Kasibugga Stampede: కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ప్రైవేట్ ఆలయ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. అమాయకుల ప్రాణాలు పోయాయి.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని హెచ్చరించారు.. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన ఘోర తొక్కిసలాట ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా కలచివేసిందని పేర్కొంటూనే, భద్రతా లోపాలు, అధికారుల నిర్లక్ష్యంపై మండిపడ్డారు.. కాశీబుగ్గలో…
టాలీవుడ్ యంగ్ హీరో నారా రోహిత్ ఓ ఇంటి వాడయ్యడు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అతిరథ మహారాధుల సమక్షంలో ప్రేయసి శిరీష మేడలో మూడు ముళ్ళు వేసాడు నారా రోహిత్. గతేడాది అక్టోబర్ లో నారా రోహిత్ – శిరీష్ ల నిశ్చితార్థం జరిగింది. సరిగ్గా ఏడాది తర్వాత ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి అయ్యారు. శిరీషా స్వస్థలం పల్నాడు జిల్లా రెంటచింతల. ఆస్ట్రేలియాలో ఉన్నత విద్యని అభ్యసించిన శిరీష నటన పై మక్కువతో టాలీవుడ్…
Jogi Ramesh: నిన్న ఒక వీడియో చాట్ చేశారని రిలీజ్ చేశారు.. దానిపై చర్చా వేదికలు నడిపారు అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు. నా ఫోన్ నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా జనార్ధన్ రావుతో చాట్ చేశామని నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమని సవాల్ విసిరారు.
Nara Rohith : నారా రోహిత్ ఈ మధ్య ట్రెండింగ్ లోకి వస్తున్నాడు. ఆయన గురించి ఓ కాంట్రవర్సీ వైరల్ అవుతోంది. వార్-2 సినిమా చూడొద్దని చెప్పాడంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయి. వాటిపై తాజాగా ఆయన స్పందించారు. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ సుందరకాండ ఆగస్టు 27న రిలీజ్ అవుతోంది. ఈ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్న ఆయన ఈ కాంట్రవర్సీపై మాట్లాడుతూ.. వార్-2 ఇష్యూ ఆడియో నా దృష్టికి వచ్చింది. కానీ నేను ఆడియో…
CM Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజ్యాంగ రచనలో తెలుగువారి చిరస్మరణీయ పాత్రను గుర్తుచేశారు. 2025 సంవత్సరానికి రూపొందించిన అసెంబ్లీ క్యాలెండర్‌ను తన నివాసంలో శనివారం ఆవిష్కరించిన సందర్భంగా, తెలుగు ప్రముఖుల చిత్రాలతో, చరిత్రను ప్రతిబింబించేలా ఈ క్యాలెండర్ రూపొందించినట్లు సీఎం తెలిపారు. ఆ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తవుతోందని, ఈ సందర్భంలో రాజ్యాంగ రచనలో పాల్గొన్న తెలుగు ప్రముఖులను స్మరించుకుంటున్నామని చెప్పారు. గోబ్యాక్…
Pawan Kalyan : రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోవడంలో కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరించబోతోంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగడంతో అక్రమార్కుల్లో కలకలం రేగింది. ఇవాళ ఆయన కాకినాడ యాంకరేజ్ పోర్టుకు చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. కాకినాడలోని యాంకరేజ్ పోర్టులో పశ్చిమ ఆఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్న స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యం, అలాగే మరో బార్జ్ ఐవీ 0073 లో 1064 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు స్వాధీనం…
Ratan Tata: దిగ్గజ వ్యాపారవేత్త, టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్, టాటా సన్స్ మాజీ ఛైర్మన్ రతన్ టాటా కన్నుమూశారు. ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి తుది శ్వాస విడిచిన రతన్ టాటా.. బీపీ అకస్మాత్తుగా పడిపోవడంతో సోమవారం నుంచి ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్ లో చేరారు. అక్కడ ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు రతన్ టాటా. ఈ సందర్బంగా దేశ, విదేశ ప్రముఖులు…
Fact Check: సోషల్ మీడియాలో ఓ నకిలీ భూమి పట్టా సంబంధించిన ఫోటో వైరల్ కావడంతో దానిపై తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా ద్వారా స్పందించింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన భూమి పట్టాలో ఓ భూమికి సంబంధించిన అడంగల్ పత్రంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అలాగే రాష్ట్ర రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంపులు మంత్రి సత్యప్రసాద్ ఫోటోలు ఉన్నాయి. అయితే ఈ ఫోటోని కొందరు కావాలని సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో…
మంగళగిరిలోని టీడీపీ కార్యాలయంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం చంద్రబాబు నాయుడు కార్యకర్తలతో సమావేశం కాగా ఓ మహిళ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తమ అధినేతలో హీరోను చూడాలనుకున్న ఆమె 'పెట్టుకోండి సార్' అంటూ బ్లాక్ గ్లాసెస్ ఇచ్చారు. ఆమె కోరికను కాదనని సీఎం వాటిని ధరించి ఫొటోకు పోజులిచ్చారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా చంద్రబాబు టీడీపీ కేంద్ర కార్యాలయానికి విచ్చేశారు. సీఎం చంద్రబాబుని కలిసేందుకు పెద్దఎత్తున పార్టీ కార్యాలయానికి టీడీపీ శ్రేణులు, కార్యకర్తలు తరలివచ్చారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పోలీసులు ఇనుప గ్రిల్స్ తో బార్కేడింగ్ ఏర్పాటు చేయగా.. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.