Break For Nara Lokesh Padayatra: టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రిక్వెస్ట్‌ను తోసిపుచ్చింది రాష్ట్ర ఎన్నికల సంఘం.. దీంతో.. పాదయాత్రకు బ్రేక్ ఇచ్చి హైదరాబాద్ బయల్దేరారు నారా లోకేష్.. అయితే, అన్నమయ్య జిల్లాలో నారా లోకేష్ పాదయాత్ర కొనసాగుతోన్న సమయలో.. తాను స్థానికంగా అన్నమయ్య జిల్లా కంటేవారిపల్లి విడిది కేంద్రంలో ఉండేందుకు మినహాయింపు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు నారా లోకేష్.. రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేసేందుకు ముందుగానే నిర్ణయించుకున్నందున స్థానికంగా ఉండేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. 2013లో చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్రకు ఇచ్చిన మినహాయింపును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు.. తూర్పుగోదావరి జిల్లాలో తమ అధినేత చంద్రబాబు పాదయాత్రకు ఎన్నికల కోడ్ నుంచి మినహాయింపు ఇచ్చారని గుర్తు చేశారు లోకేష్.. కానీ, ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రస్తుతం నియోజకవర్గం వీడాలంటూ లోకేష్ కు సమాధానం పంపింది ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం..
Read Also: Natu Natu Song: మన “నాటు నాటు…” పాటకు ఆస్కార్ వచ్చేసినట్టే!?
లోకేష్ పంపిన విజ్ఞప్తిని కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్లు వెళ్లడించింది.. అక్కడి నుంచి వచ్చిన సమాధానం మళ్లీ కమ్యునికేట్ చేస్తామంటూ సమాధానం ఇచ్చింది ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం.. దీంతో, ఎన్నికల సంఘాన్ని, చట్టాలను గౌరవించి జిల్లా వీడుతున్నట్లు నారా లోకేష్ ప్రకటించారు.. కంటేవారి పల్లి నుంచి హైదరాబాద్ బయలుదేరారు.. ఇక, టీడీపీ యువనేత నారా లోకేష్ చేపనట్టిన యువగళం పాదయాత్ర వివరాల్లోకి వెళ్తే.. ఇప్పటి వరకు 529.1 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తి చేశారు.. 41వ రోజు అంటే ఈ రోజు 9.5 కిలోమీటర్లు నడిచారు.. కానీ, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా యువగళం పాదయాత్రకు బ్రేక్ పడింది.. దీంతో.. రేపు, ఎల్లుండి.. అంటే ఈ నెల 12, 13 తేదీల్లో పాదయాత్రకు విరామం ఇచ్చారు నారా లోకేష్.. 42వరోజు పాదయాత్ర 14వ తేదీన కంటేవారిపల్లి నుంచి ప్రారంభం కానుంది.