Andhra Pradesh Ex Minister Narayana: ఏపీ రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగురోడ్డు అలైన్‌మెంట్‌లో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు వైసీపీ నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసులో టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు ఊరట లభించింది. ఈ కేసులో నిందితులకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ మంగళవారం నాడు ఏపీ హైకోర్టు…
ఏపీలో పదవతరగతి ఫలితాలు విడుదలయ్యాయి. టెన్త్ ఫలితాల పై వైసీపీ, టీడీపీ ట్విట్టర్ వార్ నడుస్తోంది. ఎంపీ విజయసాయిరెడ్డి టీడీపీ నేత లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు. ట్విట్టర్ లో లోకేష్ కు కౌంటర్ ఇచ్చారు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి ‘నారాయణ’ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణం పప్పు నాయుడూ. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం మీదే. దిగజారి…
ఏపీలో మోటార్లకు మీటర్ల బిగింపు వ్యవహారం రాజకీయంగా దుమారం రేపుతోంది. కేంద్రం నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగింపును వ్యతిరేకిస్తూ అనంతపురంలో సీపీఐ ఆధ్వర్యంలో వినూత్న నిరసన తెలిపారు. గాంధీ సర్కిల్ నుంచి పవర్ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించారు. అందులో భాగంగా ఎద్దుల బండిలో రైతులు ఉరికి వేలాడుతూ నిరసన తెలిపారు. ఎద్దుల బండిని తోలారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. ప్రభుత్వం తీరుపై…
ఏపీలో సంచలనం కలిగించిన పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఏపీ మాజీ మంత్రి పి. నారాయణ కుమార్తెలు పొంగూరు శరణి, పొంగూరు సింధూర, అల్లుడు పునీత్‌తోపాటు నారాయణ విద్యాసంస్థలకు చెందిన మరో 10 మంది హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీరికి హైకోర్టులో ఊరట లభించింది. తమకు ముందస్తు బెయిలు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్ పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె.మన్మథరావు ఈ వ్యాజ్యాలపై అత్యవసరంగా విచారణ జరిపారు.…