ప్రస్తుతం భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వివిధ మంత్రిత్వ శాఖల కార్యదర్శులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పౌర రక్షణ యంత్రాంగాలను బలోపేతం చేయడం, తప్పుడు సమాచారం, నకిలీ వార్తలను ఎదుర్కోవడానికి ప్రయత్నాలు, మౌలిక సదుపాయాల భద్రత వంటి అంశాలపై చర్చించారు.
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి ప్రతిస్పందనగా.. భారత వైమానిక దళం జరిపిన వైమానిక దాడిలో పాకిస్థాన్లోని డజన్ల కొద్దీ రహస్య స్థావరాలు ధ్వంసమయ్యాయి. ఆపరేషన్ సిందూర్లో అనేక మంది ఉగ్రవాదులు మరణించారు. ఇప్పటి వరకు దాదాపు వంద మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఈ అంశంపై ''ఇది మనమంతా గర్వించదగిన సమయం'' అని అభివర్ణించారు. సాయుధ బలగాలు కచ్చితమైన లక్ష్యాలపై దాడులు జరిపారంటూ ప్రశంసించారు. పాకిస్థాన్ లోపలకు చొచ్చుకెళ్లి పంజాబ్ ప్రావిన్స్లో 4 చోట్ల, పాక్…
పహల్గామ్లో క్రూరమైన ఉగ్రవాద దాడి చేసిన ఉగ్రవాదులను భారత దళాలు ఎంపిక చేసి హతమార్చాయి. మే 6-7 రాత్రి, భారత సాయుధ దళాలు పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లలో 25 నిమిషాల పాటు దాడి చేసి, తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశాయి. ఉగ్రవాద నెట్వర్క్ వెన్నెముకను విచ్ఛిన్నం చేశాయి. ఈ అంశంపై తాజాగా భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ మీడియాతో మాట్లాడారు. భారత్ ఎవరిని లక్ష్యంగా చేసుకుందో తెలిపారు. అమాయకుల ప్రాణాలు తీసిన వారు…
కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడికి భారత్ ప్రతీకారం తీర్చుకుంది. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారతదేశం "ఆపరేషన్ సిందూర్" నిర్వహించింది. పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగా చేసుకుని, భారత వైమానిక దళం, భారత సైన్యం, నావికాదళం సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ దాడిలో క్షిపణులు ప్రయోగించారు. ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేశారు.
ఇండియాకు ఇజ్రాయెల్ బాసట.. దాడులు కొనసాగించాలని సూచన! పాకిస్తాన్ పై దాడులు తప్పవని భారత ప్రభుత్వం గత కొన్ని రోజులుగా చెబుతునే వస్తుంది. అన్నట్లుగానే మంగళవారం అర్థరాత్రి పాకిస్తాన్ లోని ఉగ్ర స్థావరాలపై ఇండియన్ ఆర్మీ దాడులకు దిగింది. మొత్తం 9 ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని విజయవంతంగా ధ్వంసం చేసింది. ఇక, పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (పీఓకే) లోని ఉగ్రవాద స్థావరాలపై భారత సైన్యం దాడులకు ఇజ్రాయెల్ బాసటగా నిలిచింది. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి…
ఆపరేషన్ సింధూర్ను ప్రారంభించిన భారత ఆర్మీ.. పాక్ పై మెరుపుదాడులు.. భారత్- పాకిస్తాన్ సరిహద్దులో తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ను ఇండియన్ ఆర్మీ ప్రారంభించింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో దాయాది దేశంలోని 9 ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులకు దిగింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలే లక్ష్యంగా భారత సైన్యం మెరుపు దాడులు చేసింది. మొత్తం 9 పాక్ ఉగ్ర స్థావరాలను ఇప్పటి వరకు భారత ఆర్మీ ధ్వంసం…
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి పునఃనిర్మాణం సభలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సభ జరిగే సమయంలో వర్షం వస్తుందని తాము అనుకున్నట్లు చెప్పారు. మోడీ ఓ మాట చెప్పారని గుర్తు చేశారు. ” ఈ రోజు వర్షం వస్తుందని మేము అనుకున్నాం. కానీ మోడీ వస్తున్నారంటే.. వర్షం కూడా రాకుండా దేవతలు మొత్తం ఆశీర్వదించారంటే అది ఈ అమరావతి పవర్. ఇప్పుడే ప్రధాని నాతో ఓ మాట అన్నారు. నా 25…
అమరావతి రాజధాని పునర్నిర్మాణం చేస్తున్నామంటే ఈరోజు కంటే ప్రత్యేకమైన రోజు మరి ఏది ఉండదలని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీకి ధన్యవాదాలు తెలిపారు. గతంలో మోడీని ఎప్పుడు కలిసిన చాలా ఆహ్లాదకరంగా ఉండేవారని.. కానీ మొన్నటి సమావేశంలో అమరావతికి రమ్మని పిలవడానికి వెళ్తే.. తమ భేటీ చాలా గంభీరంగా సాగిందని గుర్తు చేశారు.
రాజధాని నిర్మాణానికి 34000 ఎకరాలు ఇచ్చిన 29 వేల పైచిలుకు రైతులుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నమస్కారాలు తెలిపారు. అమరావతి రైతులు ఐదు సంవత్సరాలుగా నలిగిపోయారని.. రోడ్ల మీదకు వచ్చి, ముల్లకంచెలపై కూర్చొని, పోలీసులు లాఠీ దెబ్బలు తిని, కేసులు పెట్టించుకున్నారని గుర్తు చేశారు. 2000 రైతుల ప్రాణాలు కోల్పోయాయని చెప్పారు. రైతులు నలిగి బాధపడి, తమ కన్నీళ్లు తుడిచేవారు ఉన్నారా? అని చాలామంది మహిళలు రైతులు ఆ రోజుల్లో తను అడిగిన సన్నివేశాన్ని గుర్తు…