Nara Lokesh: యువగళం పాదయాత్రలో ఇచ్చిన హామీలో భాగంగా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఉండవల్లిలో సీతామహాలక్ష్మికి మంత్రి నారా లోకేష్ ఇంటి పట్టా అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈరోజు కూటమి ప్రభుత్వంలో పేదలందరికీ ఉచితంగా ఇంటి పట్టాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న చోటే పట్టాలు ఇవ్వాలని కోరారు.. మొదటి విడతగా మూడు వేల మందికి ఇంటి పట్టాలు ఇస్తున్నామన్నారు. అయితే, నేను మొదటిసారి మంగళగిరిలో పోటీ చేసి ఓడిపోయా.. మొదటి రోజు బాధపడినా మరుసటి రోజు నుంచి ప్రజల మనసులు గెలవాలని పని చెయ్యడం మొదలు పెట్టాను అని మంత్రి లోకేష్ వెల్లడించారు.
Read Also: Karthi : సర్దార్ 2 నుండి యువన్ శంకర్ రాజా ఔట్
ఇక, 2024లో నన్ను గెలిపించాలని కోరా.. ఎవరూ ఊహించని విధంగా రికార్డు మెజారిటీతో నన్ను గెలిపించారు అని మంత్రి నారా లోకేష్ తెలిపారు. స్వచ్చ మంగళగిరి పేరుతో దేశంలో ఈ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా తయారు చేయాలని పని చేస్తున్నాను.. మంగళగిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మంగళగిరిలో అత్యంత ఆధునిక వసతులతో వంద పడకల ఆసుపత్రి నిర్మిస్తాం.. ప్రభుత్వ నిధులతో పాటు దాతల సహకారంతో అభివృద్ధి పనులు చేపడతాం.. మంగళగిరి చేనేతలు, స్వర్ణకారుల కోసం ప్రత్యేక నిర్మాణాలు చేపడతామని నారా లోకేష్ పేర్కొన్నారు.