PM Modi: భా భారతదేశంలో అధునాతన యుద్ధనౌకలు ఐఎన్‌ఎస్ సూరత్, ఐఎన్‌ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్‌లను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు. ముంబైలోని నావల్ డాక్‌యార్డ్‌లో ఈరోజు నౌకలను నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ యుద్ధనౌకలతో భారత నేవీ బలం మరింత పెరిగినట్లైంది. ఆయుధ తయారీ, సముద్ర భద్రతలో అగ్రగామి కావాలనే టార్గెట్ దిశగా భారత్ ముందుకు కొనసాగుతుంది.
Read Also: TCL 115inches TV: ఇంటిని సినిమా హాలులా మార్చే టీవీ వచ్చేసిందోచ్
ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ.. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారుతుందన్నారు. భద్రమైన సముద్ర మార్గాల కోసం ట్రై చేస్తున్నాం.. ఈ మూడు మేడిన్ ఇండియా.. మేము విస్తరణవాదంతో కాదు.. వికాసవాదంతో పని చేస్తున్నామని తెలిపారు. రక్షణ రంగంలో మేకిన్ ఇండియా ఆవిష్కృతం అవుతోందని చెప్పారు. అలాగే, వన్ ఎర్త్, వన్ ఫ్యామిలీ, వన్ ఫ్యూచర్ అంటూ ప్రధాని పేర్కొన్నారు. ఇక, ఈ మూడు యుద్ధ నౌకలు భారత్‌కు మరింత శక్తినిస్తాయన్నారు. అంతర్జాతీయ కార్గో మార్గాలను భారత్ సురక్షితంగా కాపాడుతోంది. నేవీ బలోపేతం వల్ల ఆర్థికంగా ప్రగతి సాధిస్తామని నరేంద్ర మోడీ చెప్పుకొచ్చారు.
Read Also: Rahul Gandhi: జాతీయ జెండాకు నమస్కరించని ఆర్ఎస్ఎస్.. దేశం గురించి మాట్లాడుతుంది..
ఐఎన్‌ఎస్ నీలగిరి.. పీ17A స్టెల్త్ ఫ్రిగేట్ ప్రాజెక్టులో తొలి యుద్ధనౌక ఇది. శత్రువును ఏమార్చే స్టెల్త్ పరిజ్ఞానంతో దీన్ని రూపొందించారు.
ఐఎన్‌ఎస్ సూరత్.. పీ15B గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ ప్రాజెక్ట్ కింద నాలుగో యుద్ధనౌకను అభివృద్ధి చేస్తున్నారు. ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక డిస్ట్రాయర్ యుద్ధ నౌకల్లో ఇదొక్కటి. ఇందులో స్వదేశీ వాటా 75 శాతం కలిగి ఉంది. ఈ యుద్ధ నౌక అధునాతన ఆయుధ- సెన్సర్ వ్యవస్థలను కలిగి ఉంది. నెట్‌వర్క్ సెంట్రిక్ సామర్థ్యం దీని సొంతం అన్నమాట.
ఐఎన్‌ఎస్ వాఘ్‌షీర్.. పీ75 కింద తయారు చేస్తున్న ఆరో, చివరి జలాంతర్గామి ఇది. ఫ్రాన్స్‌కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో ఈ జలాంతర్గామిని అభివృద్ధి చేశారు.
#WATCH | Mumbai: On the commissioning of three frontline naval combatants, PM Narendra Modi says, "…It is a matter of pride that all three frontline naval combatants are Made in India. Today's India is emerging as a major maritime power in the world." pic.twitter.com/DisB0t8oDY
— ANI (@ANI) January 15, 2025