులో విచారణ. చంద్రబాబు, పవన్‌పై అసభ్యకర పోస్టుల కేసులో ముందస్తు బెయిల్ కోరిన ఆర్జీవీ. అత్యవసరంగా విచారణ జరపాలని విజ్ఞప్తి…
Pan Card 2.0 Use: సోమవారం జరిగిన సమావేశంలో పాన్ కార్డు 2.0ని ప్రారంభించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (CCEA) ఆదాయపు పన్ను శాఖ యొక్క పాన్ 2.0 ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ అన్ని ప్రభుత్వ ఏజెన్సీల డిజిటల్ సిస్టమ్‌ల కోసం ‘శాశ్వత ఖాతా సంఖ్య’ ను ‘కామన్ బిజినెస్ ఐడెంటిఫైయర్’ గా…
President Droupadi Murmu In Parliament: సోమవారం నాడు మొదలైన పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మంగళవారం నాడు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేటితో రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించి 75 సంవత్సరాలు పూర్తవుతుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఈరోజు పార్లమెంటు ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంయుక్త సమావేశంలో ప్రసంగిస్తారు. ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాణం, చారిత్రక ప్రయాణానికి సంబంధించిన లఘు చిత్రాన్ని కూడా ప్రదర్శించనున్నారు. రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని…
Constitution Day: భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి నేటికి 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక వెబ్సైట్ ( https: //constitution75.com)ను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
Parliament Winter session: ఇవాళ్టి (సోమవారం) నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20వ తేదీ వరకు సెషన్స్ కొనసాగనున్నాయి. సెలవులు తీసి వేస్తే మొత్తం 19 రోజులు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి.
కాలేజీ రోజులను గుర్తుచేసుకున్న ప్రధాని.. మన్‌కీ బాత్‌లో మోడీ ఏం మాట్లాడారంటే? మహారాష్ట్రలో విజయం సాధించిన తర్వాత ప్రధాని మోడీ ఈరోజు తన నెలవారీ రేడియో కార్యక్రమం మన్ కీ బాత్ ద్వారా ప్రజలతో మమేకమయ్యారు. ఈ రోజు నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (NCC) డే సందర్భంగా ఆయన తన పాఠశాల రోజులను గుర్తు చేసుకున్నారు. దేశంలోని యువత కూడా ఎన్సీసీలో చేరాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు జనవరి 12న వివేకానంద జయంతి సందర్భంగా భారత్…
కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదు.. తెలంగాణ, కర్ణాటక నుంచి కాంగ్రెస్ నేతలు తీసుకెళ్లిన డబ్బు సంచులు మహారాష్ట్ర ఎన్నికల్లో పనిచేయలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. మహాయుతి కూటమి అభివృద్ధి మంత్రాలకే మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రచారం చేసినా.. మహారాష్ట్రలో కాంగ్రెస్‌ను ప్రజలు చీదరించుకున్నారని అన్నారు. అబద్దపు ప్రచారం చేసిన రాహుల్ గాంధీ కాంగ్రెస్…