ఏపీలో 81 లక్షల మంది నిరక్షరాస్యులు ఉన్నట్లు తేలింది. 15 నుంచి 59 ఏళ్ల మధ్య వయస్సులో నిరక్షరాస్యులు ఉన్నారు. విద్యాశాఖ సమీక్షలో మంత్రి నారా లోకేశ్ విస్మయం వ్యక్తం చేశారు. వయోజనా విద్యా మిషన్ తక్షణం ప్రారంభించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే.. ‘అందరికీ విద్య (వయోజన విద్య)లో నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ (అండర్ స్టాండింగ్ ఆఫ్ లైఫ్‌లాంగ్ లర్నింగ్ ఫర్ ఆల్ ఇన్ సొసైటీ) కార్యక్రమానికి శ్రీకారం…
మంత్రి నారా లోకేశ్ ప్రాతినిథ్యం వహించే మంగళగిరి నియోజకవర్గంలో ప్రజలకు సురక్షిత తాగునీరు అందించేందుకు ప్రభుత్వం అదనంగా నిధులు కేటాయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మంగళగిరి, తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సమగ్ర తాగునీటి అభివృద్ది పథకం కోసం అదనంగా మరో రూ. 111.కోట్ల కు పైగా నిధుల విడుదలకు పరిపాలన అనుమతి లభించింది. ఈ మేరకు కేటాయింపుల వివరాలతో మున్సిపల్ శాఖ ఉత్తర్వుల్లో స్పష్టత ఇచ్చింది. సురక్షిత తాగునీరు అందించే పథకం కోసం…
నేడు బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్.. ఇక ఎర్ర సముద్రమే! 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. మంగళవారం రాత్రి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన ఫైనల్లో 6 పరుగుల తేడాతో గెలిచిన ఆర్సీబీ.. ఐపీఎల్ 2025 టైటిల్‌ను కైవసం చేసుకుంది. మూడు సార్లు ఐపీఎల్ ఫైనల్లో భంగపడ్డ ఆర్సీబీ.. నాలుగో ప్రయత్నంలో ట్రోఫీని ఒడిసి పట్టింది. ఆర్సీబీ ఐపీఎల్ విజేతగా నిలవడంతో…
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను మలుపుతిప్పిన ‘యువగళం’ పాదయాత్రపై రూపొందించిన పుస్తకాన్ని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు మంత్రి నారా లోకేశ్ అందజేశారు. క్యాబినెట్ భేటీ సందర్భంగా రాష్ట్ర సచివాలయంకు వచ్చిన పవన్‌ను కలిసిన లోకేశ్.. బుక్ అందించారు. పవన్‌తో పాటు ఇతర మంత్రులకు కూడా యువగళం పుస్తకం లోకేశ్ అందజేశారు. యువగళం పుస్తకంను డిప్యూటీ సీఎం ఓపెన్ చేసి పరిశీలించారు. Also Read: Botsa Satyanarayana: మాజీ మంత్రి బొత్స సత్య నారాయణకు అస్వస్థత! ఈ సందర్భంగా…
2024 అసెంబ్లీ ఎన్నికల్లో అఖండ విజయం సాధించి.. కూటమి ప్రభుత్వం పాలన ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రజాస్వామ్యం గెలిచిన రోజు అని పేర్కొన్నారు. సరిగ్గా సంవత్సరం క్రితం ఇదే రోజున విధ్వంసపాలనపై ప్రజలు గెలిచారన్నారు. అరాచక, కక్షపూరిత పాలనపై ప్రజా ఆకాంక్షలు ఘన విజయం సాధించాయని.. ఈ గెలుపు ఐదు కోట్ల ప్రజల గెలుపు అని అన్నారు. కూటమి ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు.…
దేశం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడే ఆర్మీ జవాన్ కు మంత్రి నారా లోకేష్ అండగా నిలిచారు. సత్యసాయి జిల్లా అమరాపురం మండలం కె.శివరంలో తన భార్య తల్లిదండ్రులకు చెందిన రెండెకరాల భూమిని కబ్జా చేశారంటూ రాష్ట్రానికి చెందిన బీఎస్ఎఫ్ జవాన్ డి.నరసింహమూర్తి జమ్మూకశ్మీర్ నుంచి సెల్ఫీ వీడియో విడుదల చేశారు.. అమరాపురం మండలం ఉదుకూరుకు చెందిన నరసింహమూర్తి దేశ సరిహద్దుల్లో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు.
భారీగా పేలిన అగ్నిపర్వతం.. పరుగులు పెట్టిన పర్యాటకులు..! ఇటలీలోని సిసిలీ తూర్పు తీరంలో ఉన్న ప్రసిద్ధ మౌంట్ ఎట్నా అగ్నిపర్వతం మళ్లీ భారీగా పేలింది. అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలవడంతో, పెద్ద మొత్తంలో బూడిద మేఘాలు ఆకాశంలో ఏర్పడ్డాయి. పేలిన అగ్ని పర్వతం అగ్నిని, బూడిదను పొగలను వెదజల్లుతూ సమీప ప్రాంతాలను కమ్మేసింది. ఈ ఘటన జరిగిన సమయంలో పర్వతం వద్ద ఉన్న పర్యాటకులు భయంతో పరుగులు పెట్టారు. పక్కనుంచి బూడిద మేఘం విరుచుకుపడుతుండగా తమ ప్రాణాల కోసం…
మంత్రి నారా లోకేష్ కోసం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కూడా డమ్మీ చేశారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి.. అనంతపురంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలుగుదేశం కండువా కప్పుకుంటేనే పథకాలు ఇస్తాం అంటున్నారు? అని మండిపడ్డారు.. రాష్ట్రంలో ఎమ్మెల్యేల అందరికీ కమీషన్లు వస్తున్నాయి.
ప్రజా జీవితంలోనూ, వ్యక్తిగత జీవితంలోనూ ఫెయిల్ అయిన జగన్ రెడ్డి ఇప్పటికైనా బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి నారా లోకేష్ అన్నారు. చిన్నప్పుడే టెన్త్ పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనిఫామ్ దగ్గర నుంచి చిక్కీ వరకూ పార్టీ రంగులు, మీ పేరు పెట్టుకొని ఇప్పుడు విలువలు మాట్లాడటం మీకే చెల్లిందని..ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, ఉచితంగా ఇచ్చే టెక్స్ట్ బుక్స్ రద్దు చేసిన మీరూ మాట్లాడటమేనా?…
వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి గుంటూరు సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి అంశంలో సీఐడీ విచారణకి ఆయన హాజరయ్యారు. తాజాగా వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ విచారణ ముగిసింది.. రెండు గంటలపాటు సీఐడీ అధికారులు ఆర్కేను విచారించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో తనకు నోటీసు ఇచ్చారని తెలిపారు. నోటీసు ఇవ్వడంతో తాను విచారణకు హాజరయ్యానని చెప్పారు. తాను ఆ రోజు…