Margani Bharat: రాజమండ్రిలో జరిగిన వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ తో పాటు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణ పాల్గొన్నారు. రీ కాలింగ్ చంద్రబాబూస్ మానిఫెస్టో అని జగనన్న ఇచ్చిన పిలుపు మేరకు ఇంటింటికి వెళ్లి అధికార పార్టీ అమలు చేయని హామీల గురించి వివరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మార్గాని భరత్ మాట్లాడుతూ.. బాబు షూరిటీ ఏదని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు అడుగుతున్నారని పేర్కొన్నారు. సింగయ్య అనే వ్యక్తి చనిపోతే.. ఏఐ వీడియో రూపొందించి జగన్ కారు కింద పడినట్లు అధికార పార్టీ నేతలు చూపించారని ఆరోపించారు. ప్రతిపక్ష నాయకులపై ఏదో రకంగా కేసులు పెట్టీ ఇబ్బందులకు గురి చేయాలని చూస్తున్నారని అన్నారు. బులెట్ ప్రూఫ్ కారు మెడ ఎక్కితే అసలు మెడే ఉండదని వివరించారు.. నారా లోకేష్ రెడ్ బుక్ పేరుతో రెచ్చి పోయి.. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని మార్గాని భరత్ విమర్శించారు.
Read Also: Nehal Modi: పీఎన్‌బీ బ్యాంకు మోసం కేసు, అమెరికాలో నీరవ్ మోడీ సోదరుడు నేహాల్ మోడీ అరెస్ట్..
అలాగే, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ.. రాష్ట్రంలో అద్భుతమైన పాలన అందించిన ఘనత వైఎస్ జగన్ కే దక్కుతుందన్నారు. జగన్ అంటే నిజం చంద్రబాబు అంటే అబద్ధం అని విమర్శించారు. దళారుల ప్రమేయం లేకుండా అర్హులైన వారందరికి లబ్ది చేకూర్చిన నేత జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని పేర్కొన్నారు. పేద వాళ్లని ఉద్దరించడానికే వైఎస్ జగన్ రాజకీయాల్లోకి వచ్చారు.. కరోనా సమయంలో వాలంటీర్ల వ్యవస్థను దేశమంతా మెచ్చుకున్నారని గుర్తు చేశారు. విషాహారం తిన్న పిల్లలను నేలపై కూర్చోబెట్టి వైద్యం అందించిన దౌర్భాగ్య స్థితి ప్రస్తుతం ఈ రాష్ట్రంలో నెలకొందని ఆరోపించారు. చేసింది.. చెప్పిన వారి కంటే వేస్తానని చెప్పిన వారిని జనం నమ్మి మోసపోయారని చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు.