జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు దమ్ముంటే అతని గుర్తు ఎదో ప్రజలకు చెప్పమనండి అంటూ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. పవన్ కళ్యాణ్ చుట్టూ ఉండే వారందరూ క్రిమినల్సే అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Narayana Swamy: ఏపీ రాజధాని అమరావతిపై కేంద్రమంత్రి నారాయణస్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో పశ్చిమ బైపాస్ పనులను పరిశీలించిన ౠయన రహదారి పనులను నేషనల్ హైవే అథారిటీ అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కేంద్రమంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ.. పశ్చిమ బైపాస్ విస్తరణ తర్వాత అమరావతి ఒక జిల్లాగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జాతీయ రహదారి విస్తరణకు ప్రభుత్వ సహకారం ఆశించిన స్థాయిలో లేదని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని రాజధానులు పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదని..…
తిరుమల శ్రీవారిని ఆదివారం ఉదయం డిప్యూటీ సీఎం నారాయణస్వామి దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకోగా.. వేదపండితులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలను అందజేశారు. అనంతరం డిప్యూటీ సీఎం నారాయణస్వామి మీడియాతో మాట్లాడుతూ సీఎం జగన్‌పై ప్రశంసలు కురిపించారు. జగన్ భగవద్గీత, బైబిల్, ఖురాన్ చదివాడని.. అందుకే ఆయన అన్ని మతాల వారిని సమానంగా చూస్తాడని కొనియాడారు. Andhra Pradesh: రేపు ఏలూరు జిల్లాలో సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ వైసీపీ ప్రభుత్వం ప్రారంభించిన గడప…
రాయలసీమలోనే అత్యంత వైభవంగా నిర్వహించే తిరుపతి గంగమ్మ జాతర అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. దేశంలోనే అత్యంత ప్రాచీనమైన పండగగా దీనికి పేరుంది. గ్రామ దేవతను అత్యంత భక్తి శ్రద్దలతో కొలిచే పేదవాళ్ల పండుగగా చెబుతారు. హిందువుల ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుపతిలోనూ ఓ గ్రామదేవత పూజలందుకుంటోంది. ఆమె శ్రీ తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ. గంగమ్మతల్లి తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి చెల్లెలంటారు. అందుకే తిరుపతిలోని గంగమ్మ జాతరకు కూడా శ్రీవారి భక్తులు అధిక సంఖ్యలో హాజరవుతారు. ఈ జాతర…
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో రెడ్లు రెండు వర్గాలుగా విడిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. చిన్న చిన్న గొడవలతో తమ పార్టీలోని రెడ్లు వర్గాలుగా విడిపోవడం చూస్తే బాధేస్తుందని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో తానేమైనా తప్పుగా మాట్లాడి ఉంటే తన పదవికి రాజీనామా కూడా చేస్తానన్నారు. రెండు వర్గాలుగా విడిపోయిన రెడ్లు దళితులపై పడుతున్నారని నారాయణస్వామి అన్నారు. వర్గాలుగా విడిపోయిన రెడ్లు ఏమైనా చేస్తారని అభిప్రాయపడ్డారు.…