Home
Nara Lokesh
Nara Lokesh News
-
Posani Krishnamurali: ఎట్టకేలకు పోసాని కృష్ణ మురళి విడుదల
ప్రముఖ సినీ నటుడు, మాజీ వైసీపీ నేత పోసాని కృష్ణమురళి ఎట్టకేలకు గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలయ్యారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యల కేసులో గత నెలలో అరెస్ట్ అయ్యాడు పోసాని. నిన్న సీఐడీ కోర్టు బెయిలు మంజూరు చేసినప్పటికీ, షూరిటీ సమర్పణలో ఆలస్యం కారణంగా విడుదల ప్రక్రియ కొంత జాప్యం అయింది. -
CM Chandrababu: తిరుమలకు చంద్రబాబు నాయుడు.. భక్తులకు అన్నప్రసాదం వడ్డించనున్న సీఎం!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని దర్శించుకోనున్నారు. మనవడు, మంత్రి నారా లోకేష్ కుమారుడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబంతో కలిసి నేడు, రేపు తిరుమల పర్యటనకు వెళుతున్నారు. సతీమణి భువనేశ్వరి, కుమారుడు నారా లోకేష్, కోడలు నారా బ్రాహ్మణి, మనవడు దేవాన్ష్‌తో కలిసి చంద్రబాబు తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఉదయం దర్శించుకోనున్నారు. చంద్రబాబు కుటుంబం ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు నాడు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురువారం… -
Lokesh vs Botsa: మేం క్షమాపణ చెప్పాలనడమేంటి?.. లోకేష్ వ్యాఖ్యలపై బొత్స ఫైర్!
పాఠశాలల హేతుబద్ధీకరణపై సభలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి నారా లోకేష్, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల యుధం కొనసాగింది. గత ప్రభుత్వ హయాంలో విద్యా ప్రమాణాలు పూర్తిగా వెనుకబడి పోయాయని, ‘నాడు-నేడు’ పేరుతో విద్యా వ్యవస్థను పతనావస్థకు చేర్చారని టీడీపీ సభ్యులు మండిపడ్డారు. విద్యార్ధుల సంఖ్య తగ్గిపోవడానికి గత ప్రభుత్వమే కారణమని ఆరోపించిన మంత్రి లోకేష్ అన్నారు. మంత్రి లోకేష్ వ్యాఖ్యలపై వైసీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో 12… -
AP Assembly 2025: విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు: మంత్రి లోకేష్
విశాఖలో ఏఐ, స్పోర్ట్స్ యూనివర్సిటీలు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని మంత్రి నారా లోకేష్ తెలిపారు. 2016లో ప్రైవేట్ యూనివర్సిటీల బిల్లు తీసుకొచ్చామని, అందులోని లోపాలు సరిదిద్ది కొత్త చట్టం తెస్తామన్నారు. ఎన్సీసీకి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటుపై కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించామన్నారు. యువగళం పాదయాత్రలో చేనేతలో కష్టాలు ప్రత్యక్షంగా చూశానని, చేనేత కళాకారులకు ఉచిత విద్యుత్‌కు క్యాబినెట్ ఆమోదం సంతోషాన్నిచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఏపీ అసెంబ్లీలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల సవరణ… -
Nara Lokesh: అమరావతికి వచ్చేందుకు ‘బిట్స్’ సిద్ధంగా ఉంది!
అభివృద్ది వికేంద్రీకరణకు కట్టుబడి పలు ప్రాంతాల్లో యూనివర్సిటీలు ఏర్పాటు చేస్తామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలను తీసుకొచ్చేందుకు యత్నిస్తున్నామని, అమరావతికి వచ్చేందుకు బిట్స్ సిద్ధంగా ఉందని చెప్పారు. ప్రభుత్వ వర్సిటీల్లో పరిపాలనకు యూనిఫైడ్ చట్టం తీసుకొస్తామన్నారు. గత ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన యాక్టును మొత్తం పరిశీలన చేసి మార్పులు, చేర్పులు చేస్తామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేటు వర్సిటీల ఏర్పాటుపై శాసనమండలిలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి లోకేశ్ సమాధానం ఇచ్చారు. ‘అభివృద్ది… -
Bhumana Karunakar Reddy: దేవాలయాలకు భద్రత లేదు.. సనాతన ధర్మానికి రక్షణ లేదు!
24 గంటల పాటు అన్నదానం సాగె దివ్యక్షేత్రం కాశినాయన క్షేత్రం అని, అన్నదానం సత్రాన్ని కూటమి ప్రభుత్వం బుల్డోజర్తో కూలగొట్టిందని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. కోట్లాది హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా బుల్డోజర్తో కాశినాయన క్షేత్రంను కూల్చారన్నారు. హిందూ ధర్మాన్ని పరిరక్షిస్తామనే సీఎం చంద్రబాబు పాలనలో కాశినాయన క్షేత్రం నేలకొరిగిందన్నారు. నిరసన, తీవ్ర వ్యతిరేకత రావడంతో మంత్రి నారా లోకేష్ తానే కట్టిస్తా అన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వంలో దేవాలయాలకు… -
Chandrababu Naidu: మనం నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు ఆయన: సీఎం
ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహనీయుడు శ్రీ పొట్టి శ్రీరాములు. నేడు ఆయన 125వ జయంతి. ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని.. పొట్టి శ్రీరాములును స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పించారు. విజయవాడ సామరంగ్ చౌక్ సెంటర్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఎంపీ కేశినేని పూలమాల వేసి నివాళులర్పించారు. తెలుగు వారందరూ నిత్యం స్మరించుకోదగిన మహానుభావుడు అమరజీవి శ్రీ… -
Nara Lokesh: నవ్వుకుంటున్నారు.. దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి!
‘ఫీజు పోరు’ అని ముందుగా పేరు పెట్టి.. ఆ తర్వాత ‘యువత పోరు’ అని పేరు మార్చటంపై జనాలు నవ్వుకుంటున్నారని మంత్రి నారా లోకేష్ వైసీపీపై సెటైర్లు వేశారు. అసలు వైసీపీ వాళ్లకు దేని మీద పోరాడుతున్నారో కనీసం క్లారిటీ ఉండాలి కదా? అని ఎద్దేవా చేశారు. స్వల్పకాలిక ప్రశ్నోత్తరాల సమయంలో అన్ని విషయాలు మాట్లాడేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్, ఉద్యోగాలు, ఉపాధి కల్పనపై మాట్లాడేందుకు తాము సిద్ధం అని మంత్రి లోకేష్ పేర్కొన్నారు.… -
Posani Krishna Murali: పోసాని కృష్ణ మురళికి కోర్టులో భారీ ఊరట..
పోసాని కృష్ణ మురళికి భారీ ఊరట లభించింది. కర్నూలు జే ఎఫ్ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ పోసాని కృష్ణ మురళికి బెయిల్ మంజూరు చేశారు. నిన్ననే పోసాని కస్టడీ పిటిషన్ ను మేజిస్ట్రేట్ డిస్మిస్ చేసింది. తాజాగా బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ను దూషించిన కేసులో నిందితుడు పోసాని.. ఈనెల 5వ తేదీ నుంచి కర్నూలు జైలులో ఉన్నారు. ఆదోని త్రీ టౌన్ పీఎస్ లో జనసేన నేత రేణువర్మ… -
Top Headlines @5PM : టాప్ న్యూస్
నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు.. హాజరైన సీఎం తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ (MLC) ఎన్నికల నామినేషన్ల దాఖలు ప్రక్రియ నేడు పూర్తి కానుంది. మొత్తం ఐదు ఎమ్మెల్సీ స్థానాల కోసం నామినేషన్లు దాఖలు చేయగా.. ఇందులో కాంగ్రెస్ పార్టీ నుంచి నలుగురు అభ్యర్థులు, బీఆర్ఎస్ (BRS) నుంచి ఒక అభ్యర్థి పోటీ చేస్తున్నారు. ఇందులో కాంగ్రెస్ నుండి అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి, సీపీఐ అభ్యర్థి నెల్లికంటి సత్యం అభ్యర్థులు నయోమిఇన్టిన్…
తాజావార్తలు
-
Saturday Horoscope: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. కానీ ఆ రాశి వారు మాత్రం జాగ్రత్త సుమీ..!
-
Abhijeet Dipke: నోటీసులు ఇచ్చినా వినలేదు.. అభిజీత్ దిప్కేపై ఢిల్లీ పోలీసుల కీలక ప్రకటన
-
International Day for the Eradication of Poverty: పేదరికం అంటే ఆకలి మాత్రమే కాదు.. కొత్త సవాళ్లివే.!
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!