ప్రకాశం బ్యారేజి గేట్లను బోట్లు ఢీకొట్టిన ఘటనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. ఈ బోట్లను వైసీపీ వాళ్లే కుట్రపూరితంగా వదిలారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ క్రమంలో.. మంత్రి నారా లోకేశ్.. వైసీపీ అధినేత వైఎస్ జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ పర్యటిస్తున్నారు.. గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు మంత్రి నారా లోకేష్ స్వాగతం పలికారు.. ఆ తర్వాత ఏరియల్ సర్వే ద్వారా బుడమేరు, క్యాచ్మెంట్ ఏరియాలను పరిశీలించారు చౌహాన్. అక్కడ నుంచి వరద ప్రభావిత ప్రాంతాలైన జక్కంపూడి మిల్క్ ఫ్యాక్టరీ, కండ్రిక, అజిత్‌సింగ్ నగర్ లను ఏరియల్ సర్వే ద్వారా కేంద్ర మంత్రి పరిశీలించగా... ఆయా ప్రాంతాల్లో జరిగిన…
విజయవాడలో నీట మునిగిన వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. అయితే.. ఇందుకోసం విజయవాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం ఏర్పాటు చేసంది ప్రభుత్వం. అయితే.. ఇక్కడ నుంచే అన్ని రకాల సహాయ చర్యలను పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నారు అధికారులు. అయితే.. విజయవాడ కలెక్టరేట్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూం నుంచి ఏపీ విద్యా మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ విజయవాడ వరద బాధితులకు యుద్ధ ప్రాతిపదికన సహాయక…
రాష్ట్రంలో జరిగిన భూ కుంభకోణాలపై సిసోడియా నివేదికపై వచ్చే కేబినెట్లో చర్చించి లెక్కలన్నీ బయటపెడతామని, అక్రమాలకు బాధ్యులైన అందరి పైనా చర్యలు ఉంటాయని మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో పాత విధానం అమలు చేస్తామని.. సెప్టెంబర్ 11న ముఖ్యమంత్రి సమక్షంలో ఫేజ్ రీయింబర్స్మెంట్ అమలు మీద నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు.
ఏలూరు నగర మున్సిపల్ కార్పొరే షన్ మేయర్ షేక్ నూర్జహాన్.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె తన భర్త పెద బాబుతో కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.. నేడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు కూడా.. టీడీపీ గూటికి చేరనున్నారు.
ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోంది! ముస్లింలను ఓట్లు వేసే యంత్రాలుగా మాత్రమే బీజేపీ చూస్తోందని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. వక్ఫ్ బోర్డును విచ్ఛిన్నం చేయాలని చూస్తోందని, దేశ వ్యాప్తంగా ముస్లింలు బీజేపీపై ఆగ్రహంగా ఉన్నారన్నారు. వక్ఫ్ బోర్డులో ఇద్దరు హిందూ మెంబర్లను పెట్టాలని ఎందుకు చెబుతున్నారు? అని ప్రశ్నించారు. వక్ఫ్‌కు వ్యతిరేకంగా బీజేపీ బిల్ ప్రవేశపెడుతుందని, వక్ఫ్‌ను ఖతం చేయాలని అనుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో ముస్లింలు లేకుండా…
ఏపీలో భారీ విస్తరణకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. మరో 15 వేల ఉద్యోగాల కల్పన దిశగా అడుగులు వేస్తోంది. మంత్రి నారా లోకేష్‌తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు భేటీ అయ్యారు. రాష్ట్రంలో భారీ ఎత్తున విస్తరణ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి లోకేష్‌కు హెచ్‌సీఎల్ ప్రతినిధులు వివరించారు.
28వ రోజు కూడా మంత్రి నారా లోకేష్ “ప్రజాదర్బార్” కు క్యూ కట్టారు ప్రజలు.. అయితే, భూవివాదాలపై ప్రజల నుంచి ఎక్కువ విజ్ఞప్తులు వస్తున్నందున ఆయా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు లోకేష్.. సంబంధిత శాఖతో సమన్వయం చేసుకోవాలని సిబ్బందికి సూచించారు.