జూనియర్ ఎన్టీఆర్ టాలీవుడ్ లో స్టార్ హీరోగా మాత్రమే కాదు మంచి హోస్ట్ గా కూడా నిరూపించుకున్నాడు. ఇప్పటికే పలు షోలకు హోస్ట్ గా వ్యవహరించిన ఎన్టీఆర్ ప్రస్తుతం “ఎవరు మీలో కోటీశ్వరులు” షోను హోస్ట్ చేస్తున్నారు. ఈ గేమ్ షో కర్టెన్ రైజర్ షోకు 11.4 వచ్చింది. దానికి కారణం ఏంటంటే లాంచ్ ఎపిసోడ్ లో తారక్ హోస్ట్ గా వ్యవహరించగా, చరణ్ అతిథిగా విచ్చేసి హాట్ సీట్ లో కూర్చున్నాడు. ఆ తరువాత షో టిఆర్పి మొత్తం పడిపోయింది. అయితే తాజాగా వచ్చిన టిఆర్పి రేటింగ్ చూస్తుంటే నెమ్మదిగా ఎన్టీఆర్ మ్యాజిక్ పని చేస్తున్నట్లు అన్పిస్తోంది.
Read Also : “బిగ్ బాస్ 5” టీఆర్పీ… ఆ రికార్డు బ్రేక్ చేయలేకపోయిన నాగ్ !
షో ప్రారంభమై మూడు వారాలు అవుతోంది. వారం వారం టిఆర్పి నెమ్మదిగా పెరుగుతోంది. తాజాగా వీక్ కు 7.30 టిఆర్పి వచ్చింది. మొదటి వారానికి 5.62 టిఆర్పి రావడం షో నిర్వాహకులకు షాక్ ఇచ్చింది. రెండవ వారం “ఎవరు మీలో కోటీశ్వరులు” టీఆర్పీ 6.48 పర్వాలేదనిపించింది. ఇక మూడవ వారం షోకు 7.30 టిఆర్పి రేటింగ్ రావడం షో నిర్వాహకులకు ఊరటనిచ్చింది. ప్రతివారం పెరుగుతున్న టిఆర్పి రేటింగ్ చూసి “ఎవరు మీలో కోటీశ్వరులు” షో మేకర్స్ సంతోషంగా ఫీల్ అవుతున్నారట. మరోవైపు నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న “బిగ్ బాస్ తెలుగు సీజన్ 5” మాత్రం దూసుకెళ్తోంది. మరి రానున్న కాలంలో “ఎవరు మీలో కోటీశ్వరులు” షో “బిగ్ బాస్”ను బీట్ చేస్తుందేమో చూడాలి. ఇక తమన్నా చేస్తున్న “మాస్టర్ చెఫ్ ఇండియా” తెలుగు వంటల ప్రోగ్రాంకు కూడా ప్రేక్షకుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రావట్లేదని చెప్పాలి.