నేతల క్రిమినల్ రికార్డులపై రాజకీయ పార్టీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది సుప్రీంకోర్టు… ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓ అభ్యర్థిని ఎంపిక చేసి 48 గంటల్లోపు ఆ అభ్యర్థికి సంబంధించిన క్రిమినల్ రికార్డులను బయటపెట్టాలని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.. అయితే, ఇది రాజకీయ నేతలకు ఇష్టం లేని అంశంగా ఉందని.. అందుకే సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రాష్ట్రపతిని కలిసినట్టుగా ఉందని వ్యాఖ్యానించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ… సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన నారాయణ.. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్వీ రమణ కలవడం శుభపరిణామం అన్నారు.. నరేంద్ర మోడీ కొత్త కేబినెట్‌లో 33 మంది నేర చరిత్ర కలిగినవారే ఉన్నారన్న ఆయన.. నేర చరిత్ర కలిగిన నేతలపై లోతైన విచారణ చేయాలని సీజేఐ పట్టుదలతో ఉన్నారని.. కానీ, అది కేంద్రం, రాష్ట్రాల్లోని రాజకీయ నేతలకు ఇష్టం లేని అంశంగా మారిందన్నారు.. అలా జరగదనే అనుమానంతోనే రాష్ట్రపతిని కలసి సీజేఐ మద్దతు కోరినట్టు తెలుస్తోందన్నారు సీపీఐ నేత నారాయణ.
మరోవైపు పవిత్రమైన పార్లమెంటులో హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు నారాయణ… రాజ్యసభ వేదికగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కార్చింది కన్నీళ్లు కాదు.. రైతుల రక్తం… అని వ్యాఖ్యానించిన ఆయన.. రైతుల సమస్యలు, చావులపై చర్చించే అవకాశం కూడా ఇవ్వలేదన్నారు.. ఇక, ఏపీ సీఎం వైఎస్ జగన్… వైజాగ్ స్టీల్ ప్లాంట్ వద్ద తన ఎంపీలతో కలసి ధర్నాకు దిగితే… ప్రైవేటీకరణ ఆగిపోతుంది అని..కానీ, ఆ పని మాత్రం సీఎం జగన్ చేయలేడు అని కామెంట్ చేశారు. కాగా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఇప్పటికే కేంద్రం పలు దఫాలుగా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే కాగా.. ఉక్కు కర్మాగారం పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే.