Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Bigg Boss Telugu Season 5 Bigg Boss 5 Sep 17th Episode

సెకండ్ వీక్ నామినేట్ అయ్యేది ఎవరు!?

Published Date :September 18, 2021 , 8:44 am
By Prakash
సెకండ్ వీక్ నామినేట్ అయ్యేది ఎవరు!?
  • Follow Us :
  • google news
  • dailyhunt

బిగ్ బాస్ సీజన్ 5 షో చూస్తుండగానే 12వ రోజులోకి అడుగుపెట్టింది. రాత్రి దాదాపు ఒంటి గంట వరకూ హౌస్ మెంబర్స్ ను ఏదో రకంగా ఎంగేజ్ చేస్తున్నాడు బిగ్ బాస్. దాంతో మర్నాడు ఉదయం 9.30 తర్వాత కానీ నిద్ర లేపడం లేదు. 12వ రోజున డైరెక్టర్ రాజమౌళి మాగ్నమ్ ఓపస్ మూవీ ‘ట్రిపుల్ ఆర్’లోని దోస్తీ సాంగ్ తో సభ్యులంతా నిద్రలేచారు. ఎప్పటిలానే డాన్స్ లు చేశారు. అయితే ఇది మూవీ థీమ్ సాంగ్ కావడంతో వాళ్ళ నుండి పెద్దంత ఎంటర్ టైన్ మెంట్ వీక్షకులకు దక్కలేదు. ఆ తర్వాత చర్చ ఈ పది రోజులలో ఎవరు ఎవరితో ఎక్కువ బాండింగ్ పెంచుకున్నారనే దానిపై జరిగింది. లైక్ మైండెడ్ పర్సన్స్ ఒక చోట చేరి సరదాగా మాట్లాడుకోవడం మొదలెట్టారు.

బాల్ పట్టు లగ్జరీ కొట్టు!
12వ రోజు బిగ్ బాస్ ఇంటి సభ్యులకు లగ్జరీ బడ్జెట్ టాస్క్ ను అనౌన్స్ చేశాడు. గార్డెన్ ఏరియాలో ఏర్పాటు చేసిన పెద్ద పైప్ ద్వారా ఓ బాల్ వస్తుంది. ఇంటి సభ్యులలో ఎవరి పేరు టీవీ స్క్రీన్ మీద డిస్ ప్లే అయితే వారు వెళ్ళి ఆ బాల్ కింద పడకుండా పట్టుకోవాలి. ఆ బాల్ మీద ఏ డిష్ పేరు రాసి ఉంటే… అది లగ్జరీ బడ్జెట్ లో భాగంగా ఇంటి సభ్యులకు లభిస్తుందన్న మాట. హౌస్ లోంచి పరిగెత్తుకుని వెళ్ళి బాల్‌ను క్యాచ్ చేయడంలో విశ్వ, లహరి, లోబో, యాని మాస్టర్ ఫెయిల్ అయ్యారు. అదే సమయంలో నటరాజ్‌ మాస్టర్, ప్రియాంక, షణ్ముఖ్ బాల్‌ను పట్టుకోవడంలో విజయం సాధించారు. ఈ గేమ్ మరో రోజు కూడా కొనసాగే ఆస్కారం కనిపిస్తోంది.

ఇదిలా ఉంటే… గడిచిన వారంలో బెస్ట్ పెర్ఫార్మర్, వరెస్ట్ పెర్ఫార్మర్‌ లను ఎంపిక చేయమని బిగ్ బాస్ ఇంటి సభ్యులను కోరాడు. అందులో నటరాజ్ మాస్టర్ ను ఎక్కువ మంది బెస్ట్ గా పేర్కొనగా, వరెస్ట్ పెర్ఫార్మర్ గా నటుడు సన్నీ పేరును ఎక్కువ మంది చెప్పడం విశేషం. దాంతో సన్నీకి బిగ్ బాస్ జైలు శిక్ష విధించాడు. ఇక కిచెన్ వ్యవహారం ఆర్జే కాజల్ ను ఇంకా ఘోస్ట్ లా వెంటాడుతూనే ఉంది. కిచెన్ లో పనిచేయడం తనకు ఇష్టం లేకపోయినా… చేస్తున్నానని, అయినా కొందరు కుటుంబ సభ్యులు తనను టార్గెట్ చేస్తున్నారంటూ కాజల్ చేసిన వ్యాఖ్యలతో ప్రియ విభేదించింది. కాజల్ మాటలలో లాజిక్ లేదని ఖండించింది. చివరకూ మాటా మాటా పెరిగింది. ఇతర కుటుంబ సభ్యులు వారించడంతో ఈ గొడవ కొద్ది సేపటికి సద్దుమణిగింది. ఆ తర్వాత తన మాటలతో కాజల్ హర్ట్ అయ్యిందని గ్రహించిన ప్రియ వెళ్ళి సారీ చెప్పింది.

