Sunil Gavaskar: ఆ రోజుల్లోనే సునీల్ గవాస్కర్ పెను సాహసం.. విషయం తెలిస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Why Sunil Gavaskar’ Batted Left-Handed in Ranji Trophy: భారత క్రికెట్ దిగ్గజం, లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అద్భుతమైన టెక్నిక్, క్రమశిక్షణ, పట్టుదలతో టెస్టు క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. సన్నీ తన కెరీర్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడారు. అయితే 1981-82 రంజీ ట్రోఫీలో ఆయన చేసిన ఓ ఊహించని ప్రయోగం మాత్రం ఇప్పటికీ క్రికెట్ చరిత్రలో ఆసక్తికరమైన ఘటనగా నిలిచిపోయింది. ఓడిపోవడం పక్కా అనుకున్న మ్యాచ్‌లో జట్టును కాపాడేందుకు రైట్ హ్యాండ్ బ్యాటర్ అయిన గవాస్కర్.. ఏకంగా లెఫ్ట్ హ్యాండ్‌తో బ్యాటింగ్ చేశారు.
బెంగళూరులో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో బాంబే, కర్ణాటక జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో కర్ణాటక లెఫ్ట్ హ్యాండ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్ రఘురామ్ భట్ బాంబే బ్యాటర్లను బెంబేలెత్తించాడు. తొలి ఇన్నింగ్స్‌లోనే ఏకంగా 8 వికెట్లు పడగొట్టాడు. దీంతో బాంబే 271 పరుగులకే పరిమితమైంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ భట్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ.. బాంబే టాప్ ఆర్డర్‌ను కూల్చేశాడు. అప్పటికే అతడు ఐదు వికెట్లు పడగొట్టడంతో బాంబే ఓటమి అంచున నిలిచింది. ఆ సమయంలో కర్ణాటక ఫైనల్‌కు చేరాలంటే బాంబే మిగిలిన ఐదు వికెట్లు కూడా పడగొట్టాల్సి ఉంది. భట్‌కు పిచ్‌పై ఉన్న రఫ్ ఏరియా బాగా సహకరిస్తోంది. రైట్ హ్యాండ్ బ్యాటర్లకు బంతి ఆఫ్‌సైడ్ వైపు తిరుగుతూ ఎడ్జ్ తీసుకునే ప్రమాదం ఉండేది. ఈ పరిస్థితిని గమనించిన గవాస్కర్.. ఎవరూ ఊహించని వ్యూహాన్ని అమలు చేశారు.
Also Read
- Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
- Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
- Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
- T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ 'గోట్'గా మనోడే!
రఘురామ్ భట్ బౌలింగ్‌లో సునీల్ గవాస్కర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా మారిపోయారు. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్‌గా నిలబడితే రఫ్‌లో పడిన బంతి తన నుంచి దూరంగా కాకుండా శరీరం వైపు తిరుగుతుందని సన్నీ అంచనా వేశారు. దీంతో బంతిని ప్యాడ్లతో అడ్డుకోవడం లేదా బ్యాట్‌తో షాట్స్ కొట్టడం సాధ్యమవుతుందని భావించారు. అంతేకాదు బంతి ఎడ్జ్ తీసుకుని క్యాచ్ అయ్యే అవకాశాలు కూడా తక్కువ. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. గవాస్కర్ కేవలం భట్ బౌలింగ్‌లో మాత్రమే ఎడమ చేతితో బ్యాటింగ్ చేశారు. మరో ఎండ్ నుంచి కుడిచేతి బౌలర్ బి. విజయకృష్ణ బౌలింగ్‌కు వచ్చినప్పుడు మాత్రం తన సహజమైన బ్యాటింగ్‌కు మారిపోయారు. భట్‌ను ఎదుర్కొనేందుకు గవాస్కర్ దాదాపు గంటకు పైగా లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ చేస్తూ అజేయంగా 18 పరుగులు చేశారు.
సహచర ప్లేయర్ గులాం పార్కర్‌తో కలిసి గవాస్కర్ చివరి వరకు క్రీజులో నిలబడ్డారు. ఆట ముగిసే సమయానికి బాంబే 218/9 స్కోరుతో నిలిచింది. దాంతో కర్ణాటక ఫైనల్ బెర్త్ ఆశలు ఆవిరయ్యాయి. పరిస్థితులకు తగ్గట్టుగా వ్యూహాన్ని మార్చుకోవడంతో సన్నీ తన తెలివితేటలను మరోసారి చాటుకున్నారు. తాను ఎందుకు ఎడమచేతితో బ్యాటింగ్ చేయాల్సి వచ్చిందో గవాస్కర్ స్వయంగా వెల్లడించారు. రఘురామ్ భట్ ఆ పిచ్‌పై దాదాపు అన్ప్లేయబుల్గా ఉన్నాడని, కుడిచేతి వాటంతో అతడిని ఎదుర్కొనే అవకాశం తనకు లేదని భావించినట్లు చెప్పారు. ఎడమచేతితో బ్యాటింగ్ చేస్తే బంతి తిరిగి శరీరాన్ని తాకే అవకాశం ఉండటంతో వికెట్ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉండదని వివరించారు.
అయితే ఇది కేవలం ఆ మ్యాచ్‌లోని పరిస్థితులకు అనుగుణంగా తీసుకున్న నిర్ణయమేనని సునీల్ గవాస్కర్ స్పష్టం చేశారు. ఆధునిక క్రికెట్లో స్విచ్ హిట్స్, రివర్స్ స్వీప్స్ వంటి షాట్లు సాధారణమైపోయాయి. కానీ 1980ల ప్రారంభంలో టెస్టు, ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో ఇలాంటి ప్రయోగం చేయడం చాలా అరుదు. అందుకే గవాస్కర్ చేసిన ఈ వ్యూహాత్మక ప్రయోగం.. పరిస్థితులకు అనుగుణంగా ఆటను మార్చుకోవడంలో ఆయనకున్న తెలివితేటలకు నిదర్శనంగా ఇప్పటికీ గుర్తుండిపోయింది.
తాజావార్తలు
-
Sanju Samson: 3 పరుగులకే సంజు శాంసన్ అవుట్.. ఆశ్చర్యం ఏముంది.. కామెంటేటర్ సంచలన వ్యాఖ్యలు!
-
Jai Jasti-Medha Meka: టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘ఆమె’ కూతురు.. రొమాంటిక్ పోస్టర్ వచ్చేసింది!
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!
-
IAS Officers: ఏపీలో 11 మంది ఐఏఎస్ అధికారులకు కొత్త పోస్టింగ్‌లు..
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
ట్రెండింగ్
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!