JPC First Meeting: నేడు ఒకే దేశం- ఒకే ఎన్నికపై జేపీసీ మొదటి సమావేశం..
- ఒకే దేశం- ఒకే ఎన్నికపై నేడు జేపీసీ మొదటి సమావేశం..
- సభ్యులకు చట్టాల నిబంధనలను తెలియజేయనున్న న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు..
- జేపీసీ నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్‌లో మొదటి వారం చివరి రోజున లోక్‌సభలో సమర్పించాలి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
JPC First Meeting: ఒకే దేశం, ఒకే ఎన్నికల ప్రతిపాదనకు సంబంధించిన బిల్లులను పరిశీలించేందుకు ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ (JPC) తొలి సమావేశం ఈరోజు (జనవరి 8) జరగబోతుంది. ఈ సమావేశంలో ప్రతిపాదిత చట్టాల నిబంధనలను జేపీసీ సభ్యులకు న్యాయ మంత్రిత్వ శాఖ అధికారులు వివరించనున్నారని సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. అంతేగాక పలువురి అభిప్రాయాలను కూడా జేపీసీ తీసుకోనున్నట్టు తెలుస్తుంది. అయితే, జేపీసీ తన నివేదికను వచ్చే పార్లమెంట్ సెషన్‌లో మొదటి వారం చివరి రోజున లోక్‌సభలో సమర్పించాలి. ఈ నేపథ్యంలోనే దీనిపై సుధీర్ఘ చర్చ చేపట్టేందుకు కమిటీ సభ్యులు చర్యలు వేగవంతం చేసినట్టు సమాచారం.
Read Also: ISRO New Chief: ఇస్రో కొత్త ఛైర్మన్‌గా డాక్టర్ వి.నారాయణన్..
Also Read
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
- IAF: భారత్‌కు ప్రతీ ఏడాది 40 యుద్ధవిమానాలు అవసరం.. ఐఏఎఫ్ చీఫ్ కీలక వ్యాఖ్యలు..
- PL-15E: జపాన్ తర్వాత ఫ్రాన్స్.. భారత్‌కు చిక్కిన చైనా PL-15E మిస్సైల్ రహస్యాలపై ఆసక్తి!
కాగా, పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లు, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల (సవరణ) బిల్లును లోక్‌సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్‌వాల్ ప్రవేశ్ పెట్టారు. ఈ తీర్మానికి లోక్ సభ ఆమోద ముద్ర వేసింది. అయితే, ప్రతిపక్ష సభ్యుల నుంచి వ్యతిరేకత రావడంతో ఈ బిల్లుపై మరింత కసరత్తు చేయడానికి కేంద్ర సర్కార్ జేపీసీకి ఈ బిల్లును పంపించింది. 39 మంది సభ్యులతో కూడిన కమిటీకి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్‌ను నుంచి ప్రియాంక గాంధీ, జేడీయూ- సంజయ్ ఝా, శివసేన (షిండే)కు చెందిన శ్రీకాంత్ షిండే, తృణమూల్‌కు చెందిన కళ్యాణ్ బెనర్జీ, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్‌తో పాటు తదితరులు సభ్యులుగా ఇందులో ఉన్నారు.
తాజావార్తలు
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
-
AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
-
Dada : గాయాన్ని సైతం లెక్కచేయని నందమూరి డెడికేషన్.. బాక్సాఫీస్ బరిలోకి దిగుతున్న బాలయ్య
-
Telangana Civil Supplies : రైస్ మిల్లర్లకు తెలంగాణ సర్కార్ వార్నింగ్.. ఆస్తులు జప్తే
-
CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!