స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఆయన తనయుడు టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ వేశారు.. ఆ పిటిషన్లపై నేడు విచారణ జరుగనుంది. ఫైబర్ నెట్ స్కాంలో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్, స్కిల్ డెవలప్మెంట్ స్కాం లో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ల మీద ఉన్నత న్యాయస్థానం విచారణ జరుపనుంది.
టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. గాంధీ జయంతి రోజున ఢిల్లీ నుంచి గల్లీ దాకా టీడీపీ నేతలు సత్యమేవ జయతే దీక్ష పేరుతో ఒక్క రోజు నిరాహార దీక్షకు పూనుకున్నారు.
మహాత్మ గాంధీ జయంతి రోజున ఒక్క రోజుకు నారా భువనేశ్వరి దీక్షకు దిగింది. సాయంత్ర 5గంటల వరకు ఈ దీక్ష చేయనున్నారు. ఇటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో చంద్రబాబు నాయుడు కూడా దీక్ష చేస్తున్నారు. నారా భువనేశ్వరికి మద్దుతుగా చంద్రబాబు, నారా లోకేశ్, బ్రహ్మణి, బాలకృష్ణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈ దీక్ష చేస్తున్నారు.
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. నేడు గాంధీ జయంతి సందర్భంగా అరెస్ట్కు వ్యతిరేకంగా టీడీపీ నేతలు ఒకరోజు నిరాహార దీక్షకు దిగుతున్నారు. చంద్రబాబు, నారా భువనేశ్వరి, లోకేశ్ సహా ప్రతి ఒక్కరూ దీక్షలో పాల్గొననున్నారు.
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అవినీతి జరిగింది అనే విషయం అందరికీ తెలిసిందే అని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. అక్రమాలు జరగలేదని ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు హడావిడి చేస్తూన్నారు.. టీడీపీ నేతలు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయానికి వెళ్లి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కు వెళ్లి అభాసు పాలయ్యారు
టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా మోత మోగిద్దాం కార్యక్రమంలో భాగంగా నారా లోకేశ్ ఢిల్లీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్రబాబుపై కక్షసాధింపు కోసం జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారు అని తెలిపారు. బాబు రిమాండ్ కు వెళ్ళే ముందు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా పోరాడాలి అన్నారు.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ ఎలైన్మెంట్ ఎలా ఉండాలి అనేది నారా లోకేశ్ కనుసన్ననలోనే జరిగింది అని మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. నారా లోకేశ్ ఎఫ్ఐఆర్ లో ముద్దాయి.. తప్పు చేశాడు.. అప్పటి సీఎం తనయుడిగా ఆయనకు అన్నీ ముందస్తుగా తెలుసు.. అన్నీ తానై లోకేష్ నడిపించాడు.. హెరిటేజ్ ఫుడ్స్ డైరెక్టర్ గా పలు భూములు కొనుగోలు చేశాడు అంటూ ఆయన అన్నారు.