Dhanush : కుబేర సినిమాలో బిచ్చగాడిగా ధనుష్ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత ఆయన్ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. ఇలాంటి పాత్రలు చేయడం ఎవరికీ సాధ్యం కాదంటున్నారు. ఇది ఒకింత నిజమే. ఎందుకంటే మన టాలీవుడ్ హీరోల సినిమాలు అంటే కత్తి పట్టి నరకాల్సిందే.. రక్తం ఏరులై స్క్రీన్ నిండా పారాల్సిందే అన్నట్టే ఉంటాయి. హీరోయిజాన్ని చూపించే సినిమాలే తప్ప ఒక బిచ్చగాడిగా నటించే పాత్రల్లో మన వాళ్లు అస్సలు నటించరు. వాళ్లు ఒక మెట్టు కిందకు దిగి నటించాల్సి…
వెంకటేష్ కొంత కాలం వరుస సినిమాల్లో అయితే నటించాడు. సినిమాల సంఖ్య పెరిగింది కానీ ఆయన సక్సెస్ శాతం అనేది దారుణంగా పడి పోయింది.దాంతో వెంకటేష్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటేష్ ఎందుకు ఇలాంటి కథలను సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ కొన్ని సినిమా ల పట్ల ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అభిమానుల అసంతృప్తి తో వెంకటేష్ సినిమాల ఎంపిక విషయం లో కొంత నిమ్మళంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే…
ఇప్పటికే ఓటీటీలో స్ట్రీమింగ్ అయిన విక్టరీ వెంకటేశ్ 'నారప్ప' సినిమా ఇప్పుడు థియేటర్లో ప్రదర్శితం కాబోతోంది. వెంకటేశ్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ నెల 13న రెండు తెలుగు రాష్ట్రాలలో ఆ ఒక్క రోజు ఈ సినిమాను ప్రదర్శిస్తామని సురేశ్ బాబు తెలిపారు.
వెంకీ మామ మళ్ళీ అదే బాట పట్టాడు. ఇంతకు ముందే అభిమానులు వద్దంటే వద్దని వేడుకున్న పనినే మళ్ళీ చేస్తున్నాడు. మరోసారి అభిమానులకు నిరాశను కలిగిస్తూ తన నెక్స్ట్ మూవీని ఓటిటిలో విడుదల చేయడానికి సిద్ధమయ్యాడు. దగ్గుబాటి అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న “దృశ్యం 2” మూవీ విడుదల తేదీని తాజాగా టీజర్ తో పాటు రివీల్ చేశారు మేకర్స్. అందులో నవంబర్ 25న “దృశ్యం 2” దిగ్గజ ఓటిటి సంస్థ అమెజాన్ లో విడుదల కానుంది…
ప్రముఖ నిర్మాతలు, నిర్మాణ సంస్థలు తమ చిత్రాలను ఓటీటీ ద్వారా విడుదల చేయడాన్ని ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్. నారాయణమూర్తి తప్పు పట్టారు. ఇవాళ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కేవలం ఇరవై ఐదు శాతం మందికే అందుబాటులో ఉన్నాయని, కొన్ని చిత్రాలను ఓటీటీలో విడుదల చేయడం వల్ల మిగిలిన 75 శాతం మంది ఆ వినోదాన్ని పొందలేకపోతున్నారని అన్నారు. ఇటీవల సురేశ్ బాబు ‘నారప్ప’ సినిమాను ఓటీటీలో విడుదల చేశారని, దానిని కూడా కొద్ది మంది మాత్రమే…
‘నార్పప్ప’ సినిమా విడుదలైన నేపథ్యంలో సీనియర్ హీరోలు, వారు చేస్తున్న, ఇటీవల చేసిన పాత్రలు మరోసారి ఫిల్మ్ నగర్ వర్గాలలో చర్చకొచ్చాయి. ‘అసురన్’ మూవీలో యంగ్ హీరో ధనుష్ మధ్య వయస్కుడి పాత్రలో ఒదిగిపోయాడు కానీ దాని రీమేక్ గా తెరకెక్కిన ‘నారప్ప’లో వెంకటేశ్ యంగ్ గెటప్ లో మెప్పించలేకపోయాడనే విమర్శలు వచ్చాయి. అందులో యంగ్ నారప్పకు జోడీగా నటించిన అమ్ము అభిరామికి వెంకటేశ్ కు వయసులో ఎంతో వ్యత్యాసం ఉండటం వల్ల ఆ జోడీ జనాలను…
యువ కథానాయకులే కాదు… తన తోటి హీరోలు ఏ సినిమాలో అయినా అద్భుతంగా నటిస్తే వెంటనే స్పందించే హీరో మెగాస్టార్ చిరంజీవి. ఇటీవల విడుదలైన వెంకటేశ్ ‘నారప్ప’ సినిమాను చూసి అందులో వెంకటేశ్ నటనకు ఫిదా అయిపోయారు చిరు. దాంతో వెంటనే వెంకటేశ్ ను ఉద్దేశించి ఓ వాయిస్ మెసేజ్ పెట్టారు. దానిని వెంకటేశ్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు. నటన అంటే ప్రాణం పెట్టే వెంకటేశ్ గర్వపడే చిత్రం ‘నారప్ప’ అని, తనకు సినిమా…
విక్టరీ వెంకటేశ్ తాజా చిత్రం ‘నారప్ప’ ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుదలైంది. తన కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతటి కష్టాన్నైనా సహించే తండ్రిగా ఆ మధ్య ‘దృశ్యం’లో నటించి మెప్పించిన వెంకటేశ్, ఇప్పుడు తన కొడుకును దక్కించుకోవడానికి ఎంతటి సాహసానికైనా ఒడిగట్టే తండ్రిగా ‘నారప్ప’లో జీవించాడు. విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ఈ సినిమాను వెంకటేశ్ బంధుమిత్రులూ చూసి అభినందనల జల్లు కురిపిస్తున్నారు. అవన్నీ ఒక ఎత్తు అయితే వెంకటేశ్ కుమార్తె ఆశ్రిత ఈ…