రణబీర్, అలియా, బిగ్ బి, మౌని రాయ్, డింపుల్ కపాడియా, నాగార్జున అక్కినేని కీలక పాత్రల్లో నటిస్తున్న భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ “బ్రహ్మాస్త్ర”. అయాన్ దర్శకత్వం వహించిన ‘బ్రహ్మాస్త్ర’ చిత్రాన్ని కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు. 2022 సెప్టెంబర్ 9న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ను తాజాగా హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాజమౌళి ముఖ్యఅతిథిగా పాల్గొనగా, చిత్రబృందంతో కలిసి సినిమాలో భాగమైన నాగార్జున కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా…
బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కోసం రామ్ చరణ్, అలియా భట్ కనిపించబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఎస్ఎస్ రాజమౌళిని కూడా షోకి తీసుకురానున్నట్లు వార్తలు గుప్పుమడంతో గ్రాండ్ ఫినాలే పై హైప్ దాదాపు రెట్టింపు అయ్యింది. అలాగే, రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల ’83’ సినిమా హక్కులను నాగార్జున కొనుగోలు చేసినందున వీరిద్దరూ కూడా షోలో కనిపించనున్నారట. ‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ఫైనలిస్ట్‌ల గురించి…
కింగ్ నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్‌గా మారిపోయారు. అయితే ఆయన రిలేషన్ షిప్ కౌన్సెలర్ అయ్యింది సినిమా కోసం కాదు బిగ్ బాస్ కోసం. శనివారం రాత్రి జరిగిన ‘బిగ్ బాస్ 5’ ఎపిసోడ్ లో నాగార్జున రిలేషన్ షిప్ కౌన్సెలర్ లాగా వ్యవహరించారు. హౌస్ లో షణ్ముఖ్, సిరి ప్రవర్తనను నిలదీసిన నాగ్ వెళ్లిపోవాలంటే బయటకు వెళ్లొచ్చు అంటూ బిగ్ బాస్ హౌస్ గేట్లు ఓపెన్ చేయించారు. ఒక్కొక్కరిగా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి హౌస్…
అక్కినేని నాగార్జున, నాగ చైతన్య హీరోలుగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో జీ స్టూడియోస్, అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రూపొందుతన్న సోసియో ఫాంటసీ రొమాంటిక్ మూవీ “బంగార్రాజు” మూవీ. నాగార్జున సరసన రమ్య కృష్ణ జతకట్టగా, యువ సామ్రాట్ నాగ చైతన్యతో ‘ఉప్పెన’ బ్యూటీ కృతి శెట్టి రొమాన్స్ చేయనుంది. చలపతి రావు, రావు రమేష్, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్, ఝాన్సీ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనూప్ రూబెన్స్ సౌండ్‌ట్రాక్‌లను అందించాడు. మొదటి సింగిల్ ‘లడ్డుండా’…
‘జాతిరత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా మొదటి సినిమాతోనే టాలీవుడ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఆమె థియేటర్ ఆర్టిస్ట్ మాత్రమే కాదు శిక్షణ పొందిన డ్యాన్సర్ కూడా. ‘జాతిరత్నాలు’ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ మంచు విష్ణు ‘ఢీ అంటే ఢీ’ అనే చిత్రంలో నటిస్తోంది. డిసెంబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమవుతుంది. తాజాగా ఫరియా అబ్దుల్లా ఓ ఐటెం పాటకు సంతకం చేసినట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ బ్యూటీ కింగ్ నాగార్జునతో ఐటెం సాంగ్…
కింగ్ నాగార్జున, ఆయన తనయుడు నాగ చైతన్య కలిసి నటిస్తున్న ఫీల్ గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’. రమ్యకృష్ణ, కృతి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు కళ్యాణ్ కృష్ణ రచన, దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. శరవేగంగా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పటికప్పుడు విడుదల…
బిగ్ బాస్ సీజన్ 5 పదకొండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా జరిగాయి. సన్నీ ప్రవర్తనతో విసిగి వేసారిన ఇంటి సభ్యులంతా అతన్ని టార్గెట్ చేయడంతో గిల్టీ అనే బోర్డును బిగ్ బాస్ చెప్పేవరకూ మెడలోనే ఉంచుకోవాలని నాగార్జున ఆదివారం సన్నీకి చెప్పాడు. నామినేషన్స్ ప్రక్రియ మొదలయ్యే వరకూ సన్నీ ఆ బోర్డ్ ను అలానే ధరించాడు. గతంలో ఇలానే షణ్ముఖ్ ను ఇంటి సభ్యులంతా టార్గెట్ చేసినప్పుడు అతని మీద ఎలా అయితే వ్యూవర్స్ కు సానుభూతి…
బిగ్ బాస్ షోలో పాల్గొనే ఛాన్స్ రావడం ఆషామాషీ విషయం కాదు. అందులో పాల్గొన్న వాళ్ళ జీవితాలు ఎలా మారిపోతాయో ఒక్కోసారి ఊహించలేం కూడా! అదే విషయాన్ని ఆదివారం ఎపిసోడ్ మొదలు కాగానే నాగార్జున చెప్పాడు. బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొనే నాటికి గంగవ్వకు సొంత ఇల్లు లేదు. ఓ చిన్న గదిలో ఆమె కాపురం ఉండేది. దానికి తాళం చెవి కూడా లేకపోవడంతో వైరు ముక్కతో తలుపు బంధించి, బయటకు వెళ్ళేది. అలాంటి గంగవ్వ…
బిగ్ బాస్ సీజన్ 5 లో పదో వారం జస్వంత్ హౌస్ నుండి బయటకు వెళ్ళాడు, అంతే తప్పితే ఎలిమినేట్ కాలేదు! మరికొన్ని వైద్య పరీక్షలు చేయాల్సి రావడంతో బిగ్ బాస్ జస్వంత్ ను బయటకు పంపాడు. వారం క్రితం అతనికి వైద్య పరీక్షలు చేసి, సీక్రెట్ రూమ్ లో ఉంచిన బిగ్ బాస్, ఇప్పటికీ అతని ఆరోగ్యంలో మెరుగుదల కనిపించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వారం నామినేషన్స్ లో ఉన్న ఐదుగురిలో…