Gaja Teaser: మంచు మనోజ్ చేతుల మీదుగా ‘గజ’ టీజర్ రిలీజ్.. షాకుల మీద షాకులు ఇస్తున్న ట్విస్ట్‌లు !
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gaja Teaser: ఒకవైపు ప్రేమ.. మరోవైపు రక్తపాతం.. మధ్యలో అంతుచిక్కని రహస్యం. హీరో తన ప్రాణంగా ప్రేమించిన అమ్మాయినే ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తాడు? ఆ నిర్ణయం వెనుక అసలు కారణం ఏమిటి? ఇలాంటి ప్రశ్నలతో ఆసక్తిని రేకెత్తిస్తూ సతీష్ జై తెరకెక్కించిన ‘గజ’ టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్, రొమాన్స్, ఎమోషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ టీజర్ సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. చలమలశెట్టి సునీల్ సమర్పణలో, సతీష్ జై ఫిల్మ్స్ బ్యానర్‌పై డాక్టర్ మైత్రి శరణ్ నిర్మించిన ఈ చిత్రంలో సతీష్ జై, ఫర్నాజ్ శెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. నటుడిగా కెమెరా ముందు కనిపించడంతో పాటు దర్శకుడిగా వెనుక ఉండి సినిమాను తెరకెక్కించడం సతీష్ జైకు ఈ ప్రాజెక్ట్‌ను ప్రత్యేకంగా మార్చింది. పద్మనాభ రెడ్డి, జి. మధుసూదన్, ఎం. నరేంద్ర సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
హైదరాబాద్‌లోని ఏఏఏ సినిమాస్‌లో నిన్న ‘గజ’ టీజర్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ లాంచ్ ఈవెంట్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న హీరో మంచు మనోజ్ మాట్లాడుతూ, సినిమా పరిశ్రమకు కులం, గోత్రం ఉండవని, కళామతల్లిని నమ్ముకున్న మనందరిదీ ‘సినిమా కులం’ మాత్రమేనని ఎమోషనల్‌గా వ్యాఖ్యానించారు ఈ చిత్రంలో ఒకేసారి హీరోగా నటిస్తూ, కథ అందించి, దర్శకత్వం, నిర్మాణ బాధ్యతలను భుజాన వేసుకున్న సతీష్ జై పట్టుదలను ఆయన ఎంతగానో అభినందించారు. అలాగే ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించిన మెలోడీ బ్రహ్మ మణిశర్మతో తనకున్న పాత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, చిత్ర యూనిట్ మొత్తానికి తన హృదయపూర్వక ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
Also Read
- Vrushakarma : నాగవంశీ అవుట్.. దిల్ రాజు ఇన్..'వృషకర్మ' వెనుక అసలేం జరిగింది?
- Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?
- Sigma OTT: అప్పుడే ఓటీటీలోకి ‘సిగ్మా’.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే?
- Ahaan Panday: 10 కథలు రిజక్ట్ చేసిన యువ హీరో.. చివరకు ఆ డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్!
భగవద్గీతలోని ఒక సూక్తితో టీజర్ ప్రారంభం కావడం, వెంటనే కథను యాక్షన్ థ్రిల్లర్ లో చూపించడంతో స్టోరీ ఏమిటనే ఇంట్రెస్ట్ కలుగుతోంది ప్రేక్షకులకు. ఈ టీజర్లో జైలు నేపథ్యంలో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ గా కనిపిస్తున్నాయి. ప్రేయసిని చంపిన వ్యక్తిగా హీరోను చూపించడం వెనుక ఉన్న కారణం సస్పెన్స్ గానే ఉంచారు. అతను నిజంగా హంతకుడా, లేక పరిస్థితులు అతన్ని ఆ నిర్ణయం తీసుకునేలా చేశాయా అనే సందేహాన్ని టీజర్ సస్పెన్స్ తో ప్రేక్షకుల ముందుంచింది. మణి శర్మ అందించిన నేపథ్య సంగీతం కూడా ఈ మూవీకి హైలెట్ గా ఉండబోతోంది. టీజర్‌ను చూస్తే ‘గజ’ యాక్షన్ సినిమాలా కాకుండా ప్రేమ, థ్రిల్, ఎమోషన్‌తో కూడిన విభిన్నమైన కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది.
ఇప్పటివరకు విడుదలైన టీజర్ సినిమా కథను పూర్తిగా వెల్లడించకుండా కీలకమైన ప్రశ్నలను మాత్రమే ప్రేక్షకుల ముందుంచింది. ముఖ్యంగా హీరో ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన అమ్మాయినే ఎందుకు చంపాడనే ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. త్వరలోనే ట్రైలర్‌ను , రిలీజ్ డేట్ ని చిత్ర బృందం ఆఫీషియల్ గా అనౌన్స్ చేయనుంది. ఇక సతీష్ జై దర్శకత్వంలో రూపొందిన ‘గజ’ థియేటర్లలో ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Telangana ACB: లంచం తీసుకుంటేనే కాదు.. డిమాండ్ చేసినా కటకటాలకే.. ఏసీబీ సంచలన నిర్ణయం!
-
Cyclone Arnab: అమిత్ షాకు చంద్రబాబు లేఖ.. కేంద్ర బృందాలను పంపాలని విజ్ఞప్తి!
-
Moto G47 Power: మోటో G47 Power లాంచ్.. 108MP కెమెరా, 7000mAh బ్యాటరీ, ధర ఎంతంటే!
-
Arshdeep Singh History: ప్రపంచ రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్ సింగ్.. మరో వికెట్ తీస్తే తోపే!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
ట్రెండింగ్
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!
-
Team India Records: టీ20ల్లో రెండు ప్రపంచ రికార్డులు బ్రేక్ చేసిన భారత్.. మరో జట్టుకు సాధ్యం కాదేమో!
-
ఐఫోన్‌కు పోటీగా vivo కొత్త ఫీచర్.. Apple ఎకోసిస్టమ్‌తో VIVO X500 సిరీస్ గ్లోబల్ లాంచ్.!
-
థియేటర్ అనుభవం ఓకే.. కానీ ఆ ధరకు ఎకరం భూమి కొనవచ్చుగా..! 115 అంగుళాల LG QNED evo AI Mini LED TV లాంచ్..
-
లిక్విడ్ కూలింగ్ ఆర్కిటెక్చర్, ప్రెజర్-సెన్స్ ట్రిగ్గర్లు, డైమెన్సిటీ 8400 అల్టిమేట్ ప్రాసెసర్‌తో సరికొత్త సంచలనం Infinix GT 50 Pro లాంచ్.!