ఈ ప్రభుత్వం పేదలు కోసం పని చేస్తుందని.. 64 లక్షలు మందికి ఒకటవ తేదీన పింఛన్ లు అందిస్తోందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 34 వేలు కోట్లు రూపాయలు పింఛన్ డబ్బులు ఇప్పటి వరకు అందించామన్నారు. ముఖ్యమంత్రి తాజాగా మీడియాతో మాట్లాడారు. దేశంలో ఎక్కడ ఈ స్థాయిలో పింఛన్లు ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. భగవంతుడు దయ చూపిస్తే పింఛన్ పెంచుతామని తెలిపారు.
కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ లోకేష్ కనుసన్నల్లోనే నడుస్తోంది. మంత్రిగా ఉంటూనే పార్టీ వ్యవహారాలను లోకేష్ దగ్గరుండి చూసుకుంటూ ఉన్నారు. మహానాడు మొత్తాన్ని లోకేష్ దగ్గరుండి నడిపించారనే అభిప్రాయం కూడా బలంగా ఉంది. వేదికను ఎంపిక చేయడం దగ్గర్నుంచి... కమిటీల ఏర్పాటు దాకా లోకేష్ పాత్ర స్పష్టంగా కనిపించింది. మహానాడు వేదిక మీద చాలామంది సీనియర్ నేతలు లోకేష్కు వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు
కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు తుస్సుమంది అంటూ సెటైర్లు వేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు.. చంద్రబాబు ప్రసంగం మొత్తం అభద్రతాభావం కనిపించింది.. కడప మహానాడు తుస్సుమంది.. ప్రజలను డైవర్ట్ చేయటానికి కామెడీ ఆర్టిస్ట్ లను తీసుకువచ్చారు.. ఎమ్మెల్యేల వినోద కార్యక్రమాల సమయంలో కూడా జగన్ ను తిట్టించటం కింద నవ్వుకోవటం.. మేం మీ మీద ఇలా మీ మీద మాట్లాడలేమా..? అని ప్రశ్నించారు.. మాట్లాడితే తల్లి, చెల్లి అంటారు..
Nara Lokesh: కడప జిల్లాలో నిర్వహిస్తున్న మహానాడు బహిరంగ సభలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. పౌరుషాల గడ్డపై టీడీపీ జెండా రెపరెపలాడుతోంది అన్నారు. 175 నియోజకవర్గాలకు గాను 164 సాధించాం ఇది ఆల్ టైం రికార్డ్ అని పేర్కొన్నారు. జెండా పీకేస్తాం అన్నారు.. ఇప్పుడు వాళ్ళ పార్టీ ఆఫీసుకు టూలేట్ బోర్డు పెట్టారని ఆరోపించారు.
నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం! వ్యక్తిగతంగా నా పేరుతో పద్మశ్రీ వచ్చినా.. ఇది ఉద్యమకారులందరికీ దక్కిన గౌరవం అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. పద్మశ్రీ పురస్కారం ఉద్యమానికి దక్కిన అభినందనలు అని తెలిపారు. 1994లో ఉద్యమం మొదలైందని, ఎమ్మార్పీఎస్ది ముప్పై ఏళ్ల పోరాటమన్నారు. సమాజంలో అన్ని వర్గాల అండదండలతోనే ఉద్యమం సాధ్యమయిందన్నారు. సుప్రీంకోర్టు సైతం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని మందకృష్ణ మాదిగ అన్నారు. మంగళవారం…
Yuva Galam Padayatra Book: వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ అధినే, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై గళమెత్తుతూ తాను చేపట్టిన యువగళం పాదయాత్ర విశేషాలతో రూపొందించిన పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకి అందజేశారు మంత్రి నారా లోకేష్.
జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ వ్యవస్థను సర్వనాశనం చేశాడని ఆరోపించారు. తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి కూడా విద్యుత్ చార్జీలు పెంచలేదు.. కానీ, వైసీపీ హాయాంలో తొమ్మిది సార్లు విద్యుత్ చార్జీలు పెంచారు అని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి.
మహానాడు వేదికగా మంత్రి నారా లోకేష్ కు కీలక పదవి ఇవ్వాలని ప్రతిపాదించారు సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర.. లోకేష్కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని మినీ మహానాడులో తాము తీర్మానించామని.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు చెప్పారు ధూళిపాళ్ల నరేంద్ర.. పార్టీ నేతలు, శ్రేణులు, అందరూ కోరుకుంటున్న విధంగా లోకేష్ కు టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబును కోరారు నరేంద్ర
కార్యకర్తలే నా హై కమాండ్.. వారే సుప్రీం అని తెలిపారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు.. టీడీపీ మహానాడులో రెండో రోజు ఆయన మాట్లాడుతూ.. మళ్లీ జన్మ ఉంటే తెలుగు గడ్డపై పుడతా అన్నారు.. కార్యకర్త నా హై కామాండ్.. కార్యకర్తె నా సుప్రీం అని స్పష్టం చేశారు.. తొలిసారిగా 65 మంది యువత కు సీట్లు ఇచ్చాం... ఎమ్మెల్యేలు, ఎంపీలు గెలిచారని గుర్తుచేశారు.. లోకేష్ 6 శాసనాలు ప్రవేశ పెట్టారు.. ఆయనకు…
కడపలో రెండో రోజు టీడీపీ మహానాడు ప్రారంభమైంది.. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, విశ్వవిఖ్యాత, నటసార్వభౌమ, నటరత్న, పద్మశ్రీ, డాక్టర్ నందమూరి తారకరామారావు 102వ జయంతి సందర్భంగా సభా వేదికపై ఆయన విగ్రహానికి నివాళులర్పించారు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్.. అయితే, మహానాడు వేదికగా ఎన్టీఆర్ ఏఐ ప్రసంగం ఎంతగానో ఆకట్టుకుంది..