Nara Lokesh: అమిత్‌షాను కలిసిన నారా లోకేష్.. మా నాన్న ప్రాణాలకు హాని ఉందని ఆందోళన..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nara Lokesh: ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి.. ఫైబర్ నెట్, ఐఆర్‌ఆర్ కేసుల్లో కూడా సీఐడీ.. చంద్రబాబు పేరును చేర్చింది.. మరోవైపు నారా లోకేష్‌కి ఇన్నర్ రింగ్ రోడు కేసులో నోటిసులు.. రెండు రోజుల పాటు సీఐడీ విచారణ కూడా సాగింది.. అయితే, రాష్ట్రంలో తాజా పరిస్థితిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షాని కలిసి వివరించారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సీఎం వైఎస్ జగన్ కక్షసాధింపు చర్యలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్లినట్టు నారా లోకేష్ వెల్లడించారు.. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తనని వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు చర్యలను అమిత్ షా దృష్టి కి తీసుకెళ్లిన నారా లోకేష్. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణి ని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు అని అమిత్ షా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
Also Read
- CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
- BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
- Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
- Pawan Kalyan-TDP Leaders Meets: టీడీపీ–జనసేన సీట్ల సర్దుబాటుపై కసరత్తు.. పవన్ కల్యాణ్‌తో పల్లా, నిమ్మల భేటీ
అయితే, చంద్రబాబుపై ఎన్ని కేసులు పెట్టారు? నీ పై ఎన్ని కేసులు పెట్టారు అని లోకేష్ ని అడిగి తెలుసుకున్నారు అమిత్ షా. కక్ష సాధింపుతో జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు, ట్రైల్ కోర్టు, హై కోర్టు, సుప్రీం కోర్టు పరిధిలో వివిధ కేసులకు సంబంధించి జరుగుతున్న విచారణ గురించి అమిత్ షాకి వివరించారు లోకేష్. అంతే కాకుండా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు భద్రతపై కూడా ఆందోళన వ్యక్తం చేశాడు.. 73 ఏళ్ల వయస్సు ఉన్న వ్యక్తి ని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదు అని అమిత్‌షా అభిప్రాయపడ్డారట.. ఇక, చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అని అడిగి తెలుసుకున్న అమిత్ షా.. రాష్ట్రంలో జరుగుతున్న అన్ని పరిణామాలను గమనిస్తున్నాను అని లోకేష్ తో చెప్పారట అన్న అమిత్ షా. ఈ సమావేశంలో బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు.
ఇక, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో కలిసిన వివరాలను, ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు నారా లోకేష్.. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని, కక్షపూరితంగా చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టిందని అమిత్‌షాకు వివరించాను.. జైల్లో చంద్రబాబు ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనీ ఆయన దృష్టికి తీసుకెళ్లినట్టు నారా లోకేష్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు..
Met with the Hon’ble Union Home Minister @AmitShah Ji and apprised him of the blatant misuse of state machinery by YSRCP Govt in Andhra Pradesh, the regime revenge against Hon’ble @ncbn Garu, and the appalling condition in which he has been lodged in prison where his life is… pic.twitter.com/7vJFAGsdXM
— Lokesh Nara (@naralokesh) October 11, 2023
తాజావార్తలు
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
-
TG SAFE : హైవేపై హోటళ్లలో ఇదేం దారుణం.? పురుగుల మధ్య వంటలు, పలు హోటళ్లు సీజ్
-
CJP Protest: సీజేపీ నిరసనలకు పాక్ నుంచి ఫేక్ కంటెంట్.. ఎఫ్ఐఆర్ నమోదు..
-
BJP: ‘‘ఎన్నికల కమిషనర్లకు కేంద్ర మంత్రి, గవర్నర్ పదవులు’’.. కాంగ్రెస్ గత చరిత్రపై బీజేపీ ఫైర్..
-
Gutkha, Pan Masala Ban: గుట్కా, పాన్ మసాలాపై ఏడాది పాటు నిషేధం.. ప్రభుత్వం కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!