MP Nandigam Suresh Fires On Nakka Anand Babu: నక్కా ఆనంద్ బాబుపై ఎంపీ నందిగం సురేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అమరావతి పెయిడ్ టెంట్ వద్దకు వెళ్లి నక్కా.. ఆనంద్ బాబు నోటికొచ్చి మాట్లాడుతున్నాడని విరుచుకుపడ్డారు. టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కోసమే నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. ఫోటోల కోసం, తిన్నది అరగక చేసేదే అమరావతి ఉద్యమం అని ఆరోపించారు. రాజధాని పేరుతో బలవంతంగా భూములు లాక్కున్నారని విమర్శించారు. ప్రజలంతా వ్యతిరేకించారు కాబట్టే తాత్కాలిక సచివాలయం కట్టాడని ఫైరయ్యారు. తాము కూడా చంద్రబాబును వ్యక్తిగతంగా మాట్లాడగలమని, కానీ తమకు విజ్ఞత ఉంది కాబట్టి ఊరికే ఉన్నామని పేర్కొన్నారు.
MLA Rajaiah: కడియం శ్రీహరిపై ఘాటు విమర్శలు చేసిన ఎమ్మెల్యే రాజయ్య
రియల్ ఎస్టేట్ కోసం మొదలు పెట్టిందే అమరావతి ఉద్యమం అని నందిగం సురేష్ విమర్శించారు. ఉద్యమం పేరుతో కోట్లు దండుకున్నారని ఆరోపణలు చేశారు. రైతులను నాశనం చేసింది చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. నక్కా ఆనంద్ బాబు చంద్రబాబుకు చేస్తున్న బానిసత్వం మానుకోవాలని హితవు పలికారు. చచ్చినోడి దగ్గర ఏడుస్తున్నట్లు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. లోకేష్‌కు చేతనైతే.. ముందు ఎమ్మెల్యేగా గెలిచి, అసెంబ్లీలో అడుగుపెట్టాలని సవాల్ విసిరారు. పనికి మాలినోళ్లకు పెద్ద పాలేరు పవన్ కళ్యాణ్ అని ధ్వజమెత్తారు. లోకేష్ యాత్ర ఫెయిలవ్వడంతో.. పవన్ వారాహి వాహనంతో రోడ్ల వెంట తిరుగుతున్నాడని దుయ్యబట్టారు. జగన్ మోహన్ రెడ్డిని చూసి అందరూ భయపడుతున్నారన్నారు. నక్కా ఆనంద్ బాబు నోరు అదుపులో పెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అమరావతి రైతులు నాశనం కావాలనే టీడీపీ నేతలు కోరుకుంటున్నారని నందిగం సురేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
Vizag Minor Girl Case: విశాఖలో దారుణం.. మైనర్ బాలికపై లైంగిక వేధింపులు
ఇంతకుముందు కూడా.. పవన్ కల్యాణ్ తీరు వీధి రౌడీలా ఉందని నందిగం సురేష్ ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఓ అసాంఘీక శక్తిలా పవన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర పవన్ చేస్తున్న బానిసత్వానికి అలసట లేదని విమర్శించారు. పవన్ బెదిరింపులకు బయపడటానికి ఇది సినిమా కాదని… ఇప్పటికైనా పవన్ తన భాష మార్చుకోవాలని సూచించారు. ప్రజలకు మేలు చేద్దామని పవన్‌కు లేదని.. ఆయన ఊగిపోతూ ప్రత్యర్ధులను తిడుతున్నారని పేర్కొన్నారు. జగన్‌ను ఎదుర్కోవడానికి వంద తలలు పెట్టుకుని వీరందరూ వస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు.