CM Chandrababu: విద్యాశాఖపై ఏపీ సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. సమీక్షకు మంత్రి నారా లోకేష్, అధికారులు హాజరయ్యారు. గత ప్రభుత్వ విధానాలతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పడిపోయిన విధానాన్ని అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థులు తగ్గిపోవడానికి కారణాలపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. పాఠశాల విద్య, ఉన్నత విద్యలో ప్రమాణాలు పెంచే అంశంపై శాఖ పరంగా తీసుకుంటున్న చర్యలను మంత్రి లోకేష్ వివరించారు. ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకుండా గత ప్రభుత్వం విద్యావ్యవస్థను ఎలా నిర్వీర్యం చేసిందో అధికారులు వివరించారు. 2014 నుంచి 2019 మధ్య ఉన్న ఉత్తమ విధానాలను వైసీపీ ప్రభుత్వం పక్కన పెట్టిందని ఆరోపించారు.
Read Also: Pawan Kalyan: షార్‌లో అంతరిక్ష వారోత్సవాలకు పవన్ కల్యాణ్ హాజరు