Jogi Ramesh: నకిలీ మద్యంపై జోగి రమేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- జనార్ధన్ రావుతో చాట్ చేసినట్లు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధం..
- రిమాండ్ రిపోర్టులో ఎప్పుడైనా నా పేరు వచ్చిందా?..
- నా ఫోన్‌ను చంద్రబాబు, లోకేష్‌లకు ఇస్తా చెక్ చేసుకోండి: జోగి రమేశ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jogi Ramesh: నిన్న ఒక వీడియో చాట్ చేశారని రిలీజ్ చేశారు.. దానిపై చర్చా వేదికలు నడిపారు అని వైసీపీ మాజీమంత్రి జోగి రమేశ్ పేర్కొన్నారు. నా ఫోన్ నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా జనార్ధన్ రావుతో చాట్ చేశామని నిరూపిస్తే ఏ శిక్షకు అయినా సిద్ధమని సవాల్ విసిరారు. నేను లై డిటెక్టర్ పరీక్షలకు కూడా సిద్ధంగా ఉన్నా.. చంద్రబాబు, లోకేష్ సిద్ధమా అని అడిగా సమాధానం లేదు.. నా భార్యాబిడ్డలను తీసుకుని తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ప్రమాణం చేసి చేస్తానన్నారు. చంద్రబాబు, లోకేష్ మీ కుటుంబ సభ్యులతో వచ్చి నేను తప్పు చేశానని చెప్తారా అని ప్రశ్నించారు. మీరు అక్కడ దాకా రాలేక పోతే కనకదుర్గమ్మ గుడి దగ్గరకు అయినా వస్తా.. లేకపోతే నేనే చంద్రబాబు ఇంటికి వస్తా.. మీ ఇంట్లోనే భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్పే ధైర్యం మీకు ఉందా అని జోగి రమేశ్ మండిపడ్డారు.
Read Also: Yogi Adityanath: దీపావళికి అంతరాయం కలిగిస్తే జైలుకే.. సీఎం యోగి స్ట్రాంగ్ వార్నింగ్..
Also Read
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- YouTuber Rama Nandana: ఇబ్రహీంపట్నం పీఎస్‌లో యూట్యూబర్ రమా నందన విచారణ..
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- Kodali Nani: గుడివాడలో డీఎస్సీ అక్రమాలపై వైసీపీ సమావేశం.. కొడాలి నాని తీవ్ర ఆరోపణలు
అయితే, కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ఎంత దిగజారిపోయారంటూ వైసీపీ నేత జోగి రమేశ్ తీవ్రంగా మండిపడ్డారు. ఒక బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిని అణగదొక్కాలని చూస్తున్నారు.. మీకు కుటుంబం ఉంది.. నాకు కుటుంబం ఉంది.. ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇంత దిగజారాలా.. ఇబ్రహీంపట్నంలో ఏఏ ఫ్యాక్టరీ గురించి నేనే చూపించి బయట పెడితే తిరిగి నా మీదే ఆరోపణలు చేస్తున్నారు.. కూటమి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేస్తున్నామన్నారు.. దీంట్లో పవన్ ను, బీజేపీని కలుపుకోరు.. నారా వారి సారాను ఏరులై పారిస్తున్నారు.. మా అధినేతను అయ్యన్నపాత్రుడు కారుకూతలు కూస్తే అప్పుడు మీ ఇంటికి వచ్చా.. నా మీద కేసులు పెట్టాలని చూసారు.. ఆఫ్రికా నుంచి జనార్ధన్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడైనా నా పేరు ఉందా అని జోగి రమేశ్ క్వశ్చన్ చేశారు.
Read Also: Balasaraswathi: గాన పితామహి బాలసరస్వతి ఇక లేరు..
ఇక, ఒక పక్క ఫోన్ పోయింది అంటారు.. మరోపక్క అదే చొక్కాతో తీసిన వీడియో రిలీజ్ చేస్తారని మాజీ మంత్రి రమేశ్ విమర్శించారు. ముఖ్యమంత్రి తన స్థాయిని తగ్గించుకుని ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్నారు.. నా మీద కుట్రలు పన్నినా పైన దేవుడు ఉన్నాడు.. నా కులానికి సంబంధించిన వ్యక్తులకు ఉన్న వాస్తవాలు చెప్తే మిగతా వాళ్ళకు ఎందుకు.. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్లకు జోగి రమేష్ ఏంటో తెలియదా.. చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తాడు.. మావాళ్ళు కొందరు తిడతారని ముందే చెప్పా.. వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంట్లో వాళ్ళే వాళ్ళను తిడతారు.. జోగి రమేష్ ఎలాంటి వాడో మా వాళ్లందరికీ తెలుసు అని చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
IndiGo Flight Fare Hike: ఇండిగో విమాన ప్రయాణికులకు షాక్.. నేటి నుంచి రూ.350 వరకు అదనపు భారం, కొత్త ఛార్జీలు ఇవే!
-
Allu Arjun-Boyapati: అల్లు అర్జున్-బోయపాటి కాంబోకు బ్రేక్.. అసలు కారణం ఇదేనా?
-
Gold Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. నేటి 18, 22, 24 క్యారెట్ల రేట్లు ఇవే..
-
Vishwambhara : మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ లాక్?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యాకు ఆఫర్లే ఆఫర్లు.. అతడితో విబేధాల ప్రభావం ట్రేడ్‌పై ఉంటుందా?
ట్రెండింగ్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!