Meruga Nagarjuna: రాష్ట్రంలో 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశాను అని చెప్పుకుంటున్న వ్యక్తి ఓ దొరికిపోయిన దొంగ అని మంత్రి మేరుగ నాగార్జున విమర్శలు గుప్పించారు. దొంగ దొరికిపోయి మరలా కొన్ని యంత్రాంగాలను కదిలిస్తున్నాడని ఆయన అన్నారు. కొన్ని మీడియాలను, రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకున్నాడని మంత్రి ఆరోపించారు. కొంతమంది కుటుంబ సభ్యులను ఇతర పార్టీలకు పంపి రాజీలు, రాజీనామా రాజకీయాలు నడుపుతున్నారని అన్నారు.
Also Read: Chandrababu: చంద్రబాబుకు అస్వస్థత.. వైద్యుడిని జైలుకు పిలిపించిన అధికారులు
ఓ కార్పొరేటర్ కూడా కానీ లోకేష్ ఢిల్లీ వెళ్లి అమిత్ షాను కలిశారని, లోకేష్‌ను వాళ్ల పెద్దమ్మ పురంధేశ్వరి తీసుకెళ్ళి కలిపిందని ఆయన పేర్కొన్నారు. వీళ్ళందరూ అవసరమైతే ఒకటే పార్టీ అంటూ ఆరోపణలు చేశారు. రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేయటానికి చంద్రబాబు అండ్ కో పని చేస్తుందన్నారు. లోకేష్ ఓ చెల్లని కాగితంతో సమానమంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజకీయ జ్ఞానం, అవగాహన లేని వ్యక్తి లోకేష్ అంటూ మాట్లాడారు. మైకు పట్టుకుంటే వాళ్ళ సంగతి చూస్తా, వీళ్ళ సంగతి చూస్తా అంటూ చెప్పే వ్యక్తి రాష్ట్ర రాజకీయాలకు పనికి రాడని మంత్రి నాగార్జున వ్యాఖ్యానించారు.