Narayanaswamy vs Thomas: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, ఎమ్మెల్యే థామస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. దళితులపై కూటమీ ప్రభుత్వం దాడులు కొనసాగుతున్నాయని.. అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన వ్యక్తిని అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తే దళితుడైన నాపైన అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ ఫైర్ అయ్యారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి… ఎమ్మెల్యే థామస్ అసలు దళితుడే కాదని కోట్లాది రూపాయల ప్రకృతి సంపదను నియోజవర్గంలో దోచుకుంటున్నాడంటూ…
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి పై హాట్ కామెంట్స్ చేశారు ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. చిత్తూరు జిల్లా వెదరు కుప్పం మండలంలో 395 మహిళా సంఘాలకు 61 కోటి 95 లక్షల నిధుల చెక్కును పంపిణీ చేసిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే డాక్టర్ థామస్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అన్నారు.
ఏపీలో అధికారం మారాక ఆ మాజీ డిప్యూటీ సీఎం ఎందుకు కంటికి కనిపించడం లేదు? మాట వినిపించడం లేదు? అధికారంలో ఉన్నప్పుడు అత్యంత కీలకమైన శాఖను చూసి, ఇప్పుడా వ్యవహారాల మీద ఏకంగా సీఐడీ దర్యాప్తు జరుగుతున్నా ఆయన కిక్కురుమనడం లేదు ఎందుకు? మేటర్ తనదాకా వస్తుందన్న భయమా? వస్తే ఏం చేయాలో అర్ధంకాని గందరగోళమా? నిజంగానే ఆయన ప్రమేయం బయటపడితే అజ్ఞాతంలో ఉన్నా వదులుతారా? ఇంతకీ ఎవరా లీడర్? ఎందుకా అజ్ఞాతవాసం? నారాయణస్వామి.. … ఏపీ…
నెల్లూరు జిల్లా నాయుడుపేటలో వైసీపీ సామాజిక సాధికార చైతన్య యాత్ర బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగన్ వచ్చిన తర్వాత బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వాలు పట్టించుకోలేదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు రాజకీయ పదవులను ఇచ్చారని తెలిపారు. మరోవైపు.. చంద్రబాబు ఎస్సీలను అవమానించారని, ఎస్సీలుగా ఎవరైనా పుడతారా అని అన్నారని పేర్కొన్నారు.
చంద్రబాబుపై ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. వైసీపీపై టీడీపీకి సంబంధించిన మీడియా దుష్ప్రచారం చేస్తోందని ఆరోపించారు. ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారని చంద్రబాబు అన్నారు.. ఎస్సీలకే కాదు.. ఎస్టీలకు కూడా చంద్రబాబు ఏమీ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లనిచ్చిన మామ రామారావు చావుకు చంద్రబాబు కారణమయ్యారని తెలిపారు. చంద్రబాబుకు భూదాహం ధనదాహం ఎక్కువ.. కానీ పేదలపై ప్రేమ లేదని నారాయణ స్వామి ఆరోపించారు.
చిత్తూరు జిల్లా ఎస్ఆర్ పురం మండలం ముద్దిగుప్పం పంచాయతీలో జగనన్న స్వేచ్ఛ ఆరోగ్య కార్యక్రమంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి పాల్గొన్నారు. త్వరలో ఏపీలో ఎన్నికల నేపథ్యంలో నారాయణస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. తాను డబ్బులు ఇచ్చి ఓటు అడగని వ్యక్తిని అని అన్నారు. అంతేకాకుండా.. ఎలక్షన్ లో నిలబడి ఎవరి దగ్గర తాను ఒక రూపాయి తీసుకోలేదని చెప్పారు. ఏ పోస్టు అడిగిన తాను ఫ్రీగా చేశానన్నారు. కాంట్రాక్టర్ల దగ్గర తాను డబ్బు తీసుకోలేదని…
చిత్తూరులో అధికార పార్టీ కేడర్… ద్వితీయ శ్రేణి నాయకులు మెత్త పడ్డారా..? మునుపటి జోష్ లేకపోవడానికి కారణం ఏంటి? ఏదైనా కార్యక్రమానికి పిలుపు ఇవ్వడం ఆలస్యం… ఓ రేంజ్‌లో హడావిడి చేసే నాయకులు ఇప్పుడు ఏమైపోయారు? ప్రస్తుతం ఆజిల్లాలో ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ఏ పార్టీకి అయినా కేడర్‌లకే బలం. ఇక నాయకుడు ఎక్కడ ఉంటే కార్యకర్తలు ఆయన వెంట తిరుగుతుంటారు. ఎక్కడైనా జరిగేది అదే..! కానీ చిత్తూరు జిల్లాలో మాత్రం సీన్ రివర్స్‌లో ఉందన్న…
చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం. వైసీపీలో వర్గ వివాదాలు.. విభేదాలు.. గ్రూప్ పాలిటిక్స్‌కు నగరి కేరాఫ్ అడ్రస్. ఇక్కడ పంచాయితీలు పలుమార్లు వైసీపీ అధిష్ఠానం వరకు వెళ్లాయి. అయినప్పటికీ రివెంజ్ పాలిటిక్స్ కొదవ లేదు. నగరి నుంచి 2014, 2019 ఎన్నికల్లో వరసగా వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచారు ఆర్కే రోజా. సొంత పార్టీలోనే ఆమెకు అసమ్మతి సెగ ఉంది. గత ఎన్నికల సమయంలో ఈ సమస్య మరింత ముదిరి పంచాయతీ, పరిషత్, మున్సిపల్ ఎన్నికల నాటికి తారాస్థాయికి…
చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో భూ మాఫియా రెచ్చిపోయి కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. వెదురుకుప్పం మండలం లోని కొంతమంది నాయకుల అండదండలతో ఫేక్ పట్టాదారు పాసు పుస్తకాలు తయారుచేసి విచ్చలవిడిగా దందా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఆళ్ల మడుగు, దేవరగుడిపల్లి, వెదురుకుప్పం, చుట్టుపక్కల ప్రాంతాలలో ఇటువంటి సంఘటనలు కోకొల్లలుగా వెలుగులోకి వచ్చాయి, ఒక నాయకుడు ఏకంగా గుట్టని,చెరువుల్ని కూడా వదలకుండా గత కొన్ని సంవత్సరాలుగా తన సొంత ప్రయోజనాల కోసం వాడేశారు. తన పేరు…