ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి సిద్ధం అవుతోంది ప్రభుత్వం… దీనిపై ఇవాళ మంత్రి పేర్నినానితో సినీ పెద్దలు సమావేశమై.. ఆన్‌లైన్ విధానానికి ఓకే చెప్పారు.. అయితే, ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాన్ని సమర్థిస్తూనే.. సినీ పరిశ్రమకు చురకలు అంటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విశాఖలో మడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ విధానాలపై స్పందించారు.. ఇక, ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయిన ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే…
నేతల క్రిమినల్ రికార్డులపై రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది రాజకీయ నేతలకు ఇష్టం లేని అంశంగా ఉందని.. అందుకే సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతిని కలిసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన…
తనకు నగరి నియోజకవర్గం నుంచి పోటీచేసే ఆలోచనే లేదని స్పష్టం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. గతంలో తనకు అవకాశాలు వచ్చినా.. పార్టీ సేవకు అంకితం అయ్యాయని గుర్తుచేసుకున్నారు.. నాకు రాజ్యసభ ఎంపీగా అవకాశం వచ్చినా వదులుకున్నానని.. పార్టీ సేవకే అంకితం అయ్యా.. అజీజ్ పాషాకు అవకాశం ఇచ్చామని తెలిపారు.. ఇక, తాను ఎక్కడ పోటీచేసినా పార్టీ అవసరాల కోసమే చేశానని.. కానీ, ఏ ఎన్నికల్లోనూ ఒక్క రూపాయి ఖర్చు చేయలేదన్నారు నారాయణ.. తాను 50…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య జల వివాదాలు ఈనాటిది కాదు.. అయితే, తాజాగా ఏపీ, తెలంగాణ మంత్రులు, నేతల మధ్య ఈ వ్యవహారంలో డైలాగ్ వార్ నడుస్తోంది… దీనిపై స్పందించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. ఇద్దరు సీఎంలపై మండిపడ్డారు.. కృష్ణా జలాల వివాదాలను ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు ఏటీఎంలాగా వాడుకుంటున్నారని ఆరోపించిన ఆయన.. ఇరు రాష్ట్రాల మధ్య జల జగడాలను తీర్చాల్సింది కేంద్ర ప్రభుత్వమే అన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వ్యవస్థలనే ప్రశ్నించే స్థాయికి పోయారని.. వ్యవస్థలను…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణానదిపై చేపట్టిన ప్రాజెక్టులు మరోసారి వివాదం రేపుతున్నాయి.. ఇప్పటికే ప్రాజెక్టులపై కేంద్రానికి ఫిర్యాదులు, కృష్ణానది యాజమాన్య బోర్డుకు లేఖలు రాయడం నడుస్తుండగా.. మరోవైపు.. రెండు రాష్ట్రాల నుంచి అధికార పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది… ఇటీవల మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి, ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. ఈ సందర్భంగా లంకలో పుట్టినొల్లంతా రాక్షసులే అంటూ కామెంట్…
మాజీ మంత్రి ఈటల ఎపిసోడ్ పై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈటల రాజేందర్ బయటకు వెళ్ళటం టిఆర్ఎస్ కే నష్టమని.. టిఆర్ఎస్ లో అసలైన తెలంగాణ వాదులు ఆరుగురే ఉన్నారని పేర్కొన్నారు. ఈటెల బిజెపిలోకి వెళ్తే కేసీఆర్ కే నష్టమని.. మరో పశ్చిమ బెంగాల్ లా… తెలంగాణ మారకుండా కేసీఆర్ జాగ్రత్త పడాలని సూచించారు. జార్ఖండ్ సీఎం.. కేంద్రాన్ని విమర్శిస్తూ లేఖ రాస్తే … సీఎం జగన్ ఎందుకు అడ్డు చెప్పారని..ఇప్పుడు ఎందుకు కేంద్రానికి…
తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఘోరంగా విఫలమయ్యారని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కె. నారాయణ అన్నారు. ఏడేళ్ల పాలన తెలంగాణ ప్రజల ఆత్మ ఘోష కు ఉపయోగపడే పాలన అని ధ్వజ మెత్తారు. ప్రజాస్వామ్య విలువలను ముఖ్యమంత్రి కేసీఆర్ తుంగలో తొక్కారని విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మీడియాతో నారాయణ మాట్లాడుతూ… ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడు సంవత్సరాలు అయిందన్నారు. రాష్ట్రం ఆరంభంలోనే ఇది భౌగోళికంగా తెలంగాణ…