EU-India FTA: యూరోపియన్ యూనియన్(EU)-భారత్ మధ్య ఎన్నాళ్ల నుంచో ఎదురుచూస్తున్న స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) త్వరలో కుదురబోతోందని ఈయూ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్ అన్నారు. మంగళవారం దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఆమె సంకేతాలు ఇచ్చారు. ‘‘ఇంకా చేయాల్సిన పని ఉంది. కానీ మనం ఒక చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం అంచున ఉన్నాము. కొందరు దీనిని అన్ని ఒప్పందాలకు తల్లి(మదర్ ఆఫ్ ఆల్ డీల్స్) అని పిలుస్తారు.’’ అని అన్నారు. ఇది 2 బిలియన్ల ప్రజల మార్కెట్‌ను సృష్టిస్తుందని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉంటుందని ఆమె చెప్పారు.
Read Also: Asim Munir: పాకిస్తాన్ ఏ లక్ష్యం కోసం ఏర్పడిందో, అది ఇప్పుడు నెరవేరుతోంది..
ఈయూ-ఇండియా ట్రేడ్ డీల్ ప్రపంచంలో అభివృద్ధి చెందతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థనున, ప్రపంచ వాణిజ్యానికి కేంద్రంగా ఉన్న ఈయూతో అనుసంధానించనుంది. 2007 నుండి భారతదేశం-EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం పురోగతిలో ఉన్నప్పటికీ, చర్చలు దాదాపు ఒక దశాబ్దం పాటు నిలిచిపోయాయి. అయితే, 2022 నుంచి మళ్లీ ఈ చర్చలు ప్రారంభమయ్యాయి. ఈయూ, భారత్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం ఇప్పటికే చారిత్రాత్మక గరిష్టానికి చేరుకుంది. 2023లో వస్తువులు వాణిజ్యం 124 బిలియన్ యూరోలకు చేరుకుంది. మరోవైపు, వాన్ డెర్ లేయన్స్ వచ్చే వారం ప్రారంభంలో భారత్‌కు రాబోతున్నారు. భారత్-ఈయూ నేతల సమావేశానికి ముందు ఆమె పర్యటన జరుగుతోంది. ఈ పర్యటన తర్వాత, ట్రేడ్ డీల్‌లో ప్రకటన వచ్చే అవకాశం కనిపిస్తోంది.