నేటి నుంచి లోక్ సభ సమావేశాలు.. నీట్ పరీక్షపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షం రెడీ 18వ లోక్‌సభ తొలి సమావేశాలు సోమవారం (జూన్ 24) నుంచి ప్రారంభం కానున్నాయి. లోక్‌సభ మొదటి సెషన్లో మొదటి రోజు ప్రతిపక్ష ఇండియా కూటమికి చెందిన ఎంపీలు సోమవారం ఉదయం పార్లమెంటు కాంప్లెక్స్‌లో సమావేశమై సభ వైపు కలిసి కవాతు చేస్తారు. కొత్తగా ఎన్నికైన ఎంపీలు ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పార్లమెంట్లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకుముందు లోక్‌సభ ప్రొటెం…
మంత్రిగా నారా లోకేష్ నేడు బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించలేదు. అయితే.. ఈ నేపథ్యంలోనే నేడు మంత్రి వర్గ సమావేశం కూడా ఉండటంతో ఆయన పదవీ బాధ్యలను సచివాలయంలో చేపట్టనున్నారు. ఇప్పటి వరకూ బాధ్యతలను చేపట్టక పోవడానికి ఆయన ఛాంబర్ లో స్వల్ప మార్పులు చేర్పులు చేయడం వల్లే అని చెబుతున్నారు. స్వల్ప మార్పులు చేయాల్సి రావడంతో… ఈ రోజు ఉదయం 9.45 గంటలకు నారా లోకేష్ బాధ్యతలు స్వీకరించనున్నారు.…
నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ప్రధాని మోడీ అధ్యక్షతన కేబినెట్ భేటీ. నేటి నుంచి పార్లమెంట్ సమావేశాలు. నేడు ఆన్లైన్లో సెప్టెంబర్ నెల టిక్కెట్లు విడుదల, మధ్యాహ్నం వసతి గదుల కోటాను విడుదల చేయనున్న టీటీడీ. నేడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలవనున్న టాలీవుడ్ నిర్మాతలు. తెలుగు చిత్రపరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు పవన్‌కు వివరించనున్న నిర్మాతలు. సినిమా టికెట్ల రేట్ల విషయంలో పవన్ కల్యాణ్‌తో చర్చించనున్న నిర్మాతలు. నేడు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి. ఎంపీల…
అసెంబ్లీ లాబీలో మంత్రి నారా లోకేష్ చిట్ చాట్ నిర్వహించారు. ప్రజా దర్బార్ కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రజా దర్బార్ ద్వారా చాలా సమస్యలు తన దృష్టికి వస్తున్నాయని మంత్రి వెల్లడించారు.
ఏపీ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పోలా భాస్కర్ ను నియమించింది. కాలేజ్ విద్య కమిషనర్ పోలా భాస్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీ మంత్రులకు శాఖల కేటాయింపు కసరత్తును ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గురువారం ఆయన తిరుపతి నుంచి అమరావతికి తిరిగి వచ్చాక ఎవరికి ఏ శాఖలు కేటాయించిందీ ప్రకటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో నూతన సర్కారు కొలువుదీరింది. మంత్రివర్గం ప్రమాణస్వీకారం ముగిసింది. కొత్త ప్రభుత్వం ఏర్పడడంతో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయిస్తారనే అంశంపై విస్తృతంగా చర్చ జరుగుతోంది.