రాష్ట్రంలో మహిళలు, విద్యార్ధినులపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్న తీరుపై సీఎం జగన్ కి లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నక్కా ఆనందబాబు.రాష్ట్రంలో గంజాయి, డ్రగ్, మద్యం అమ్మకాల వల్లే రాష్ట్రంలో మహిళలపై వేధింపులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతోంది. దేశంలో ఏమూలన గంజాయి పట్టుబడినా దాని మూలాలు ఏపీలో ఉంటున్నాయి. దీని వల్ల రాష్ట్ర యువత భవిష్యత్ తో పాటు రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని లేఖలో…
అంబేడ్కర్ 65వ వర్థంతిని స్మరించుకుంటూ ఆ మహనీయునికి జాతీ మొత్తం ఘన నివాళుర్పిస్తుందని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి నక్కా ఆనంద్ బాబు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. భారతదేశమంతటా రాజ్యాంగం ఒకేలా అమలు చేస్తుందన్నారు. కానీ ఏపీలో మాత్రం రాజ్యాంగం రోజు రోజుకు అవహేళనకు గురవుతుందని విమర్శించారు. జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ర్టంలో రాజ్యాంగ విలువలు, హక్కులను కాలరాస్తున్నారని ఆరోపించారు. సమాజంలో ఉన్న వైషమ్యాలు రూపుమాపాలని డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రచించారన్నారు.…
గంజాయి అక్రమ రవాణా అరికట్టడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తున్నామని విశాఖ రేంజ్ డిఐజి రంగారావు చెబుతున్నారు. గత రెండు మూడు వారాలు గా ఇతర రాష్ట్రాల పోలీసులు విశాఖకు వస్తున్నారని, గంజాయి కేసుల్లో నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నలు చేస్తున్నారని చెప్పారు. స్థానిక పోలీసుల సహకారం తీసుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. కానీ నల్గొండ పోలీసులు స్థానిక పోలీసుల సహకారం తీసుకోలేదని వివరణ ఇచ్చారు. దాని వల్ల ఫైరింగ్ సమస్య తలెత్తిందన్నారు. కేరళ,తమిళనాడు,కర్ణాటక పోలీసుల సైతం వచ్చి నిందితుల…