Putin- Modi Meeting: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ త్వరలోనే భారత్‌లో పర్యటించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ ఆహ్వానం మేరకు పుతిన్ డిసెంబర్ 4-5 తేదీలలో భారతదేశాన్ని సందర్శించనున్నారు.
Putin India Visit: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ డిసెంబర్ 4-5 తేదీల్లో భారత్‌లో పర్యటించబోతున్నారు. పుతిన్ పర్యటనపై రష్యా, భారత్ రెండు దేశాలు కూడా ఆసక్తిని కనబరుస్తున్నాయి. ముఖ్యంగా, రెండు దేశాల మధ్య రక్షణ, ఇంధనం, ఉక్రెయిన్ యుద్ధం అంశాలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
India slams Pak: అయోధ్య రామ మందిరంలో ప్రధాని నరేంద్రమోడీ కాషాయ జెండా ఎగరేయడంపై పాకిస్తాన్ అనుచిత వ్యాఖ్యలు చేసింది. పాకిస్తాన్ వ్యాఖ్యలపై భారత్ బుధవారం తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యలపై విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఘాటుగా బదులిచ్చారు. ‘‘పాకిస్తాన్ చేసిన వ్యాఖ్యల్ని గమనించాం. మతతత్వం, అణచివేత, మైనారిటీల పట్ల దుర్వినియోగం చేయడంలో తీవ్రమైన చెడ్డ పేరు ఉన్న పాకిస్తాన్, ఇతరులకు ఉపన్యాసాలు ఇచ్చే నైతిక స్థితి లేదు. కపట ధర్మాలను…
ఒక చాయ్‌వాలా దేశానికి ప్రధాని అయి, దేశ దిశ మార్చారంటే అది రాజ్యాంగం మనకు ఇచ్చిన గొప్ప వరం.. సాధారణ వ్యక్తి అయిన అబ్దుల్ కలాం రాష్ట్రపతి అయ్యారు.. భారత రత్న పొందారు.. పవర్ ఫుల్ రాష్ట్రపతిగా వ్యవహరించారని సీఎం చంద్రబాబు అన్నారు.
Nitish Kumar: దేశంలో నితీష్ కుమార్ రికార్డ్ సృష్టించబోతున్నారు. 10వ సారి బీహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. నేను పాట్నాలోని గాంధీ మైదాన్‌లో సీఎంగా నితీష్ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్రమోడీతో సహా ఎన్డీయే నేతలు హాజరుకాబోతున్నారు.
సీబీఐ విచారణ వేసే దమ్ము ఉందా.? మాజీ ఎమ్మెల్యే హాట్ కామెంట్స్..! మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి తిరుమల పరకామణి కేసులో ఎవిఎస్వో సతీష్ కూమార్ ఆత్మహత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సతీష్ కూమార్ మరణం వెనుక పెద్ద కుట్ర ఉందని, ఇది సాధారణ ఆత్మహత్య కాదని అది ప్రభుత్వ హత్య అని ఆరోపించారు. తిరుపతి విజివో, డీఎస్పీ రాంకుమార్ పలుమార్లు సతీష్ కూమార్ను తీవ్రంగా వేధించారని తెలిపారు. సిఐడి విచారణలో అధికారులు అతన్ని…
బీహార్ ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభంజనం సృష్టించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. బీహార్‌లో సుపరిపాలన, అభివృద్ధి విజయం సాధించిందన్నారు.
PM Modi: ప్రధాని భూటాన్ నుంచి తిరిగి వచ్చారు. దేశ రాజధానిలో అడుగు పెట్టిన వెంటనే పేలుడులో గాయపడిన వారిని పరామర్శించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఢిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రికి చేరుకున్నారు. ఢిల్లీ విమానాశ్రయం నుంచి నేరుగా ఆసుపత్రికి వెళ్లారు. ఇప్పటికే దాదాపు 100 మంది ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులకు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉండగా.. ఢిల్లీ పేలుళ్లపై…
ఉప ఎన్నికలో 25 వేల ఓట్లు వస్తే.. కిషన్ రెడ్డికి మరొకసారి పొన్నం ఛాలెంజ్! కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి మంత్రి పొన్నం ప్రభాకర్ మరోసారి సవాల్ విసిరారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థికి 25 వేల ఓట్లు వచ్చాయని, ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో 25 వేలకు ఒక్క ఓటు తగ్గకుండా తీసుకువస్తే.. మీరేం (కిషన్ రెడ్డి) చెబితే అందుకు తాను సిద్ధం అని చెప్పారు. 25 వేల ఓట్లు బీజేపీ…
Yogi Adityanath: ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ సోమవారం ప్రతిపక్ష ఇండి కూటమి నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్‌లను ‘‘పప్పు, తప్పు, అక్కు’’గా ప్రస్తావించారు.