ఈ రోజు చివరగా యాంకర్ రవి, కాజల్ కు బిగ్ బాస్ వారి రియల్ ప్రొఫెషన్ కు సంబంధించిన పని అప్పగించాడు. ‘బి.బి. న్యూస్’ లో భాగంగా ఇంటి సభ్యుల మనసులోని మాటలను తెలుసుకుని చెప్పమని కోరాడు. దాంతో ఓ అడుగు ముందుకు వేసి రవి, కాజల్… ఇంటిలోని మగవాళ్ళను ‘హౌస్ మేట్స్ లో ఎవరు మీకు వైఫ్ గా, గర్ల్ ఫ్రెండ్ గా, పని మనిషిగా ఉండాలని కోరుకుంటున్నారు?’ అని ప్రశ్నించారు. మానస్, శ్రీరామచంద్ర, సన్నీ లకు ఇవి కాస్తంత ఇబ్బంది పెట్టే ప్రశ్నలే! అయినా వాళ్లంతా తెలివిగా సమాధానం చెప్పారు. పనిలో పనిగా జైలు లో ఉన్న సన్నీ అయితే కాజల్ ను పని మనిషిగా పెట్టుకుంటానని చెప్పేశాడు. అలా ఒకరిద్దరు ఫిమేల్ మేడ్ గా కాజల్ పేరును చెప్పడంతో మరోసారి ఆమె టార్గెట్ గా మారిపోయింది. కొసమెరుపు ఏమిటంటే… బిగ్ బాస్ హౌస్ లో కేవలం జంట ప్రేమలే కాదు… ముక్కోణ ప్రేమలూ సాగుతున్నాయని అందుకు శ్రీరామచంద్ర, సన్ని, హమీద మధ్య సాగుతున్న సమ్ థింగ్ సమ్ థింగ్ ఉదాహరణ అంటూ కొందరు ప్రచారం మొదలెట్టారు. యాని మాస్టర్ డైరెక్షన్ లో ఇంటి సభ్యులు చేసిన పెర్ఫార్మెన్స్ లో శ్రీరామచంద్ర, హమిదా చేసిన పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

గత మూడు నాలుగు రోజులుగా బిగ్ బాస్ షో ఎడిటింగ్ చాలా పూర్ గా ఉంది. ఏ టాస్క్… ఎప్పుడు? ఎవరు? ఎవరికి ఇచ్చారనే దానిలో క్లారిటీ లేదు. అంతేకాదు… కొన్ని ప్రధానమైన అంశాలను కూడా సమయాభావం వల్ల కావచ్చు స్కిప్ చేసేస్తున్నారు. దాంతో బిస్ బాస్ షో చూశామంటే చూశాం… అన్నట్టుగా ఉంది. ముందు వెనుక విషయాలను కట్ చేయడంతో ఓటు వేయాల్సి వ్యూవర్స్ కు స్పష్టత కరువయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఈ వారం ఎలిమినేషన్స్ లో ఉన్న ఉమ, నటరాజ్, కాజల్, లోబో, ప్రియాంక, యాని, ప్రియ లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆసక్తికరంగా మారింది. గడిచిన మూడు నాలుగు రోజుల్లో వీరంతా ఏదో రకంగా సేఫ్ జోన్ లోకి వెళ్ళడానికి తమ వంతు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. లోబో – ఉమ లవ్ బర్డ్ గా మారిపోయారు. కాజల్, ప్రియ ఏదో రకంగా మిగిలిన సభ్యుల అటెన్షన్ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. యాని మాస్టర్ కు శ్వేత వర్మ బాసటగా నిలుస్తోంది. నటరాజ్ మాస్టర సైతం రాముడు మంచి బాలుడు తరహాలో ప్రవర్తిస్తున్నారు. మరి బిగ్ బాస్ ఎవరిని ఉంచి, ఎవరిని బయటకు పంపుతాడో చూడాలి. అయితే ఎక్కువ మంది ఉమాదేవికి ఉద్వాసన జరగొచ్చని భావిస్తున్నారు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Bigg Boss 5
  • Bigg Boss 5 Sep 17th Episode
  • Bigg Boss Telugu 5
  • Bigg Boss Telugu Season 5
  • nagarjuna

తాజావార్తలు

  • Vijayawada : విజయవాడ యనమలకుదురు శివాలయంలో ఇంటి దొంగలు

  • Cyber Fraud : మాజీ డీజీపీ మనుమరాలికి రూ.1.20 కోట్ల టోకరా.!

  • Poonam Kaur: ఫేక్ సిక్కులు నిలబడలేరు..పూనం మరో సంచలనం!

  • Andhra Pradesh : కాకినాడ పోర్టులో రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్న సివిల్ సప్లై అధికారులు

  • Suryapet Job Scam: స్టాఫ్ నర్స్ ఉద్యోగాల మోసం.. 60 మందిని బురిడీ కొట్టించిన కంత్రీగాడు..

ట్రెండింగ్‌

  • Viral Video: ఏం ఐడియా వేశావ్ గురూ.. “మీ బాధలు నాతో పంచుకోండి” అంటూ డబ్బులు సంపాదన.. వీడియో వైరల్..!

  • KVS Admissions 2026-27: కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల సందడి.. 2026-27 విద్యా సంవత్సర ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల

  • BSNL Recharge: రోజుకు రూ. 8లకే 3GB డేటా + కాలింగ్.. తక్కువ ఖర్చులో భారీ లాభం..!

  • Veg Manchurian Recipe: ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ వెజ్ మంచురియా టేస్ట్.. చేసేయండి ఇలా..!

  • Rice vs Chapati: డయాబెటిస్ ఉన్నవారు అన్నం తినాలా? లేక చపాతీ తినాలా? తింటే ఎంత తినాలి.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions