TDP: ఏలూరులో వైసీపీకి భారీ షాక్.. టీడీపీలో చేరిన మేయర్ దంపతులు
- ఏలూరులో వైసీపీకి భారీ షాక్
- టీడీపీలో చేరిన ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ దంపతులు
- కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మంత్రి నారా లోకేష్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TDP: ఏలూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణ(చంటి) నేతృత్వంలో ఏలూరు కార్పొరేషన్ మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త ఎస్.ఎమ్.ఆర్ పెదబాబు టీడీపీలో చేరారు. వీరితో పాటు ఈయూడీఏ మాజీ ఛైర్మన్, ప్రస్తుత వైసీపీ పట్టణ అధ్యక్షులు బి.శ్రీనివాస్, ఏఎంసీ మాజీ ఛైర్మన్ మంచం మైబాబుతో పాటు పలువురు వైసీపీ నేతలు విద్య,ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఉండవల్లి నివాసంలో వీరిందరికీ పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఓటమి నుంచి వైసీపీ గుణపాఠం నేర్చుకోలేదని, ప్రజా ప్రభుత్వంపై నిత్యం దుష్ప్రచారం చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తుందని చెప్పారు.
Read Also: Andhra Pradesh: సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రాచరికపు పోకడలకు స్వస్తి.
Also Read
- ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
- IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
- Pawan Kalyan Fan: పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో పెను విషాదం.. కరెంట్ షాక్‌తో అభిమాని మృతి!
- AICC Disciplinary Action: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై క్రమశిక్షణ చర్యలు.? నేడు ఏఐసీసీ కీలక నిర్ణయం
ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ.. ఏలూరు అభివృద్ధి కోసం కలిసి వచ్చేవారికి స్నేహహస్తం అందిస్తున్నామన్నారు. ఆళ్ల నాని వైసీపీ కార్యకర్తలను వదిలేసి పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారని పేర్కొన్నారు. అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేవారిని తెలుగుదేశంలో చేర్చుకుంటున్నామని అన్నారు. త్వరలోనే దశల వారీగా కార్పొరేటర్లు తెలుగుదేశంలో చేరబోతున్నారని చెప్పారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తెలుగుదేశం వీడి వైసీపీకి వెళ్లాల్సి వచ్చిందని ఏలూరు మేయర్ షేక్ నూర్జహాన్ తెలిపారు. ఆ పార్టీలోకి వెళ్లాక ఏమాత్రం అభివృద్ధి చేయలేక పోయామని విమర్శించారు. దాదాపు 40 మంది కార్పొరేటర్లు త్వరలోనే తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధoగా ఉన్నారని ఆమె వెల్లడించారు.
తాజావార్తలు
-
OG 2: పవన్ కళ్యాణ్ బర్త్‌డేకు సుజీత్ సర్ప్రైజ్.. సాయంత్రం 4:05కు రాబోయేది ఇదేనా?
-
Mega wishes: ‘సంకల్ప సాధకుడు కళ్యాణ్ బాబు’.. పవన్‌కు చిరంజీవి మెగా బర్త్‌డే విషెస్!
-
ACB Raids: టీటీడీ డిప్యూటీ ఈవో ఇంట్లో ఏసీబీ దాడులు.. ఏకకాలంలో 5 చోట్ల సోదాలు.. 15 ఏళ్ల తర్వాత!
-
Panja Re Release: 15 ఏళ్ల తర్వాత కూడా తగ్గని పవన్ కళ్యాణ్ క్రేజ్.. ‘పంజా’ రీ రిలీజ్‌కు అదిరిపోయే ఓపెనింగ్స్!
-
Soft Roti Tips: పెనం నుంచి తీయగానే రోటీ గట్టిపడిపోతోందా? ఈ సింపుల్ టిప్‌తో రోజంతా సాఫ్ట్‌గా!
ట్రెండింగ్
-
IP69K రేటింగ్, 8,340mAh భారీ బ్యాటరీ,1.5K OLED డిస్‌ప్లేతో POCO X8 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్.!
-
8,050mAh బ్యాటరీ, 185Hz AMOLED డిస్‌ప్లే, 200MP కెమెరాతో ఫ్లాగ్షిప్ ఫోన్ POCO F9 Ultra లాంచ్.!
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్‌ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!