బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కోసం రామ్ చరణ్, అలియా భట్ కనిపించబోతున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మేకర్స్ ఎస్ఎస్ రాజమౌళిని కూడా షోకి తీసుకురానున్నట్లు వార్తలు గుప్పుమడంతో గ్రాండ్ ఫినాలే పై హైప్ దాదాపు రెట్టింపు అయ్యింది. అలాగే, రణవీర్ సింగ్, దీపికా పదుకొణెల ’83’ సినిమా హక్కులను నాగార్జున కొనుగోలు చేసినందున వీరిద్దరూ కూడా షోలో కనిపించనున్నారట.
‘బిగ్ బాస్ తెలుగు 5’ సీజన్ ఫైనలిస్ట్‌ల గురించి కొన్ని కీలకమైన ప్రకటనలతో పాటు అతిథులకు వసతి కల్పించడానికి నిర్మాతలు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సన్నీ, షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, మానస్, మరియు సిరి లు ఈ సీజన్‌లో టైటిల్‌ను గెలుచుకోవడానికి టాప్-5 జాబితాలో ఉన్నారు. ఈ ఆదివారం ‘బిగ్ బాస్ తెలుగు 5’ గ్రాండ్ ఫినాలే విజేత ఎవరో తేలనుంది.