PM Modi: నేడు ఒడిశాలోని భువనేశ్వర్‌లో జరుగుతున్న 18వ ప్రవాస భారతీయ దినోత్సవ కార్యక్రమంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒడిశాలో అడుగడుగునా వారసత్వమే కనిపిస్తుంది.. ఇక్కడి నుంచి వ్యాపారులు సుమత్రా, బాలి, జావా లాంటి ప్రాంతాలకు వెళ్లి వ్యాపారాలు చేసేవారని తెలిపారు. ప్రజాస్వామ్యానికి కేవలం భారత్ తల్లి లాంటిది మాత్రమే కాదు.. అది మన జీవితాల్లో భాగం అని ఆయన వెల్లడించారు. జీ20 సందర్భంగా భారత్ వైవిధ్యాన్ని ప్రపంచానికి తెలియజేశామని చెప్పారు. మన దగ్గర ఉన్న విభిన్న సంస్కృతులను ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయి.. భారతదేశం స్వాతంత్ర్యం సాధించడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రవాసుల పాత్ర కూడా ఉందని నరేంద్ర మోడీ తెలిపారు.
Read Also: Tirupati Stampede: మృతుల సంఖ్య పై క్లారిటీ ఇచ్చిన ఆరోగ్య శాఖ మంత్రి..
అయితే, ప్రవాస భారతీయులు వచ్చే ఏడాది ఈ ఉత్సవానికి వచ్చేటప్పుడు ఐదుగురు విదేశీ మిత్రులను తమతో పాటు తీసుకు రావాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సూచించారు. భారత్ కేవలం యువ దేశమే కాదు.. నిపుణులైన యువకుల దేశం కూడా అని చెప్పుకొచ్చారు. భారత్‌కు ‘విశ్వబంధు’గా పేరుంది.. దానిని మరింత బలోపేతం చేస్తామన్నారు. మహాకుంభ్, సంక్రాంతి, లొహిర్, మాగ్ బిహు లాంటి పండుగల సీజన్‌లో ప్రవాస భారతీయ వేడుకలు జరపడం విశేషం అన్నారు. ఈ సందర్భంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో అధ్యక్షుడు క్రిస్టీనే కార్ల వీడియోలో పంపిన సందేశంలో భారత్ యొక్క పురోగతి గురించి వెల్లడించారు.
Read Also: RK Roja: తిరుపతి ఘటనపై స్పందించిన రోజా.. పవన్ కళ్యాణ్‌పై సంచలన వ్యాఖ్యలు..
కాగా, రష్యా, ఇజ్రాయెల్ పేర్లను నేరుగా ప్రస్తావించకుండా భవిష్యత్తు యుద్ధంలో కాదని.. బుద్ధుడిలో ఉందని నరేంద్ర మోడీ తెలిపారు. అశోకుడు ఖడ్గంతో సామ్రాజ్య విస్తరణకు ఛాన్స్ ఉన్నా.. బౌద్ధం స్వీకరించారని ఆయన గుర్తు చేశారు. ఈ ఉత్సవాల్లో భాగంగా మోడీ ప్రవాసి భారతీయ ఎక్స్‌ప్రెస్’ రైలును భువనేశ్వర్‌లో జెండా ఊపి ఆరంభించారు. ఈ కార్యక్రమంలో విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్, ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీతో పాటు తదితరులు పాల్గొన్నారు.