దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, నట సమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు చాలా ప్రాక్టికల్ మనిషి. పిల్లలను సైతం అలానే పెంచారు. దాంతో సంప్రదాయ బద్ధంగా తండ్రి కాళ్ళకు నమస్కారం పెట్టడం వంటివి వారికి అలవడలేదు. బిగ్ బాస్ సీజన్ 5 షోలో నాగార్జున ఇదే విషయాన్ని తెలియచేశారు. శనివారం షోకు స్పెషల్ గెస్ట్ గా వచ్చిన రామ్ చరణ్ – నాగ్ మధ్య ఆసక్తికరమైన అంశాలు చర్చకు వచ్చాయి. ‘ట్రిపుల్ ఆర్’ ఎలా వస్తోందని నాగ్ అడిగినప్పుడు…
బిగ్ బాస్ సీజన్ – 5 లో సెప్టెంబర్ 18వ తేదీ హౌస్ మేట్స్ కు ఓ స్పెషల్ డే! మెగా పవర్ స్టార్ రామ్ చరణ్… శనివారం నాగార్జునతో కలిసి డయాస్ ను షేర్ చేసుకున్నాడు. అయితే చెర్రీ బిగ్ బాస్ షో లో పాల్గొనడానికి ఓ స్పెషల్ రీజన్ ఉంది. అతను తాజాగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ కు బ్రాండ్ అంబాసిడర్ గా బాధ్యతలు తీసుకున్నాడు. దానికి సంబంధించిన ప్రోమోను నాగార్జున బిగ్…
బిగ్ బాస్ సీజన్ 5 షో చూస్తుండగానే 12వ రోజులోకి అడుగుపెట్టింది. రాత్రి దాదాపు ఒంటి గంట వరకూ హౌస్ మెంబర్స్ ను ఏదో రకంగా ఎంగేజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. దాంతో మర్నాడు ఉదయం 9.30 తర్వాత కానీ నిద్ర లేపడం లేదు. 12వ రోజున డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లోని దోస్తీ సాంగ్ తో సభ్యులంతా నిద్రలేచారు. ఎప్పటిలానే డాన్స్ లు చేశారు. అయితే ఇది మూవీ థీమ్ సాంగ్…
జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి హోస్ట్ గా కూడా నిరూపించుకున్నాడు. ఇప్పటికే పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం “ఎవరు మీలో కోటీశ్వరులు” షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ షో కర్టెన్ రైజర్ షోకు 11.4 వచ్చింది. దానికి కారణం ఏంటంటే లాంచ్ ఎపిసోడ్ లో తారక్ హోస్ట్ గా వ్యవహరించగా, చరణ్ అతిథిగా విచ్చేసి హాట్ సీట్ లో కూర్చున్నాడు. ఆ తరువాత షో…
“బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” సెప్టెంబర్ 5న సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఈసారి 19 మంది కంటెస్టెంట్లతో నాగార్జున 5 రెట్లు ఎక్కువ ఎంటర్టైన్మెంట్ అంటూ చాలా ఉత్సాహంగా షోను హోస్ట్ చేశారు. అందులో ఒక్కొక్క కంటెస్టెంట్ ను పరిచయం చేస్తూ హోస్ట్ గా నాగార్జున చేసిన ఫన్ ను ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు. చాలా రోజుల నుంచి బిగ్ బాస్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రేక్షకులు…
కింగ్ నాగార్జున ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘బంగార్రాజు’. ఈ చిత్రంలో హిట్ పెయిర్ నాగార్జున, రమ్యకృష్ణ మరోసారి జోడి కడుతున్న విషయం తెలిసిందే. నిన్న రమ్యకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ ఆమెకు సినిమా నుంచి సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నాగార్జున, రమ్యకృష్ణ కలిసి ఉన్న పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో ఎప్పటిలాగే రమ్యకృష్ణ అందంగా కనిపిస్తుంది. నాగార్జున, రమ్యకృష్ణ మధ్య కెమిస్ట్రీ అద్భుతంగా కనిపిస్తుంది. పంచెకట్టులో నాగార్జున “బంగార్రాజు” లుక్ అదిరిపోయింది. అప్పట్లో…
బిగ్ బాస్ హౌస్ లో 8వ రోజు నామినేషన్స్ జరగడంతో… ఆ రాత్రి దాదాపు 12.45 వరకూ కంటెస్టెంట్స్ మెలుకువగానే ఉన్నారు. ఎవరు? ఎందుకు? ఎవరిని నామినేట్ చేశారనేది తెలుసుకునే ప్రయత్నం కొందరు చేశారు. రాత్రి బాగా పొద్దు పోవడంతో 9వ రోజు 9.45కు బిగ్ బాస్ సభ్యులను మేల్కొలిపాడు. అయితే ముందు రోజు నామినేషన్స్ సమయంలో జరిగిన గొడవల కారణంగా ఇటు కాజల్, అటు శ్వేత వర్మలకు కన్నీటితోనే తెల్లవారినట్టు అయ్యింది. మాటల మధ్యలో తాను…
బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేట్ అయిన వ్యక్తి సరయు. బిగ్ బాస్ షో కు సంబంధించి గతంలో కంటే సీక్రెసీ మెయిన్ టైన్ చేస్తామని నిర్వాహకులు చెప్పినా… ఎలిమినేట్ అయిన వ్యక్తి ఇలా బయటకు రాగానే అలా వారిపేరు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ రకంగా నిన్న రాత్రి నుండి ఈ సీజన్ లో ఫస్ట్ ఎలిమినేట్ అవుతోంది సరయు అనే ప్రచారం జరిగిపోయింది. దాన్ని బలపరుస్తూ సరయు బిగ్…
బిగ్ బాస్ షో సీజన్ 5 ఐదో రోజు ఆట కాస్తంత రంజుగానే సాగింది. నాలుగవ తేదీ రాత్రి పదకొండు తర్వాత ప్రియాంక (పింకీ) మానస్ కు ఫ్లవర్ అందించి, దాన్ని జాగ్రత్తగా పెట్టమని, ఎవరికి ఇచ్చినా ఊరుకునేది లేదని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది. వీరిద్దరి లవ్వాటకు ఫిదా అయిన సన్నీ ఆమెతో ఆ మాటను మళ్ళీ మళ్ళీ చెప్పించాడు. ఇక బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్స్ అందరూ కనిపించేది కేవలం మార్నింగ్ సాంగ్ ప్లే…
ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్! అన్నారు చిలకమర్తి వారు. కానీ ఇవాళ ఆడవాళ్ళు ఎవరూ ముద్దుగా నేర్పించకుండానే విద్యలన్నీ ఒంటపట్టించుకుంటున్నారు. అందుకు బిగ్ బాస్ సీజన్ 5లో ఫస్ట్ కెప్టెన్ గా ఎంపికైన సిరినే పెద్ద ఉదాహరణ. బిగ్ బాస్ హౌస్ లో 4వ రోజున కెప్టెన్ ను ఎంపిక చేసే పనిలో పడ్డాడు బిగ్ బాస్. పవర్ రూమ్ విజేతలుగా నిలిచిన విశ్వ, మానస్, సిరి, హమీదా… కెప్టెన్ అయ్యే అర్హతను పొందారని…