Daggubati Purandeswari: అమిత్‌షాను కలిసిన లోకేష్.. ఇప్పుడు సమాధానం చెప్పండి..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daggubati Purandeswari: బుధవారం రాత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో సమావేశం అయ్యారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్.. తనపై కేసుల విషయాన్ని షా దగ్గర ప్రస్తావించారు.. సీఎం వైఎస్ జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు నారా లోకేష్ వెల్లడించారు.. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా ముందు ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశాడు. ఇక, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా.. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో చెప్పినట్టుగా తెలుస్తోంది.. దీనిపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్ట్ వెనుక బీజేపీ ఉందంటూ ప్రచారం చేస్తున్నవారిని నిలదీశారు.
Read Also: F2 : బాలీవుడ్ లో రీమేక్ కాబోతున్న బ్లాక్ బస్టర్ మూవీ.. దర్శకుడు ఎవరంటే..?
Also Read
- Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
- Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
- First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
- 2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను నారా లోకేష్ కలిసి విషయంపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి.. చంద్రబాబు అరెస్టు వెనుక కేంద్రం ఉందని ఆరోపణలు చేస్తున్నవారు ఇప్పుడు కేంద్ర మంత్రి అమిత్‌షా.. లోకేష్‌కి ఎలా అపాయింట్‌మెంట్ ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఏపీ ప్రభుత్వం, ఉన్నత స్థానాల్లో ఉన్న నాయకులు చేస్తున్న కక్షసాధింపు రాజకీయాల గురించి లోకేష్ అమిత్‌షాకు వివరించారని తన ట్వీట్‌లో పేర్కొన్నారు పురంధేశ్వరి. కాగా, అమిత్‌షాతో జరిగిన నారా లోకేష్ భేటీలో బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరితో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్న విషయం విదితమే.
Lokesh elaborately explained to Amit Shah ji about the vindictiveness of the state government and leaders at the helm of affairs. Now those who blame the Centre need to reply as to why Amit Shah ji would give an appointment to Lokesh if the BJP was behind the arrest! pic.twitter.com/tLUAXkPF4Z
— Daggubati Purandeswari 🇮🇳 (@PurandeswariBJP) October 11, 2023
తాజావార్తలు
-
Biscuit Recipe: ఓవెన్ అవసరం లేదు.. కడాయితోనే బేకరీ స్టైల్ బిస్కెట్లు ఇంట్లోనే.. తయారీ విధానం చాలా ఈజీ!
-
Supreme Court: నిందితులకు భయం పుట్టించాలి.. అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
-
First Time In Cricket History: క్రికెట్ హిస్టరీలోనే మొదటి సారి.. బాల్ సిక్స్ వెళ్లినా 5 రన్స్ మాత్రమే..
-
2027 World Cup: ప్రపంచ కప్‌లో ఆడే టాప్ 6 ఆటగాళ్లు వీరే.. ఆకాశ్ చోప్రా అంచనా ఇలా..
-
Harish Rao: సామాన్యుడిపై ధరల భారం.. ప్రభుత్వం నిద్రమత్తులో ఉందా?
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?