Gudivada Amarnath: లోక నాయకుడు కమల్ హాసన్.. లోక మాయకుడు చంద్రబాబు..!
- సీఎం చంద్రబాబుపై గుడివాడ అమర్నాథ్ సెటైర్లు..
- చంద్రబాబు.. కమల్ హాసన్‌ను మించిపోయారు..
- లోక నాయకుడు కమల్ హాసన్ అయితే..
- లోక మాయకుడు చంద్రబాబు..
- బాబు ఏక్ నెంబర్.. బేటా దస్ నెంబర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gudivada Amarnath:సీఎం చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.. విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు నాయుడు.. కమల్ హాసన్‌ను మించిపోయారని సెటైర్లు వేశారు.. లోక నాయకుడు కమల్ హాసన్ అయితే.. లోక మాయకుడు చంద్రబాబు అని.. దశవతారాలు చంద్రబాబు.. బాబు ఏక్ నెంబర్, బేటా దస్ నెంబర్ అంటూ.. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌పై హాట్ కామెంట్లు చేశారు.. ఇక, మామను వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయ్యారు అంటూ మరోసారి దుయ్యబట్టారు అమర్నాథ్..
Read Also: Jai Hanuman: ఈసారి పాన్ వరల్డ్ టార్గెట్..
Also Read
- AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
- AP and TG Crime: మాదాపూర్ ఓయోలో యువతి మృతి కేసులో ట్విస్ట్.. విశాఖలో యువకుడి ఆత్మహత్యాయత్నం
- Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
- Girls Hair Cutting: నిద్రలో ఉండగా జడలు కత్తిరింపు.. భీమిలి కేజీబీవీలో కలకలం
గత రెండు రోజులుగా చంద్రబాబు, లోకేష్ లు.. వైఎస్ జగన్ పై, వైసీపీపై పడి ఏడుస్తున్నారు.. సింగపూర్ వెళ్లి సాధించింది ఏం లేక.. ఇక్కడ ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తేలిక జగన్ పై పడిపోతున్నారని విమర్శంచారు గుడివాడ అమర్నాథ్.. మంత్రి లోకేష్ బరువు తగ్గాడు తప్ప బుద్ధి పెరగలేదన్న ఆయన.. బాబుని మించి అబద్దాల కోరులా తయారయ్యాడు లోకేష్ అని మండిపడ్డారు.. సింగపూర్ లో ఎవరో ఈమెయిల్ ద్వారా కంప్లైంట్ పెట్టారట.. తీరా ఆ కంప్లైంట్ ఎవరు పెట్టారు అంటే టీడీపీ సానుభూతి పరుడే పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు.. ఇవన్నీ కూడా వైసీపీ ఖాతాలో వేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు..
Read Also: Russia vs America: అమెరికాకు రష్యా హెచ్చరిక.. మా దగ్గర కూడా అణు జలాంతర్గాములున్నాయి..!
ఇక, 1995 నుంచి చంద్రబాబుకి సంబంధాలు ఉన్నాయని ఇప్పుడు లోకేష్ చేస్తున్నారు.. మేం ఎప్పుడూ అదే చెప్తున్నాం.. సింగపూర్‌లో బాబు సంబంధాలు ఏంటో అందరికీ తెలుసు అన్నారు అమర్నాథ్.. అక్కడ పెట్టుబడులు తేవడానికి కాదు ఇక్కడ దోచుకుంది అక్కడ దాచుకోవడమే.. అందుకే 58 సార్లు సింగపూర్ వెళ్లారు చంద్రబాబు. సింగపూర్ లో ఈశ్వరన్ వీరికి బిజినెస్ పార్టనర్ కాదా?! అని నిలదీశారు.. ఈ పదిహేను నెలల్లో ఏం సాధించారు?! ప్రజలకు చెప్పండి, బహిరంగంగా చర్చించండి. అదానీ డేటా సెంటర్ గురించి గొప్పలు చెప్పుకుంటున్నావు చంద్రబాబు.. అది రావడానికి కారణం వైసీపీ కాదా?! అని ప్రశ్నించారు.. మేం చేసిన పనులకు నీ గొప్పలుగా చెప్పుకుంటున్నావు.. 974 సముద్ర తీరం ఉంది.. ఈ తీరాన్ని వినియగించోవాలని, అభివృద్ధి చేయాలన్న ఆలోచన మీకు వచ్చిందా?! అని ఫైర్ అయ్యారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్..
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?