వెంకటేష్ కొంత కాలం వరుస సినిమాల్లో అయితే నటించాడు. సినిమాల సంఖ్య పెరిగింది కానీ ఆయన సక్సెస్ శాతం అనేది దారుణంగా పడి పోయింది.దాంతో వెంకటేష్ అభిమానులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంకటేష్ ఎందుకు ఇలాంటి కథలను సెలెక్ట్ చేసుకున్నాడు అంటూ కొన్ని సినిమా ల పట్ల ఆయన అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది. అభిమానుల అసంతృప్తి తో వెంకటేష్ సినిమాల ఎంపిక విషయం లో కొంత నిమ్మళంగా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికే ఆయన హీరోగా కేవలం ఒకే ఒక సినిమా తెరకెక్కుతుంది అనే సంగతి అందరికి తెల్సిందే. మరో వైపు ఆ సినిమా తర్వాత చేయాల్సిన సినిమా కోసం వెంకటేష్ పలు కథలు వింటున్నాడని సమాచారం..
గత కొన్ని నెలలుగా ఎంతో మంది రైటర్స్ వెంకటేష్ కి కథ ను వినిపించేందుకు వెళ్లారట. అయితే ఏదో ఒక లోపం అనిపించి కథ ను ఆయన తిరస్కరిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసిన వెంకటేష్ ఇప్పుడు కొంత నెమ్మదిగా సినిమాలు చేయాలని భావిస్తున్నాడు. అందుకోసం కథల ఎంపిక విషయం లో ఎక్కువ సమయం తీసుకోవాలని అనుకుంటున్నాడు. కథల ఎంపిక విషయంలో జాగ్రతలు తీసుకోవాలి అనుకోవడం వరకు బాగానే ఉన్న వచ్చిన ప్రతి ఒక్క కథ ను కూడా ఆయన రిజెక్ట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారని తెలుస్తుంది.. వెంకటేష్ కథ ఎంపిక విషయంలో నిర్ణయం తీసుకోలేక పోతున్నాడని.. అందుకే కథలను తిరస్కరిస్తున్నాడని కొందరు చెబుతున్నారు.. ఏది ఏమైనా అభిమానులు మాత్రం వెంకటేష్ నుండి మరో మంచి సినిమా రావాలి అని అనుకుంటున్నారు.ప్రస్తుతం వెంకటేష్ చేస్తున్న సినిమా కనుక సక్సెస్ అయితే కచ్చితంగా ఆయన నుండి అలాంటి తరహా సినిమాలు మరిన్ని వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ కొందరు నుండి అభిప్రాయం వ్యక్తం అవుతుంది