గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో విజయంపై టీడీపీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్నంటాయి. స్వీట్లు తినిపించుకున్నారు టీడీపీ నేతలు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు మాట్లాడుతూ.. గ్రాడ్యుయేట్స్ ఎన్నికలు ప్రభావితం చేసేవి కావని సజ్జల ఎలా చెబుతారు..? సజ్జల మంగళవారం మాటలు మాట్లాడుతున్నారు. ఈ ఎన్నికల్లో బడుగు, బలహీన వర్గాలే ఓట్లు వేశారు. వేరే ప్రాంతాల్లో ఉన్న అగ్రవర్ణాలే ఈ ఎన్నికకు దూరంగా ఉన్నాయి.పల్లెల్లో ఉద్యోగాలు.. ఉపాధి లేని బడుగు, బలహీన వర్గాల నిరుద్యోగ యువతే ఈ ఎన్నికల్లో ఓట్లేశారు.మాల, మాదిగ పల్లెల్లోని యువకులు ప్రభుత్వ తీరుకు నిరసనగా ఓటింగులో పాల్గొన్నారు.పట్టభద్రులు, టీచర్ల ఎన్నికల్లో 70 శాతం పోలింగ్ జరగడం చరిత్రలో ఎప్పుడూ లేవు.గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో మూడు స్థానాలనూ టీడీపీ దక్కించుకోవడం చరిత్రాత్మకం.ఈ విజయం టీడీపీది కాదు.. ప్రజలది.ఇచ్చాపురం నుంచి ఇడుపులపాయ వరకు ఎన్నికలు జరిగాయి.108 నియోజకవర్గాల్లోని ప్రజలు ప్రభుత్వ తీరుపై తమ తీర్పు చెప్పారు.
Read Also: NTR: తీరం తాకనున్న ‘ఎన్టీఆర్ 30’ తుఫాన్
అన్ని వర్గాల ప్రజలు పోలింగులో పాల్గొన్నారు.జగన్ పని తీరుపై ఇంత కంటే పెద్ద సర్వే ఏం ఉంటుంది..?పులివెందుల్లోనే జగన్ పని అయిపోయింది.నరకాసుర వధ జరగబోతోందని ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు.జగన్ పులివెందుల నుంచి పిల్లిలా పారిపోతారు.ఈ ఎన్నికలు మార్పునకు సంకేతం.ఈసీపై మా ఫిర్యాదు చేయడానికి సజ్జలకు సిగ్గుండాలి.
దొంగ ఓట్లు నమోదు చేయించిన వైసీపీపై సజ్జల ఫిర్యాదు చేస్తారా..?దొంగ ఓట్లు నమోదు చేసేందుకు సహకరించిన అధికారులను జైళ్లకు పంపుతాం.దొంగ ఓట్లు నమోదు చేయించారు కాబట్టే పది శాతానికి పైగా ఓట్లు ఇన్వాలీడ్ అయ్యాయి.ఐదో తరగతి, పదో తరగతి చదివిన వాళ్లని పట్టభద్రులుగా ఓటు నమోదు చేయించారని మండిపడ్డారు నక్కా ఆనందబాబు.
రాయలసీమలో రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ విజయం సాధించడంతో అన్నిచోట్ల తెలుగు తమ్ముళ్ళు రోడ్ల మీదకు వచ్చి స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం పంచుకున్నారు.
Read Also: NTR: తీరం తాకనున్న ‘ఎన్టీఆర్ 30’ తుఫాన్