ఆంధ్రప్రదేశ్‌లో ఆన్‌లైన్ ద్వారా సినిమా టికెట్ల విక్రయానికి సిద్ధం అవుతోంది ప్రభుత్వం… దీనిపై ఇవాళ మంత్రి పేర్నినానితో సినీ పెద్దలు సమావేశమై.. ఆన్‌లైన్ విధానానికి ఓకే చెప్పారు.. అయితే, ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయాన్ని సమర్థిస్తూనే.. సినీ పరిశ్రమకు చురకలు అంటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. విశాఖలో మడియాతో మాట్లాడిన ఆయన.. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జగన్ విధానాలపై స్పందించారు.. ఇక, ఈ మధ్య హాట్ టాపిక్‌గా మారిపోయిన ఆన్‌లైన్‌లో సినిమా టికెట్ల విక్రయంపై స్పందిస్తూ.. సినిమా టికెట్ల వ్యవస్థ కొంతమంది చేతిలోకి వెళ్లిపోయింది.. టికెట్లను ఆన్‌లైన్ చేయడాన్ని సమర్థిస్తున్నాం అన్నారు.. ఇదే సమయంలో.. ప్రభుత్వాన్ని సినిమా వాళ్లు నమ్మరు.. కానీ, సినిమా వాళ్లను మాత్రం ముఖ్యమంత్రి నమ్మాలా? అని ప్రశ్నించారు నారాయణ.
మరోవైపు.. ఈనెల 27వ తేదీన జరగనున్న భారత్ బంద్ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు నారాయణ.. 19 రాజకీయ పార్టీలు మోడీ హటావో కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నామన్న ఆయన.. గుజరాత్‌లోని ఆదానికి చెందిన మందర సీ పోర్టు ద్వారానే హెరాయిన్, విజయవాడకు వస్తుందని ఆరోపించారు.. ప్రైవేటు వ్యక్తులకు పోర్టులు కట్టబెడితే ఇలాగే ఉంటుందని ఆవేదన వ్యక్తం చేశారు.. ఇక, జీవీకే నుండి ముంబై ఎయిర్‌పోర్ట్ లాక్కున్నారు.. కార్పొరేట్ లో కూడా మోడీ అనుకూలమైన వారే ఉండాలని ఈ విధంగా పని చేస్తున్నారని ఆరోపించారు.. తెలుగు రాష్ట్రాలలో అధికార ప్రతిపక్షాలు బస్టాండ్‌లో కన్నా, హినమైన బూతులు మాట్లాడుకుంటున్నారంటూ మండిపడ్డారు నారాయణ.. తెలంగాణలో తొడలు కొట్టుకుంటున్నారు.. ఏపీలో బూతులు తిట్టుకుంటున్నారని.. మంత్రులు బూతుల ఆపి కేంద్రం మీద పడాలని కోరారు.. మరోవైపు.. మాంసం దుకాణాల పై అభిప్రాయాలు తీసుకుని, ముందుకు వెళ్లాలి తప్పితే దుందుడుకుగా వెళ్ళకూడదని.. సీఎం వైఎస్ జగన్‌ను కోరారు..