Nara Lokesh: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ నేత నారా లోకేశ్‌కు ఊరట లభించింది. ఈ కేసులో లోకేశ్‌ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు వివరించింది. ముద్దాయిగా చూపని కారణంగా లోకేశ్‌ను అరెస్ట్ చేయబోమని కోర్టుకు సీఐడీ తరఫు న్యాయవాదులు వెల్లడించారు. ఈ కేసులో లోకేశ్ పేరును చేర్చితే 41ఏ నిబంధనలు అనుసరిస్తామని కోర్టుకు తెలిపారు. దీంతో ఈ కేసులో నారా లోకేశ్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది.
Also Read: CM YS Jagan: పవన్ కల్యాణ్ పెళ్లిళ్లపై సీఎం ఘాటు వ్యాఖ్యలు.. లోకల్, నేషనల్, ఇంటర్నేషనల్..!
నారా లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానంలో ఈ నెల 4వ తేదీని విచారణ జరిగిన సంగతి విదితమే. ఈ నెల 12 వరకు లోకేశ్‌ను అరెస్ట్ చేయవద్దని సీఐడీ కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. సీఐడీ దాఖలు చేసిన చంద్రబాబు రిమాండ్ రిపోర్ట్‌లో కుటుంబసభ్యులు లబ్ధి పొందినట్లు పేర్కొన్నారని.. అందుకే ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసినట్లు లోకేశ్ తరఫున లాయర్లు కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం లోకేశ్ పిటిషన్‌ను డిస్పోజ్ చేసింది.