Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రలో అపశ్రుతి చోటు చేసుకుంది.. లోకేష్ పాదయాత్ర బందోబస్తులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ రమేష్ గుండెపోటుతో మృతి చెందారు. చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలో సాగుతున్న పాదయాత్రలో రమేష్ కుప్పకూలాడు.. వెంటనే అప్రమత్తమైన సహచర పోలీసులు.. అతన్ని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. అయితే, రమేష్.. ఐరాల పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పని చేసేవారు.…
Minister RK Roja: వైసీపీ నేతలు ఓట్లు అడగడానికి వస్తే చీపుర్లతో కొట్టాలంటూ టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన కామెంట్లపై ఘాటుగా స్పందించారు మంత్రి ఆర్కే రోజా.. అసలు వైసీపీ నేతలపై ఎందుకు చీపుర్లు వాడాలని ఆమె ప్రశ్నించారు.. అమ్మఒడి, చేదోడు, ఆసరా వంటి వాగ్దానాలు నెరవేర్చినందుకు? వైసీపీ నేతలపై చీపుర్లు వాడాలా? ఆదర్శప్రాయమైన విద్యా విధానాలు మరియు పథకాలు అమలు చేస్తున్నందుకు చీపుర్లతో కొట్టాలా? డ్వాక్రా రుణాలపై టీడీపీ వైఫల్యాలను బయటపెట్టినందుకా? అంటూ…
Minister RK Roja: నారా లోకేష్ పాదయాత్రపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు మంత్రి ఆర్కే రోజా.. టీడీపీ అధినేత చంద్రబాబు సైకో అయితే.. నారా లోకేష్ ఐరన్ లెగ్ సైకో అంటూ విరుచుకుపడ్డారు.. విశాఖ శారదాపీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న ఆమె.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.. మొదటిసారి గోదావరి పుష్కరాలకి వెళ్తే 29 మందిని పొట్టన పెట్టుకున్నాడు.. ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేస్తే.. వాళ్ల నాన్న చంద్రబాబుకి ఓటుకు నోటు కేసులో నోటీసులు వచ్చాయి.. మొన్న పాదయాత్ర పోస్టర్…