YCP Leaders Politics : జీడీ నెల్లూరులో వైసీపీ నేతల కయ్యాలు..శృతిమించిన విభేదాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YCP Leaders Politics : కయ్యాలు.. కవ్వింపులు. ఆ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ప్రస్తుతం ఇదే సీన్. ఒకరేమో డిప్యూటీ సీఎం.. ఇంకొకరేమో ప్రభుత్వ సలహాదారు. ఇద్దరి మధ్య ఉప్పు నిప్పులా ఉంది యవ్వారం. మొన్నటి వరకు కేడర్ తిట్టుకుంటే.. ఇప్పుడు ముఖ్య నేతల వంతు వచ్చింది. వారెవరో.. ఎందుకు తిట్టుకుంటున్నారో ఈ స్టోరీలో చూద్దాం.
ఈయన నారాయణస్వామి. ఏపీ డిప్యూటీ సీఎం. ఈయనేమో.. ప్రభుత్వ ఎన్ఆర్ఐ సలహాదారు, మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి. ఇద్దరూ అధికార వైసీపీ నాయకులే. కానీ ఒకరంటే ఒకరికి పడటం లేదు. ఛాన్స్ దొరికితే కయ్‌మంటున్నారు. నోటికి పనిచెప్పడంలో తగ్గేదే లేదన్నట్టుగా ఉంటున్నాయి వాళ్ల మధ్య విమర్శల బాణాలు. అప్పట్లో విభేదాలను తేలికగా తీసుకున్నా.. ఇటీవల అవి శ్రుతిమించినట్టు చెబుతున్నారు.
Also Read
నారాయణస్వామి గతంలో మూడుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో పెద్దగా చర్చల్లో లేరు. డిప్యూటీ సీఎం అయ్యాక మాత్రం తరచూ వార్తల్లో ఉంటున్నారు. ప్రజల అటెన్షన్ కోరుకుంటున్నారో ఏమో.. నారాయణ స్వామి ఏదో విధంగా వివాదాల్లోకి వస్తున్నారు కూడా. చిత్తూరు జిల్లాలో గ్రూపు పాలిటిక్స్ డోస్ ఎక్కువే అయినా.. గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో అవి తారాస్థాయికి చేరాయి. గంగాధర నెల్లూరు, పెనుమూరు, వెదురుకుప్పం, ఎస్‌ఆర్ పురం, కార్వేటి నగరం మండలాల్లో తెల్లారి లేస్తే చాలు వైసీపీలో గ్రూపు రాజకీయాలు సెగలు రేపుతున్నాయి.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమలంలో భాగంగా జనాల్లోకి నారాయణ స్వామి వెళ్తున్నా.. స్థానిక వైసీపీ నేతలు ఆయనకు సహకరించడం లేదట. దాంతో తూతూ మంత్రంగా పని కానిచ్చేస్తున్నారు. కొన్ని మండలాల్లో అయితే నేతల మధ్య వాగ్యుద్ధం సాధారణమైపోయింది. జనాల సంగతేమోకానీ.. సొంత పార్టీ నాయకులనే డిప్యూటీ సీఎంను నడిరోడ్డుపై నిలదీస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.
నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి వర్గానికి.. ప్రభుత్వ NRI సలహాదారు మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి వర్గానికి మొదటి నుంచి పడటం లేదు. ఆ విభేదాలు క్షేత్రస్థాయిలో ఏదో ఒక రూపంలో బయట పడుతూనే ఉన్నాయి. తాజాగా మండల కమిటీ అధ్యక్షుల నియామకంతో ముఖ్య నేతలే తిట్టుకుంటున్న పరిస్థితి ఉంది. పెనుమూరు మండల వైసీపీ అధ్యక్షుడిగా విజయకుమార్‌రెడ్డిని నియమించారు. ఇది జ్ఞానేంద్రరెడ్డి సొంత మండలం. తన సమీప బంధువు సురేష్‌రెడ్డికి పార్టీ పదవి ఇప్పించుకోవాలని చూశారట. ఆ ప్రయత్నాలకు నారాయణస్వామి చెక్ పెట్టినట్టు టాక్.
రెండు వర్గాలు ప్రస్తుతం కత్తులు దూసుకుంటున్నాయి. జ్ఞానేంద్రరెడ్డి వర్గానికి చెందిన దేవరాజులరెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణస్వామి అనుచరుడు AMC మాజీ ఛైర్మన్ కండిగ మధురెడ్డిల మధ్య తిట్లు ఓ రేంజ్‌లో సాగాయి. ఆ ఆడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రధాన నేతల మధ్య నెలకొన్న విభేదాల తీవ్రత అందరికీ తెలిసింది. మండల కమిటీలను మార్చే ప్రసక్తే లేదని నారాయణస్వామి చెబుతున్నారట. దానికి జ్ఞానేంద్రరెడ్డి గుర్రుగా ఉన్నట్టు సమాచారం. ఈ పంచాయితీ జిల్లా వరకే ఆగుతుందో.. తాడేపల్లి వరకు వెళ్తుందో కానీ.. నేతల పట్టు చూస్తుంటే మాత్రం అగ్గి గట్టిగానే రాజుకుంటోంది. మరి.. ఏం జరుగుతుందో చూడాలి.
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖలో కాంట్రాక్టర్స్ రాజ్యం..!
-
Honda CB500 Launched in India: రాయల్ ఎన్ఫీల్డ్కు పోటీ..! హోండా CB500 విడుదల.. ధర, ఫీచర్లు ఇవే..
-
iQOO Z11 Lite 5G: 6500mAh బ్యాటరీ, 44W ఫాస్ట్ ఛార్జింగ్, IP65 రేటింగ్.. iQOO నుంచి కొత్త ఫోన్ లాంచ్..
-
Off The Record : రేపల్లెలో వైసీపీ కోవర్ట్ పాలిటిక్స్? మోపిదేవి సస్పెన్షన్ వెనుక కథేంటి?
-
AP Local Body Elections: స్థానిక ఎన్నికలకు మరో ముందడుగు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!