కృష్ణా జిల్లాలో బాబు ష్యూరిటీ మోసం కార్యక్రమాల్లో మాజీ మంత్రి పేర్ని నాని చేస్తున్న వ్యాఖ్యలు చర్చగా మారుతున్నాయి. పామర్రు, అవనిగడ్డ నియోజక వర్గాల్లో చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఈ మీటింగ్స్ లో పేర్ని నాని మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ మాదిరి.. మీరు కూడా చెడిపోయారా..? లోకేష్ రెడ్ బుక్ అంటే.. మీరు రప్పా రప్పా అంటున్నారు అన్నారు. ఏదైనా చేయాలంటే చీకట్లో కన్నుకొడితే అయిపోవాలి తప్ప రప్పా రప్పా అని అనటం కాదన్నారు.…
ఇవాళ ఏపీ వ్యాప్తంగా పేరెంట్ టీచర్ మీటింగ్ జరగనుంది. అన్ని ప్రభుత్వ. ప్రైవేట్ స్కూళ్లు, కాలేజీలలో నిర్వహించనున్నారు... సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేష్ సత్యసాయి జిల్లాలో కొత్తచెరువు ప్రభుత్వ పాఠశాలలో పాల్గొంటారు.. 2 కోట్ల మంది భాగస్వామ్యం తో ఈ మీటింగ్ జరగనుంది.. సుమారు 75 లక్షల మంది విద్యార్థులు..
సభ్య సమాజం తల దించుకునేలా నా పై జరిగిన మాటల దాడిని ఖండిస్తూ నాకు అండగా నిలబడిన తెలుగుదేశం కుటుంబసభ్యులకు, ప్రజానీకానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అంటూ ఓ వీడియో విడుదల చేశారు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి..
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఉదయం 11 గంటలకు సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశ జరగనుంది.. రాజధాని లో 20,494 ఎకరాల భూ సమీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది కేబినెట్.. 4 అంతర్జాతీయ కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా ఆమోదం తెలపనుంది.. రాజధాని నిర్మాణానికి ఇసుక డీసిల్టేషన్‌కు అనుమతి ఇవ్వనుంది కేబినెట్..
Botsa Satyanarayana: కాకినాడ జిల్లాలోని పిఠాపురంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సూపర్ సిక్స్ వాగ్దానాలు ఎందుకు అమలు చేయడం లేదని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
మంచి నాయకులకే ప్రజల్లో గుర్తింపు, గౌరవం ఉంటుందని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులతో సుపరిపాలనలో తొలి అడుగు – ఇంటింటి టీడీపీ కార్యక్రమంపై ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాలోకేష్‌ను సీఎం కొనియాడారు.
సీనియర్లు పార్టీకి కాపలా కాశారని.. సీనియర్ల సహకారం పార్టీకి అవసరమని మంత్రి నారాలోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో మంత్రి లోకేశ్ ప్రసంగించారు. ఎన్నికల్లో గెలుపు వెనుక కార్యకర్తల కష్టం ఉందని గుర్తు చేశారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించేందుకు కష్టపడాలన్నారు. మంచి పనులు చేయాల్సిన బాధ్యత మనపై ఉందని స్పష్టం చేశారు. 151 సీట్లు 11 అయ్యాయంటే దానికి కారణం వారి అహంకారమని విమర్శించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా…
రెడ్ బుక్.... ఏపీ పాలిటిక్స్‌లో ఇదో హాట్ సబ్జెక్ట్. దీనికి సంబంధించే అధికార, ప్రతిపక్ష నాయకుల మధ్య తరచూ ఆరోపణలు, సవాళ్ళ పర్వం నడుస్తూ ఉంటుంది. మంత్రి లోకేష్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ రెడ్‌బుక్ ఓపెన్ చేస్తే... ఇప్పుడు టీడీపీ నాయకులు కొందరు లోకల్ బుక్స్‌ని ఓపెన్ చేసేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. పైగా... లోకేష్ తన రెడ్‌బుక్‌ని క్లోజ్ చేసినా... నేను మాత్రం సంగతి తేలేదాకా మూసే ప్రసక్తే లేదని అంటున్నారట గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం.
కూటమి ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ టార్గెట్‌గా మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆర్కే రోజా.. మహిళల అక్రమ రవాణాపై ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదు? అని నిలదీశారు ఆర్కే రోజా.. ఇప్పుడు మీ ప్రభుత్వమే ఉంది కదా పవన్ కల్యాణ్... మరి ఇప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ను తొక్కిపెట్టి నార తీయాలి కదా..? అని…