ఒక పక్క ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడుల కోసం సీఎం చంద్రబాబు, మంత్రులు, అధికారులు సింగపూర్లో పర్యటన చేస్తుంటే.. కొందరు వాటిని చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మంత్రి నారా లోకేష్ మండిపడ్డారు. ఏపీకి పెట్టుబడులు రాకుండా సింగపూర్ ప్రభుత్వానికి మురళీ కృష్ణ అనే వ్యక్తి ఈ-మెయిల్ పంపించారని తెలిపారు. రేపోమాపో ఏపీలో ప్రభుత్వం మారిపోతుందని, వారితో ఒప్పందాలు చేసుకోవద్దు అందులో పేర్కొన్నారని చెప్పారు. మురళీ కృష్ణ ఎవరా అని చూస్తే.. పెద్దిరెడ్డికి చెందిన ఒక సంస్థలో ఉండే వ్యక్తి అని…
సీఎం చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్ట్ చేశారు కాబట్టి.. మాజీ సీఎం వైఎస్ జగన్ను అరెస్ట్ చేయాలని చూస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. రాష్ట్ర ప్రజలకు ఒక అద్భుతాన్ని తయారు చేసినట్లుగా జగన్ మీద విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో తన కొడుకుకు జగన్ అడ్డంకి లేకుండా చేయాలనే చంద్రబాబు తపనపడుతున్నారని పేర్కొన్నారు. మిగతా వారు అయితే మాట వింటారని.. జగన్ వినడు కాబట్టి కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్…
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీని ఏడిపించాలని చూస్తున్నారంటూ కూటమి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు తంబళ్లపల్లె ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి.. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఎంపీ మిథున్ రెడ్డిను ములాఖత్ లో కలిశారు శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు, ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ప్రసాదరాజు.. ఈ సందర్భంగా ద్వారకనాథ్ రెడ్డి మాట్లాడుతూ.. కోర్టులో ఆర్డర్ ఇచ్చినా అన్నింటిలో వేలు పెట్టి చూసే పరిస్థితి కనిపిస్తుందన్నారు.. మిథున్రెడ్డిని జైలులో టెర్రరిస్టులు, మావోయిస్టులను చూసినట్టు చూస్తున్నారు అని మండిపడ్డారు..
గోవా గవర్నర్గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణ స్వీకారం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు.
SIPB: సీఎం చంద్రబాబు మార్గదర్శంలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఈ నేపథ్యంలో ఏపీకి కొత్తగా రూ.20,216 కోట్ల విలువైన నాలుగు భారీ ప్రాజెక్టులు రానున్నాయి. దీంతో దాదాపు 50,600 మందికి ఉద్యోగావకాశాలు ఏర్పడనున్నాయని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన తొమ్మిదవ రాష్ట్ర పెట్టుబడి ప్రమోషన్ బోర్డు (SIPB) సమావేశంలో ఈ ప్రాజెక్టులకు ఆమోదం లభించింది. ఈ సమావేశంలో సిఫీ ఇన్ఫినిటీ స్పేసెస్ లిమిటెడ్, సత్వ డెవలపర్స్ ప్రైవేట్…
Nara Lokesh: విజయవాడలో జరుగుతున్న ఇన్వెస్టోపియా గ్లోబల్ సమ్మిట్–2025లో ఏపీ ఐటీశాఖ మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ.. మన మిత్ర ప్లాట్ఫారమ్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం మరింత మెరుగైన సేవలు అందిస్తోంది అన్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు జోరు చూస్తుంటే గత సినిమాల తాలూకు రికార్డులు బద్దలు కొట్టేలా ఉన్నాడు. మొదటి రోజు ఓపెనింగ్స్ ఊహించిన దానికి మించి ఉండేలా కనిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన హరిహర వీరమల్లు హంగామా కనిపిస్తోంది. పవర్ స్టార్ ను ఎప్పడెప్పుడు స్క్రీన్ మీదా చూస్తామా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. మరికొన్ని గంటల్లో హరిహరుడు వీరతాండవం చేయబోతున్నాడు. Also Read : HHVM : వామ్మో.. పవన్…
MLA Amarnath Reddy: అన్నమయ్య జిల్లా రాజంపేటలో వైసీపీ ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. భారతదేశంలోని ఏపీలో ఉన్నంత దుర్మార్గమైన పాలన ఎక్కడ లేదు అని ఆరోపించారు.
ఔనా….? వాళ్ళిద్దరూ కలిశారా….? సీక్రెట్ మీటింగ్ జరిగిందా? సాక్షాత్తు తెలంగాణ సీఎం చేసిన ఆరోపణల్లో నిజమెంత? పైకి ఉప్పు నిప్పులా కనిపించే ఆ రెండు పార్టీల ముఖ్య నాయకులు రహస్యంగా కలవాల్సిన అవసరం ఏముంది? అసలు ఎవరా తెలుగు రాష్ట్రాల ముఖ్య నాయకులు? తెర వెనక సంగతులేంటి? తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తాజా ఢిల్లీ టూర్లో పలు అధికారిక కార్యక్రమాలతో బిజీ బిజీగా గడిపారు. రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలకు సంబంధించి ముఖ్యమంత్రుల సమావేశంలో పాల్గొన్నారు.…