మూడు రోజులపాటు జరుగుతున్న మహానాడులో ఆఖరి ఘట్టం భారీ బహిరంగ సభ... ఇది ఇప్పుడు టీడీపీ నేతలకు సవాలుగా మారింది.. ఒకపక్క వర్షాలు.. మరోపక్క మహానాడు నిర్వహణ.. టీడీపీ నేతలకు కత్తి మీద సాముగా మారింది... ప్రతిపక్ష నేత అడ్డాలో మొట్టమొదటిసారిగా నిర్వహిస్తున్న సభను కానీ విని ఎరుగని రీతిలో నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ భావిస్తోంది... అందుకోసం జన సమీకరణ చేయడానికి కడప జిల్లాలోని టీడీపీ నేతలకు టార్గెట్ ఫిక్స్ చేశారట అధిష్టానం..
మహానాడు ఈ రోజు కీలక ఘట్టానికి వేదిక కానుంది.. టీడీపీ జాతీయ అధ్యక్ష పదవికి నేడు నామినేషన్లు దాఖలు చేయనున్నారు.. ఆ తర్వాత మధ్యాహ్నం జాతీయ అధ్యక్షుడు ఎన్నిక జరగనుంది.. సాయంత్రం నూతనంగా ఎన్నికైన జాతీయ అధ్యక్షుని చేత ప్రమాణ స్వీకారం చేయించనున్నారు.. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారని తెలుస్తోంది
తెలుగుదేశం పార్టీ చరిత్రలో మొట్టమొదటిసారిగా... కడపలో మహానాడు కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహిస్తోంది. గురువారంతో.... ఈ మూడు రోజుల వేడుక ముగుస్తుంది. ఇక వచ్చే నెల 12తో కూటమి ప్రభుత్వం ఏడాదిపాలన పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో పూర్తి స్థాయి మార్పులు, చేర్పులకు సిద్ధమవుతున్నారట సీఎం చంద్రబాబు.
కడప జిల్లాలో టీడీపీ మహానాడు ఘనంగా ప్రారంభమైంది. రాష్ట్ర అభివృద్ధి, కార్యకర్తల సంక్షేమం అనే అజెండాతో మొదటి రోజు మహానాడులో తీర్మానం ప్రవేశపెట్టారు. ఆరు ప్రధాన అంశాలను సభ ముందు ఉంచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రసంగం కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.
మహానాడు ఒక చారిత్రక రాజకీయ వేడుక అంటూ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్టు పెట్టారు పవన్ కల్యాణ్.. "మహానాడు... ఈ పదం విన్నా, చదివినా వెంటనే గుర్తుకు వచ్చేది ‘తెలుగు దేశం’ పార్టీనే. అంతలా తెలుగువారి గుండెల్లో స్థిరపడిపోయింది ఏటా జరిగే మహానాడు వేడుక. రాయలసీమ గడ్డపై.. కడపలో అంగరంగ వైభవంగా మహానాడు చారిత్రక రాజకీయ పండుగ నేడు ప్రారంభమైన శుభవేళ నా పక్షాన, జనసేన పార్టీ పక్షాన తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, విద్యాశాఖా…
మీడియాతో నారా లోకేశ్ చిట్చాట్లో తదుపరి సీఎం మీరేగా అన్న మీడియా ప్రశ్నకు లోకేశ్ సమాధానమిస్తూ.. ముఖ్యమంత్రి పదవికి అంత తొందరేముంది? అని ప్రశ్నించారు.. సీఎం చంద్రబాబు యంగ్ అండ్ డైనమిక్ నాయకులు.. ఆయన ఇంకా యువ నాయకుడే అని అభివర్ణించారు.. దేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, రాష్ట్రానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వం చాలా అవసరం.. ప్రజలకు సేవ చేసేందుకు పదవితో సంబంధం లేదన్నారు నారా లోకేష్..
తెలుగు జాతి కోసం పుట్టిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేశ్ తెలిపారు. పేదరికం లేని సమాజం టీడీపీ లక్ష్యం అని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పార్టీలో కూడా మార్పు రావాలని, మహానాడు వేదికగా మరో 40 సంవత్సరాలు పార్టీ నడపడానికి కావలసిన అంశాలపై చర్చించాలన్నారు. ఎత్తిన పసుపు జెండా దించకుండా కార్యకర్తలు పార్టీకి కాపలా కాశారని, ప్రతి కార్యకర్తకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా…
తెలుగు దేశం పార్టీ పండుగ మహానాడు మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. కడపలో మూడురోజుల పాటు జరగనున్న మహానాడు .. రేపు ఉదయం 8.30 గంటలకు ప్రతినిధుల నమోదుతో ప్రారంభం కానుంది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, ముఖ్య నేతలు.. పార్టీ నివేదికను మహానాడుకు సమర్పిస్తారు. పార్టీ తెలుగు రాష్ట్రాల అధ్యక్షుల ప్రసంగాలు ఉంటాయి. ఆ తర్వాత పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు ప్రసంగిస్తారు.
CM Chandrababu: చిత్తూరు జిల్లా కుప్పంలో నేడు (ఆదివారం) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గృహప్రవేశ వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. ఉదయం పది గంటలకు శాంతిపురం మండలంలోని కడపల్లె పంచాయతీ శివపురంలో నిర్మించిన ఆయన కొత్త ఇంటిలో గృహప్రవేశ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా సీఎం కుటుంబ సభ్యులైన నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్ ఇప్పటికే కుప్పానికి చేరుకున్నారు. ఈ గృహప్రవేశాన్ని పురస్కరించుకుని సీఎం ఇంటి వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. అతిధులకు…
ఇకపై కార్యకర్తల బాధ్యత తనదే అని మంత్రి నారా లోకేష్ హామీ ఇచ్చారు. పార్టీ కోసం కష్టపడిన వారి ఇంటికి పెద్దకొడుకులా అండగా ఉంటానని చెప్పారు. టీడీపీకి కార్యకర్తలే బలమని, ఇకపై కార్యకర్తలను నేరుగా కలుసుకోవాలని మంత్రి నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ హయాంలో హత్యకు గురైన రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటి రెడ్డి కుటుంబ సభ్యులను ఉండవల్లి నివాసానికి పిలిపించుకుని వారితో లోకేష్ భేటీ అయ్యారు. Also Read: CM Chandrababu:…