Christopher Nolan : ఫ్రాంచైజీ లేదు.. సూపర్‌హీరో లేడు.. కానీ బిలియన్ డాలర్లు వసూలు చేసింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఫ్రాంచైజీ లేదు సూపర్‌హీరో లేడు కానీ బాక్సాఫీస్ మాత్రం బిలియన్ డాలర్లకు చేరింది. క్రిస్టోఫర్ నోలన్ ‘ది ఒడిస్సీ’ ఇప్పుడు గ్లోబల్ బాక్సాఫీస్‌లో 1 బిలియన్ డాలర్ మార్క్‌ను దాటింది. ‘ది ఒడిస్సీ’కి బాక్సాఫీస్ రన్ మొదటి నుంచే స్ట్రాంగ్‌గా కనిపించింది. ఓపెనింగ్ వీకెండ్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 264 మిలియన్ డాలర్లు రాబట్టింది. ఇది నోలన్ సినిమాల్లోనే హైయెస్ట్ గ్లోబల్ ఓపెనింగ్గా నిలిచింది. ఇప్పుడు మూడు వారాల వ్యవధిలోనే బిలియన్ డాలర్లు దాటడంతో నోలన్ పేరు కూడా ఒక ప్రత్యేక బాక్సాఫీస్ బ్రాండ్‌గా మారిందా అనే చర్చ మొదలైంది. అయితే ఇది ‘అవెంజర్స్’ లేదా ‘అవతార్’ లాంటి ముందే ఏర్పడిన ఫ్రాంచైజీ కాదు. అయినా ఆ స్థాయిలో మార్కెట్ రావడం విశేషం.
‘ది ఒడిస్సీ’ బాక్సాఫీస్‌లో మరో కీలక అంశం IMAX. ఈ సినిమా పూర్తిగా IMAX 70mm ఫిల్మ్ కెమెరాలతో చిత్రీకరించిన ఫస్ట్ థియేట్రికల్ రిలీజ్‌గా నిలిచింది. ఓపెనింగ్ వీకెండ్లోనే IMAX నుంచి సుమారు 52 మిలియన్ డాలర్ల వసూళ్లు వచ్చాయి. అంటే కేవలం కథను థియేటర్లో చూడటం కాకుండా పెద్ద స్క్రీన్ ఎక్స్‌పీరియెన్స్‌ను కూడా సినిమా బిజినెస్‌లో భాగంగా మార్చడం ఇక్కడ కనిపిస్తోంది. అయితే ఇది ప్రతి సినిమాకు వర్క్ అయ్యే ఫార్ములా కాదు. నోలన్ పేరు, భారీ విజువల్స్, ప్రీమియం స్క్రీన్స్… ఈ మూడు కలిసి బాక్సాఫీస్‌ను నడిపించాయి. ‘ది ఒడిస్సీ’ 1 బిలియన్ డాలర్ల కలెక్షన్స్ దాటడం నార్మల్ విషయం కాదు. కానీ అక్కడి టాప్‌లో నిలవాలంటే మాత్రం ఇంకా భారీ నంబర్లు కావాలి. ‘అవతార్’, ‘అవెంజర్స్: ఎండ్‌గేమ్’, ‘అవతార్: ది వే ఆఫ్ వాటర్’, ‘టైటానిక్’ లాంటి సినిమాలు 2 బిలియన్ డాలర్లలను క్రాస్ చేశాయి. అందుకే బిలియన్ క్లబ్‌లోకి ఎంట్రీ ఒక రికార్డ్ అయితే ఆ క్లబ్లో టాప్ ప్లేస్ సాధించడం మరో గేమ్.
Also Read
- SJ Suryah Bodhi: 'జైలర్ 2' నుంచి ఎస్.జే.సూర్య ఊరమాస్ ఎంట్రీ.. అనిరుధ్ బీజీఎమ్ నెక్స్ట్ లెవెల్ అంతే!
- Cult Release Date: చేతిలో గొడ్డలితో విశ్వక్ సేన్ ఊచకోత.. ‘కల్ట్’ రిలీజ్ డేట్ అప్పుడే!
- Sandeep Reddy Vanga: వరంగల్ ఎయిర్‌పోర్టుకు ఈ పేర్లు పెట్టండి.. సీఎం రేవంత్‌కు సందీప్ రెడ్డి వంగా స్పెషల్ రిక్వెస్ట్!
- Nayanthara: హీరోయిన్గా హిట్టు.. ప్రొడ్యూసర్‌గా ఫట్టు! ప్రొడక్షన్ కంపెనీని మూసివేసే దిశగా స్టార్ హీరోయిన్?
ఒక దర్శకుడి పేరుతోనే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించి ఫ్రాంచైజీ లేకుండా బిలియన్ మార్క్ దాటించడం మాత్రం ఇండస్ట్రీకి ఒక పాజిటివ్ సిగ్నల్. ఇక ముందు స్టూడియోలు కూడా ఫ్రాంచైజీల కంటే దర్శకుడి బ్రాండ్‌పై భారీగా పెట్టుబడి పెట్టే పరిస్థితి వస్తుందా? లేక ‘ది ఒడిస్సీ’ సక్సెస్ నోలన్‌కు మాత్రమే పరిమితమవుతుందా? అనే డిస్కషన్ ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ అవుతోంది.
తాజావార్తలు
-
Story Board : అసలు UPI ఉద్దేశమేంటి.. దేశం మళ్లీ క్యాష్ ఎకానమీకి ఓటేస్తుందా..?
-
Etela Rajender : తెలంగాణకు బీసీ సీఎం.. ఈటల కీలక వ్యాఖ్యలు
-
OTR : బొత్స అనూషకు భీమిలి వైసీపీ బాధ్యతలు .. గంటాను ఢీ కొట్టగలరా?
-
OTR: ఆక్వా రైతుల ఆగ్రహం.. ఉద్యమానికి రెడీ?
-
El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!